AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..

కొన్ని పాటలు ఇప్పటికీ మనసులలో నిలిచిపోతాయి. ఇప్పుడు మనం మాట్లాడుకుంటున్న ఓ సాంగ్ 32 ఏళ్లు గడుస్తున్నా చెక్కుచెదరని క్రేజ్‌తో యూట్యూబ్‌ను షేక్ చేస్తుంది. అది ఆల్ టైమ్ క్లాసిక్ లవ్ సాంగ్. అప్పట్లో 90's కుర్రాళ్లు తమ లవర్స్ కోసం తెగ పాడుకునేవారు. ఇప్పటికీ ఆ పాట నెట్టింట సంచలనం సృష్టిస్తుంది. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యాజికల్ మ్యూజిక్ అప్పట్లో లవర్స్‌ను ఊపేయగా, నేటి తరం యువతను సైతం ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ చేస్తూ ఇప్పటికీ అదే జోష్‌తో ట్రెండింగ్‌లో నిలుస్తోంది.

ఏముంటది మావ ఈ పాట.. 32 ఏళ్లుగా యూట్యూబ్‏ను షేక్ చేస్తున్న లవ్ సాంగ్.. అప్పట్లో లవర్ కోసం తెగ పాడేవారు..
Andamaina Premarani Song
Rajitha Chanti
|

Updated on: Oct 26, 2026 | 9:51 PM

Share

టాలీవుడ్ చలనచిత్ర పరిశ్రమలో కొన్ని పాటలు వయసుతో సంబంధం లేకుండా ఎప్పటికీ ట్రెండింగ్‌లోనే ఉంటాయి. అలాంటి ఆల్ టైమ్ క్లాసిక్ , ఎవర్ గ్రీన్ మాస్ సాంగ్స్ జాబితాలో ‘ప్రేమికుడు’ సినిమాలోని “అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..” పాట ముందు వరుసలో ఉంటుంది. శంకర్ దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రంలో డాన్స్ డెవిల్ ప్రభుదేవా, నగ్మా జంటగా నటించగా.. ఏఆర్ రెహమాన్ అందించిన మ్యూజిక్ ఈ పాటకు ప్రాణం పోసింది. దశాబ్దాలు గడుస్తున్నా ఈ పాటలోని ఎనర్జీ, మ్యూజిక్ బీట్స్ ఇప్పਤటికీ యువతను ఉర్రూతలూగిస్తూనే ఉన్నాయి. ఈ పాటలో ప్రభుదేవా వేసిన అద్భుతమైన స్టెప్పులు, ఆయన బాడీ లాంగ్వేజ్ అప్పట్లో ఓ సంచలనం సృష్టించాయి. ముఖ్యంగా పాటలో వచ్చే యూనిక్ బీట్స్ , కొరియోగ్రఫీ సినిమాకే హైలైట్‌గా నిలిచాయి. ఎంతకాలం గడిచినా ఈ పాట ట్యూన్ వినిపిస్తే చాలు ఎవరికైనా కాళ్లు వాటంతట అవే కదులుతాయి. సోషల్ మీడియా రీల్స్ నుండి పార్టీల వరకు ప్రతిచోటా ఈ పాటకు ఉండే క్రేజ్ వేరు.

ఎక్కువ మంది చదివినవి : Ramya Krishna : మేమిద్దరం మంచి ఫ్రెండ్స్.. ఆ పాటతోనే కృష్ణవంశీతో నా కనెక్షన్ మొదలైంది.. రమ్యకృష్ణ..

ఏఆర్ రెహమాన్ కంపోజిషన్, ఎస్.పి. బాలసుబ్రహ్మణ్యం, పల్లవి గాత్రాలు ఈ పాటకు అదనపు ఆకర్షణగా నిలిచాయి. నాటి తరంతో పాటు నేటి తరం యువతను సైతం ఇన్‌స్టంట్‌గా కనెక్ట్ చేసుకునే ఈ సాంగ్ మేజిక్ ఎప్పటికీ తగ్గదు అనడంలో ఎలాంటి సందేహం లేదు. టాలీవుడ్ మ్యూజికల్ హిట్స్‌లో ఎప్పటికీ ప్రత్యేక స్థానాన్ని నిలుపుకున్న ఈ మాస్ సాంగ్ మానియా కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ట్రెండింగ్‌లోనే ఉంటుంది.

ఎక్కువ మంది చదివినవి : Brahmanandam: వాళ్లు ఏదో అనుకుంటారని ఆగకు.. జీవితంపై బ్రహ్మానందం చెప్పిన అద్భుతమైన మాటలు..

డ్యాన్సింగ్ సెన్సేషన్ ప్రభుదేవా హీరోగా నటించగా, అందాల తార నగ్మా హీరోయిన్‌గా నటించిన ఈ చితర్ంలో ప్రముఖ నటుడు గిరీష్ కర్నాడ్ ఈ చిత్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా, హీరోయిన్ తండ్రిగా కీలక పాత్ర పోషించారు. రాజకీయ కుట్రలు, ప్రేమ నేపథ్యంలో సాగే ఈ కథ ప్రేక్షకులను కట్టిపడేసింది. శంకర్ తనదైన మేకింగ్ స్టైల్‌తో ఒక సాధారణ లవ్ స్టోరీని కూడా కమర్షియల్ హంగులతో అద్భుతంగా తెరకెక్కించారు. ‘ప్రేమికుడు’ సినిమా అనగానే అందరికీ ముందుగా గుర్తువచ్చేది ఆస్కార్ విజేత ఏ.ఆర్. రెహమాన్ మ్యూజిక్. ఈ చిత్రంలోని పాటలన్నీ టాలీవుడ్‌లో ఆల్ టైమ్ చార్ట్‌బస్టర్స్‌గా నిలిచాయి.

ఎక్కువ మంది చదివినవి : Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..

అందమైన ప్రేమరాణి చెయ్యి తగిలితే..

ఎక్కువ మంది చదివినవి : SV Krishna Reddy: ఆమె అద్భుతమైన హీరోయిన్.. మధ్యతరగతి పాత్రలకు సరిగ్గా సెట్ అవుతుంది.. డైరెక్టర్ ఎస్వీ కృష్ణారెడ్డి..

Follow Us