AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Basinga Balaalu Song: 11 లక్షల బడ్జెట్… కోట్లలో వ్యూస్!.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాసింగా బలాలు సాంగ్.. ఎంత లాభం వచ్చిందంటే..

ప్రస్తుతం యూట్యూబ్ ప్రపంచాన్ని తెలంగాణ ఫోక్ సాంగ్స్ ఏలేస్తున్నాయి. ప్రతి వారం కొత్త కొత్త పల్లె పాటలు సోషల్ మీడియాలో సెన్సేషన్ అవుతున్నాయి. సినిమా పాటలకు మించిన క్రేజ్, మిలియన్ వ్యూస్ అందుకుంటున్నాయి. అయితే లక్షలు పెట్టిన తీసిన ఈ పాటలు ఇప్పుడు నిర్మాతలకు కోట్ల వర్షం కురిపిస్తున్నాయి. ప్రస్తుతం యూట్యూబ్ వరల్డ్ షేక్ చేస్తున్న సాంగ్ బాసింగా బలాలు. ఈ పాటకు ఎంత రెవెన్యూ వచ్చిందో తెలుసుకుందామా.

Basinga Balaalu Song: 11 లక్షల బడ్జెట్... కోట్లలో వ్యూస్!.. యూట్యూబ్‌ను షేక్ చేస్తున్న బాసింగా బలాలు సాంగ్.. ఎంత లాభం వచ్చిందంటే..
Basinga Balaalu Song
Rajitha Chanti
|

Updated on: Aug 19, 2026 | 3:41 PM

Share

తెలంగాణ ఫోక్ సాంగ్స్.. కేవలం రాష్ట్రం కాదు.. ప్రపంచాన్ని ఉర్రూతలూగిస్తున్నాయి. దేశాలు దాటి మరి పాపులర్ అవుతున్నాయి. యూట్యూబ్, సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన బాసింగా బలాలు సాంగ్ మారుమోగుతుంది. చిన్నా, పెద్ద తేడా లేకుండా ఈ పాటలకు స్టెప్పులేస్తున్నారు. ఇందుకు సంబంధించిన రీల్స్, షార్ట్స్ నెట్టింట ఏ రేంజ్ లో హల్చల్ చేస్తున్నాయో చెప్పక్కర్లేదు. అచ్చమైన తెలంగాణ యాస, పల్లెటూరి పదాలు, సింపుల్ ట్యూన్, క్యాచీ బీట్ తో ఉండే పాటలు ఇప్పుడు యువతను తెగ ఆకట్టుకుంటున్నాయి. ఇక ఇటీవల నెట్టింట తెగ ఫేమస్ అయిన సాంగ్ బాసింగా బాలలే. ఈ పాటకు యూట్యూబ్ లో వస్తున్న రెస్పాన్స్ గురించి చెప్పక్కర్లేదు. ఫోక్ డ్యాన్సర్స్ ఈశ్వర్ సాయి, వైష్ణవి జంటగా కనిపించిన ఈ పాటకు ఇప్పటికే 86 మిలియన్ వ్యూస్ వచ్చాయి. కేవలం రెండు నెలల్లో ఈ స్థాయిలో వ్యూస్ రావడమంటే అంత మాములు విషయం కాదు.

ఎక్కువ మంది చదివినవి : Cinema : మైండ్ బ్లాక్ చేసే సస్పెన్స్ థ్రిల్లర్.. ప్రతి ఎపిసోడ్ సీటు అంచున కూర్చోబెట్టాల్సిందే.. ఓటీటీలో ఈ సిరీస్ అస్సలు మిస్ కాకండి..

ఈ పాటకు శేఖర్ వైరస్ కొరియోగ్రఫీ అందించగా.. ఈశ్వర్ సాయి, వైష్ణవి ఇద్దరూ తమ చక్కటి సింపుల్ డ్యాన్స్ స్టెప్పులతో ఆకట్టుకున్నారు. సినిమా పాటలకు మించిన క్రేజ్ ఇప్పుడు ఈ పాట సొంతం చేసుకుంది. ఇదెలా ఉంటే.. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శేఖర్ వైరస్ మాట్లాడుతూ ఈ పాటకు కొరియోగ్రఫీ చేయడానికి దాదాపు 11 లక్షలు బడ్జెట్ అయ్యిందని తెలిపారు. ఈ 11 లక్షల బడ్జెట్‌లో నటీనటులు (ఆర్టిస్టులు), కొరియోగ్రాఫర్, డిఓపి (DOP) రెమ్యూనరేషన్లతో పాటు లొకేషన్ సెటప్, ప్రాపర్టీస్, రిహార్సల్స్, ఆహార ఖర్చులు, ప్రమోషన్స్ బాధ్యతలను సైతం చేసినట్లు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood: ఆ సినిమాను ఆ హీరో తప్ప మరెవరు చేయలేరు.. అందుకే నేను రిజెక్ట్ చేశా.. నటుడు సుమంత్..

ఈ సాంగ్ విన్న వెంటనే నచ్చడంతో, సరైన ఆర్టిస్టులను ఎంపిక చేసి నాణ్యమైన అవుట్‌పుట్ కోసం నిర్మాతను ఒప్పించి రెండు నెలలు వేచి చూసి ఈ ప్రాజెక్ట్‌ను పూర్తి చేశానని తెలిపారు. ప్రొఫెషనల్ డ్యాన్సర్లే కాకుండా సామాన్య ప్రజలు, ముఖ్యంగా మహిళలు, రీల్స్ చేసేవారు సులువుగా అనుకరించేలా హుక్ స్టెప్స్ కంపోజ్ చేయడమే ఈ పాట సక్సెస్ కావడానికి కారణమని తెలిపారు. అయితే ఈ పాటకు ఎంత రెవెన్యూ వచ్చిందనేది మాత్రం వెల్లడించలేదు. నివేదికల ప్రకారం ఈ పాటకు దాదాపు 25 లక్షలకు పైగానే వచ్చినట్లు తెలుస్తోంది.

ఎక్కువ మంది చదివినవి : Cinema : చనిపోయిన అమ్మాయిని వేధించే కుర్రాడు.. ప్రతి 20 నిమిషాలకు ఊహించని మలుపులు.. ఓటీటీని శాసిస్తున్న సినిమా..

బాసింగా బలాలు సాంగ్..

 ఎక్కువ మంది చదివినవి : Hemachandra: నేను చేసిన మొదటి తప్పు అదే.. వాటి నుంచి ఎన్నో నేర్చుకున్నాను.. సింగర్ హేమచంద్ర..

Follow Us
టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..!
టెస్ట్ క్రికెట్‌కి కొత్త హీరో వచ్చేశాడు..!
11 లక్షలతో తీసిన బాసింగా బలాలు సాంగ్.. ఎంత వచ్చిందంటే..
11 లక్షలతో తీసిన బాసింగా బలాలు సాంగ్.. ఎంత వచ్చిందంటే..
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్.. కట్‌చేస్తే.. ఆ జట్టు ఔట్..?
డబ్ల్యూటీసీ ఫైనల్ రేసులో భారత్.. కట్‌చేస్తే.. ఆ జట్టు ఔట్..?
వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..
వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..
ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా
ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..
ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..
ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..
8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..
షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..
షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..