AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Hyderabad: సన్నబియ్యం పేరుతో హైదరాబాద్‌లో ఘరానా దందా!

Hyderabad: సన్నబియ్యం పేరుతో హైదరాబాద్‌లో ఘరానా దందా!

Ram Naramaneni
|

Updated on: Oct 29, 2026 | 6:35 PM

Share

హైదరాబాద్‌లో సన్నబియ్యం పేరుతో అక్రమ దందా సాగుతున్నట్లు ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దొడ్డు బియ్యాన్ని పాలిష్‌ చేసి సన్నబియ్యంగా విక్రయించడంతో పాటు, రేషన్‌ బియ్యాన్ని బ్రాండెడ్‌ బియ్యం పేరుతో అమ్ముతున్నట్లు ఫిర్యాదులు రావడంతో కర్మన్‌ఘాట్‌ పరిధిలో పలు రైస్‌ డిపోలపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బియ్యం నాణ్యత, ధర, తూకంలో తేడాలను పరిశీలించారు.

కర్నూల్‌ రైస్‌, బీపీటీ, సోనామసూరి.. ఇలా పేరున్న బ్రాండ్ల బియ్యం కొంటున్నారా? సన్నబియ్యం కోసం వేలకు వేలు ఖర్చు చేస్తున్నారా? అయితే కాస్త అప్రమత్తంగా ఉండాల్సిందే! బ్రాండెడ్‌ బియ్యం పేరుతో కొందరు వ్యాపారులు అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు కలకలం రేపుతున్నాయి. దొడ్డు బియ్యాన్ని పాలిష్‌ చేసి సన్నబియ్యంగా విక్రయించడంతో పాటు, రేషన్‌ బియ్యాన్ని కూడా బ్రాండెడ్‌ బియ్యం పేరుతో మార్కెట్‌లో అమ్ముతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో హైదరాబాద్‌లోని కర్మన్‌ఘాట్‌ పరిధిలో పలు రైస్‌ డిపోలపై పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్‌ అధికారులు సంయుక్తంగా తనిఖీలు చేపట్టారు. బృందాలుగా ఏర్పడి వివిధ దుకాణాల్లో సోదాలు నిర్వహించారు. రేషన్‌ బియ్యాన్ని పాలిష్‌ చేసి సన్నబియ్యంగా విక్రయిస్తున్నారనే ఫిర్యాదులతో బియ్యం నమూనాలను సేకరించారు. వినియోగదారులకు తక్కువ పరిమాణంలో బియ్యం ఇస్తున్నారనే ఆరోపణలపైనా పరిశీలన చేపట్టారు.

అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో కొన్ని రైస్‌ డిపోల నిర్వాహకులు దుకాణాలను మూసివేసి వెళ్లిపోయినట్లు సమాచారం. మరికొన్ని డిపోలను కనీస ట్రేడ్‌ లైసెన్స్‌ లేకుండానే నిర్వహిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. బియ్యం నాణ్యత, ధర, తూకానికి సంబంధించిన అంశాలపై అధికారులు వివరాలు సేకరించారు.

రేషన్‌ బియ్యం అక్రమ రవాణా, విక్రయాలు, నిబంధనల ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు పౌరసరఫరాల శాఖ అధికారులు సిద్ధమవుతున్నారు. తనిఖీల్లో సేకరించిన నమూనాల పరిశీలన అనంతరం మరిన్ని వివరాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. బ్రాండెడ్‌ బియ్యం కొనుగోలు చేసే వినియోగదారులు ప్యాకింగ్‌, నాణ్యత, తూకం, బిల్లుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు.

Follow Us