పాన్ ఇండియా సినిమాలతో ఫుల్ బిజీగా శ్రుతిహాసన్ 

30 October 2026

Rajeev 

తెలుగు, తమిళ, హిందీ భాషల్లో నటిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న శృతి హాసన్.. మరోసారి తెలుగు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.

మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటిస్తున్న తెలుగు సినిమా ఆకాశంలో ఒక తారలో శృతి హాసన్ కీలక పాత్రలో కనిపించనుంది.

చిత్రానికి పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమాస్ నిర్మాణంలో ఈ సినిమా రూపొందుతోంది.

ఈ సినిమాలో శృతి హాసన్ పాత్ర కథలో కీలక మలుపులకు కారణమవుతుందని చిత్ర బృందం వెల్లడించింది.

ఆకాశంలో ఒక తార చిత్రాన్ని 2026 నవంబర్ 20న విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. తెలుగు సహా నాలుగు భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సలార్: పార్ట్ 2 లోనూ శృతి హాసన్ ఆద్య పాత్రలో కనిపించే అవకాశం ఉంది.

 మొదటి భాగం సలార్ లో ఆద్యగా కనిపించిన శృతి హాసన్.. రెండో భాగంలోనూ కొనసాగుతుందనే అంచనాలు అభిమానుల్లో ఆసక్తిని పెంచుతున్నాయి.