తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు ఏరియల్ సర్వే
Cyclone Arnab Effect: తుఫాను ఆర్నబ్ ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, నీట మునిగిన వ్యవసాయ భూములు, ఇతర నష్టాలను పరిశీలించారు. బాధిత రైతులకు సహాయం అందించేందుకు నష్టాన్ని అంచనా వేయాలని అధికారులను ఆదేశించారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాను ఏపీలోని పలు జిల్లాలను అతలాకుతలం చేసింది. తుఫాను ప్రభావిత ప్రాంతాల్లో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గురువారంనాడు ఏరియల్ సర్వే నిర్వహించారు. తుఫాను కారణంగా దెబ్బతిన్న పంటలు, నీట మునిగిన వ్యవసాయ భూములు, ఇతర నష్టాలను ఆయన పరిశీలించారు. కోనసీమ, కృష్ణా, పశ్చిమ గోదావరి ప్రాంతాల్లో తుఫాను ప్రభావం ఎక్కువగా కనిపించింది. వరి సహా పలు పంటలు నీట మునగగా, ఉద్యాన పంటలకు కూడా నష్టం వాటిల్లింది. విద్యుత్ స్తంభాలు నేలకూలడం, రహదారులు దెబ్బతినడం వంటి సమస్యలు తలెత్తాయి. క్షేత్రస్థాయిలో పంట నష్టాన్ని అంచనా వేసి బాధితులకు సహాయం అందించాలని ప్రభుత్వం చర్యలు చేపట్టింది. నష్టంపై కేంద్రానికి నివేదిక సమర్పించి, అదనపు సాయం అందించాలని చంద్రబాబు కోరారు.
గోల్డ్ షాప్‌లో మహిళల చేతివాటం.. రూ.45 లక్షల విలువైన బంగారం మాయం
నీటిలో చిక్కుకున్న ఐదుగురిని రక్షించిన పోలీసులు!
ఏంట్రా ఇలా ఉన్నారు.. AIతో చావును కూడా మోసం చేశాడు..
పరుగెత్తి గెలిచింది కానీ.. నిరాశే ఎదురైంది!
సీఎంనే కదిలించిన చిన్నారి పెద్ద మనసు
రూ.3 లక్షల ఐఫోన్లో డిస్ప్లే సమస్య.. అసలు కారణం ఇదేనా?
11 కేవీ విద్యుత్ వైర్‌పై ఉమ్మి వేశాడు.. క్షణాల్లో..

