హిట్లు లేకపోయినా చేతినిండా సినిమాలతో ఫుల్ బిజి.. సక్సెస్ సీక్రెట్ ఇదే

Rajitha Chanti

Pic credit - Instagram

29 October 2026

 సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్‌గా కొనసాగాలంటే వరుస విజయాలు చాలా అవసరం అంటారు. సాధారణంగా బాక్సాఫీస్ వద్ద సరైన హిట్లు లేకపోతే అవకాశాలు రావడం కష్టం.

కానీ, టాలెంటెడ్ బ్యూటీ నిధి అగర్వాల్ విషయంలో మాత్రం ఈ రూల్ పూర్తిగా భిన్నంగా కనిపిస్తోంది. ఆమె ఖాతాలో భారీ బ్లాక్ బస్టర్ హిట్లు లేకపోయినా..

 ప్రస్తుతం ఆమె చేతిలో అరడజనుకు పైగా క్రేజీ ప్రాజెక్టులు ఉండటం విశేషం. టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ అనే తేడా లేకుండా ఆమె వరుస ఆఫర్లతో దూసుకెళ్తున్నారు.

‘సవ్యసాచి’ చిత్రంతో టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన నిధి అగర్వాల్.. రామ్ పోతినేనితో నటించిన ‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో భారీ సక్సెస్‌ను సొంతం చేసుకున్నారు. 

ఆ తర్వాత పవన్ కల్యాణ్ ‘హరిహర వీరమల్లు’ , ప్రభాస్ ‘ది రాజా సాబ్’ వంటి ప్రాజెక్టుల్లో నటించినప్పటికీ, వాటిలో కొన్ని ఆశించిన స్థాయిలో ఫలితాలను ఇవ్వలేదు

అయినప్పటికీ దర్శక-నిర్మాతలు ఆమె వైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణం ఆమె అంకితభావం, గ్లామర్, ప్రొఫెషనల్ బిహేవీయరేనని సినీ వర్గాలు చెబుతున్నాయి.

ప్రస్తుతం ఆమె టాలీవుడ్‌లో కొన్ని ప్రత్యేక ప్రాజెక్టులతో పాటు, బాలీవుడ్, కోలీవుడ్‌లలో ప్రముఖ బ్యానర్‌లలో సినిమాలు చేస్తూ రాబోయే రెండేళ్ల పాటు ఫుల్ బిజీగా ఉన్నారు.

 కమర్షియల్ సినిమాల్లో గ్లామర్ రోల్స్ మాత్రమే కాకుండా, నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రల్లోనూ నిధి తన వంతు వంద శాతం ఎఫర్ట్స్ పెడుతుంది నిధి అగర్వాల్.