కీర్తిసురేష్ చేదు అనుభవం.. భర్త కళ్లముందే ఓ వ్యక్తి ఇలా 

30 October 2026

Rajeev 

స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్‌కు విమాన ప్రయాణంలో చేదు అనుభవం ఎదురైంది. ఈ విషయాన్ని ఆమె స్వయంగా ఓ ఇంటర్వ్యూలో వెల్లడించింది.

కీర్తి సురేష్ తన భర్త ఆంటోనీ తట్టిల్‌తో కలిసి ఇటలీలోని మిలాన్ నుంచి ఇండియాకు విమానంలో తిరిగి వస్తున్నారు.

 అదే విమానంలో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తి మద్యం మత్తులో కీర్తి సురేష్ దగ్గరకు వచ్చాడు. తనతో సెల్ఫీ దిగాలని ఆ వ్యక్తి కీర్తిని కోరాడు.

అయితే అతడి పరిస్థితిని గమనించిన ఆమె కాసేపు ఆగాలని సూచించిందట. కీర్తి చెప్పిన మాటలను పట్టించుకోకుండా వెంటనే సెల్ఫీ దిగాల్సిందేనంటూ ఆ వ్యక్తి ఒత్తిడి చేశాడట.

సాధారణంగా చాలా ప్రశాంతంగా ఉండే తన భర్త ఆంటోనీ సైతం ఆ వ్యక్తి ప్రవర్తనతో తీవ్ర అసహనానికి గురయ్యారని కీర్తి తెలిపింది.

పరిస్థితి అదుపు తప్పేలా ఉండటంతో చివరకు కీర్తి దంపతులు విమాన సిబ్బంది సహాయం తీసుకున్నారు. దీంతో సిబ్బంది జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరించారట.