AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajeev Kanakala: ఎన్టీఆర్ డ్రాగన్ ఒక అణుబాంబులాంటిది.. ఓపెన్‏హైమర్ స్థాయిని మించి ఉంటుంది.. అంచనాలు పెంచేశాడు భయ్యా..

యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ తెరకెక్కిస్తున్న సినిమా డ్రాగన్. ఇందులో కన్నడ భామ రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తుంది. భారీ అంచనాల మధ్య రూపొందిస్తున్న ఈ సినిమాలో నటుడు రాజీవ్ కనకాల కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ఆయన డ్రాగన్ చిత్రం గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. దీంతో ఇప్పుడు ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు.

Rajeev Kanakala: ఎన్టీఆర్ డ్రాగన్ ఒక అణుబాంబులాంటిది.. ఓపెన్‏హైమర్ స్థాయిని మించి ఉంటుంది.. అంచనాలు పెంచేశాడు భయ్యా..
Rajeev Kanakala About NTR Dragon
Rajitha Chanti
|

Updated on: Oct 30, 2026 | 2:46 PM

Share

నటుడు రాజీవ్ కనకాల ఇటీవల ఒక ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ నటిస్తున్న డ్రాగన్ చిత్రం, దర్శకుడు ప్రశాంత్ నీల్ పనితీరు, ఎన్టీఆర్‌తో తన స్నేహం, అలాగే తన కెరీర్ ప్రయాణం గురించి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఎన్టీఆర్ హీరోగా వస్తున్న డ్రాగన్ చిత్రంలో రాజీవ్ కనకాల కీలకపాత్రలో నటిస్తున్నారు. ఈ క్రమంలోనే డ్రాగన్ చిత్రం గురించి ఆయన చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. డ్రాగన్ ప్రాజెక్ట్‌పై మాట్లాడుతూ, దర్శకుడు ప్రశాంత్ నీల్‌కు ఏం కావాలో పూర్తి స్పష్టత ఉంటుందని అన్నారు. “టెక్నిక్‌ను ఎలా ఉపయోగించాలో, నటుల నుండి నటనను ఎలా రాబట్టాలో ఆయనకు స్పష్టంగా తెలుసు. అంతా చక్కగా చేస్తే అభినందించడం కూడా ఆయనకు తెలుసు. ఆయన చాలా అందంగా వివరించి చేయించుకుంటారు. డైరెక్టర్‌కు స్పష్టత ఉంటే నటుడికి అది చాలా సులువు అవుతుంది,” అని రాజీవ్ కనకాల వివరించారు. ఇప్పటివరకు ఈ సినిమా కోసం కేవలం ఎనిమిది రోజులు మాత్రమే షూటింగ్‌లో పాల్గొన్నానని, త్వరలోనే మిగిలిన షూటింగ్ ప్రారంభం కానుందని తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి :  Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

ఎన్టీఆర్ పట్ల తనకున్న అభిమానాన్ని రాజీవ్ కనకాల ప్రత్యేకంగా ప్రస్తావించారు. “ఎన్టీఆర్ అంటే నాకు విపరీతమైన ఇష్టం. ఆయన వీడియోలు స్టేటస్‌లో పెట్టుకోకుండా ఉండే రోజు ఉండదు. నా స్నేహితులందరికీ ఈ విషయం తెలుసు” అని ఆయన అన్నారు. డ్రాగన్ గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్, ఎన్టీఆర్ ఆర్ట్స్, మైత్రి మూవీ మేకర్స్ కలయిక “ఒక అణుబాంబు” లాంటిదని, ఈ చిత్రం “ఓపెన్‌హైమర్” స్థాయిని మించి ఉంటుందని రాజీవ్ కనకాల వ్యక్తం చేశారు. గత ఎనిమిది-తొమ్మిది సంవత్సరాలుగా టెంపర్ చిత్రం నుండి తమ కాలర్లు దించలేదని, ఎన్టీఆర్ ఒకప్పుడు చేసిన “మీకు నచ్చేదాకా చేస్తూనే ఉంటాను” అనే మాటను గుర్తు చేసుకున్నారు. ఈ వ్యాఖ్యలు తన వ్యక్తిగత అభిమానాన్ని తెలియజేసేవని, వృత్తిపరమైనవి కావని ఆయన స్పష్టం చేశారు. ఎన్టీఆర్‌తో తన స్నేహం గురించి మాట్లాడుతూ, ఎంతటి బిజీ షెడ్యూల్స్ ఉన్నా, ఇద్దరూ కలవడానికి సమయం కుదిరినప్పుడు ఆ బంధం అలాగే నిలబడుతుందని అన్నారు. ఒకప్పుడు రోజూ కలిసేవాళ్ళమని, పిల్లలు పుట్టాక వారిని చూడాల్సిన బాధ్యత వల్ల కలవడం తగ్గిందని చెప్పారు. అయినా ఎన్టీఆర్ విసుగు అనిపించినప్పుడు పిలిస్తే వెళ్లేవాడినని తెలిపారు. ఎన్టీఆర్ బావమరిది పెళ్లిలో ఒక సరదా సంఘటనను గుర్తు చేసుకున్నారు. పెళ్లికి వెళ్ళినప్పుడు ఎన్టీఆర్ తనను ఆటపట్టించాడని, స్నేహపూర్వకమైన సంభాషణలు తమ మధ్య సాధారణమని తెలిపారు. సుమతో ఎన్టీఆర్ స్టేజ్‌పై కోపంగా చూసిన ఘటనపై వచ్చిన వార్తలను ఖండిస్తూ, అది కేవలం సరదాగా చేసుకున్న బాంటర్ అని, ఆ వార్తల్లో నిజం లేదని స్పష్టం చేశారు.

ఎక్కువ మంది చదివినవి : Aamani: మా కాంబినేషన్ అంటే అప్పట్లో సూపర్ హిట్.. ఆ హీరోతో ఎక్కువ సినిమాలు చేశా.. ఆమని ..

తన కెరీర్ గురించి మాట్లాడుతూ, ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లు తన ఎదుగుదలకు ఎంతో సహాయపడ్డాయని కనకాల పేర్కొన్నారు. ఆహా, ఈటీవీ విన్, ప్రైమ్ వీడియో (అమెజాన్), సోనీ లివ్, జీ5 వంటి అనేక ప్లాట్‌ఫామ్‌లలో నటించానని, అవి తనకు విభిన్నమైన పాత్రలను అందించాయని అన్నారు. నల్లజర్ల రోడ్ వంటి క్యారెక్టర్స్ తన నటనా సామర్థ్యాన్ని నిరూపించుకోవడానికి బాగా ఉపయోగపడ్డాయని తెలిపారు. ఇకపై వన్ డే షూట్స్, ప్రాధాన్యత లేని, మరణించే క్యారెక్టర్లకు దూరంగా ఉంటానని, అలాంటి వాటికి “నో” చెప్పడం నేర్చుకున్నానని చెప్పారు. గతంలో మొహమాటం వల్ల కొన్ని పాత్రలు చేసినా, ఇప్పుడు తన కెరీర్ పట్ల స్పష్టమైన అవగాహనతో ఉన్నానని రాజీవ్ కనకాల తెలిపారు. తాను హోస్ట్ చేసిన అభిమాని షో గురించి చెబుతూ, నాగ చైతన్య ఒకసారి 16 గంటలు షూట్ కోసం ఎదురుచూశారని, ఆయనతో పాటు కల్యాణ్ రామ్, ఎన్టీఆర్, ప్రభాస్ వంటి అనేక మంది హీరోలు ఎంతో సహకరించారని వారికి కృతజ్ఞతలు తెలిపారు.

ఎక్కువ మంది చదివినవి : Soundarya : సౌందర్యతో 3 బ్లాక్ బస్టర్స్ చేశా.. ఆమె భర్త ఇప్పుడు ఏం చేస్తున్నారంటే.. టాలీవుడ్ హీరో కామెంట్స్..

ఎక్కువ మంది చదివినవి : ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

Follow Us
మీ చేతిలో హృదయ రేఖ ఎలా ఉంది? తెగిపోయినా, చిక్కుపడినా దాని అర్థం..
మీ చేతిలో హృదయ రేఖ ఎలా ఉంది? తెగిపోయినా, చిక్కుపడినా దాని అర్థం..
ఎన్టీఆర్ డ్రాగన్ పై రాజీవ్ కనకాల కామెంట్స్.. అంచనాలు పెంచేశాడు ..
ఎన్టీఆర్ డ్రాగన్ పై రాజీవ్ కనకాల కామెంట్స్.. అంచనాలు పెంచేశాడు ..
నరక చతుర్దశిని ఛోటీ దీపావళి అని ఎందుకు పిలుస్తారు? పురాణ కథ వెనుక
నరక చతుర్దశిని ఛోటీ దీపావళి అని ఎందుకు పిలుస్తారు? పురాణ కథ వెనుక
JNVST నవోదయ 6వ తరగతి హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..
JNVST నవోదయ 6వ తరగతి హాల్‌టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ ఇలా..
పూలే పూలు.. ఇలా చేస్తే చలికాలంలో కూడా మల్లె చెట్టు విరగబూస్తుంది
పూలే పూలు.. ఇలా చేస్తే చలికాలంలో కూడా మల్లె చెట్టు విరగబూస్తుంది
న్యూజిలాండ్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం
న్యూజిలాండ్ విధ్వంసం.. భారత్ ముందు భారీ లక్ష్యం
చేనేత కార్మికుడి ఇంట ముగ్గురు డాక్టర్లు.. ఒకే ఏడాది NEETలో సత్తా!
చేనేత కార్మికుడి ఇంట ముగ్గురు డాక్టర్లు.. ఒకే ఏడాది NEETలో సత్తా!
స్మార్ట్‌వాచ్‌లు స్ట్రోక్‌ను గుర్తించగలవా?
స్మార్ట్‌వాచ్‌లు స్ట్రోక్‌ను గుర్తించగలవా?
విశాఖపట్నం నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీ.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు
విశాఖపట్నం నుంచి కర్ణాటక టూర్ ప్యాకేజీ.. 6 రోజుల్లో ప్రముఖ ఆలయాలు
5సార్లు మెయిన్స్‌.. 3 సార్లు ఇంటర్వ్యూలో Fail.. 6వ ప్రయత్నంలో IPS
5సార్లు మెయిన్స్‌.. 3 సార్లు ఇంటర్వ్యూలో Fail.. 6వ ప్రయత్నంలో IPS