AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకున్నారు డైరెక్టర్ కోడి రామకృష్ణ. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ దర్శక దిగ్గజం దాసరి నారాయణరావుతో తనకున్న అనుబంధం గురించి చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ముఖ్యంగా ఆయన నుంచి నుండి హార్డ్ వర్క్, నిర్మాత పట్ల గౌరవం, సహజమైన డ్రామాను పండించడం నేర్చుకున్నానని కోడి రామకృష్ణ గుర్తు చేసుకున్న మాటలు ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

Kodi Ramakrishna: ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో.. దాసరి గారు ఒక మాట అన్నారు.. డైరెక్టర్ కోడి రామకృష్ణ..
Kodi Ramakrishna
Rajitha Chanti
|

Updated on: Oct 25, 2026 | 9:05 PM

Share

దర్శక దిగ్గజం కోడి రామకృష్ణ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఎన్నో అద్భుతమైన చిత్రాలను తెరకెక్కించి ప్రేక్షకులను అలరించారు. అయితే గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తన గురువు దాసరి నారాయణరావు గారితో తన అనుబంధాన్ని, ఆయన వ్యక్తిత్వం, పనితీరు, ఇతర సినీ ప్రముఖులతో ఆయనకున్న సాన్నిహిత్యాన్ని ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన విషయాలు ఇప్పుడు మరోసారి సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. దాసరి గారి నుండి తాను నేర్చుకున్న ముఖ్యమైన అంశాలు హార్డ్ వర్క్, నిర్మాత పట్ల గౌరవం అని కోడి రామకృష్ణ వివరించారు. దాసరి గారి ప్రత్యేకత డ్రామాను సహజంగా పండించడంలో ఉందని, ఆయన చిత్రాలలో ఎంత తీవ్రమైన భావోద్వేగ సన్నివేశమైనా అది పాతబడిపోకుండా, మెలోడ్రామాగా అనిపించకుండా, మన ముందు నిజంగా జరుగుతున్నట్లు ఉంటుందని కోడి రామకృష్ణ పేర్కొన్నారు. “నీది గుండె కాదు రాతిబండ” వంటి డైలాగులు కూడా వాటికి ఒక పర్పస్ ను, సహజత్వాన్ని జోడించి ఉంటాయని ఉదాహరించారు. దాసరి గారు నిద్రపోవడం తాను ఎప్పుడూ చూడలేదని, 24 గంటలూ ఆలోచిస్తూనే ఉండేవారని తెలిపారు. తెల్లవారుజామున మూడు గంటల వరకు తమ ఇంటి దగ్గర చర్చలు జరిగి, మళ్ళీ ఆరు గంటలకు షూటింగ్ ప్రారంభమయ్యేదని గుర్తుచేసుకున్నారు.

దాసరి గారి ఇంటి వద్ద నిరంతరం సందడి ఉండేదని, రాత్రిపూట కూడా దర్శకుల, నిర్మాత కార్లు బారులు తీరేవని, అందుకే ఆ వీధికి నిత్యకళ్యాణం పచ్చతోరణం రోడ్డు అని పేరు వచ్చిందని కోడి రామకృష్ణ సరదాగా చెప్పుకొచ్చారు. దిగ్గజ నటులు నందమూరి తారక రామారావు గారు మేకప్ వేసుకుని ఐదు గంటలకే దాసరి గారి ఇంటికి వచ్చి కథలు విని, డైరీలో డేట్స్ నోట్ చేసుకునేవారని, అక్కినేని నాగేశ్వరరావు గారు ప్రతి జనవరి 1న దాసరి గారికి డైరీ ఇచ్చి డేట్స్ నోట్ చేసుకోమని చెప్పేవారని వివరించారు. ఇది దాసరి గారి గొప్పతనాన్ని, ఆయన సంపాదించుకున్న పేరును సూచిస్తుందన్నారు. దాసరి గారు పోటీని స్పోర్టివ్ గా తీసుకునేవారని, ఒకసారి కె. రాఘవేంద్రరావు సినిమా రిలీజ్ అయినప్పుడు, “సోదరుడు మార్కులు కొట్టేశాడు కృష్ణ. మనం ఇంకా బాగా చేయాలి” అనేవారని కోడి రామకృష్ణ చెప్పారు. శంకరాభరణం సినిమా విడుదలైన కొత్తలో రష్యన్ సర్కస్ లో ఆ పాట విని, సర్కస్ పూర్తవగానే కె. విశ్వనాథ్ గారి దగ్గరికి వెళ్ళి, “సోదరా, నీ పాటను రష్యా వాళ్ళు కొట్టేశారు, ఎంత గొప్ప సినిమా తీశావయ్యా” అని దాసరి ప్రశంసించారని తెలిపారు. దానికి విశ్వనాథ్ గారు “మీరు ఒకేసారి ఆరు సినిమాలు తీస్తున్నారు, నాకేమో ఒక సినిమాకే కన్ఫ్యూజ్ అయిపోతున్నాను” అని సరదాగా బదులిచ్చారన్నారు. కె. రాఘవేంద్రరావు గారి బిందెల పాట డెకరేషన్ ను కూడా దాసరి ప్రశంసించారని, అలాంటి ఆర్టిఫిషియల్ పాటకు డెకరేట్ చేస్తే తప్పేమిటని రాఘవేంద్రరావు వివరించారని కోడి రామకృష్ణ చెప్పారు.

సినీ పరిశ్రమలోని నటీనటుల పనితీరు గురించి మాట్లాడుతూ, ఎన్టీఆర్ ఐదు గంటలకే మేకప్ తో సిద్ధంగా ఉండేవారని, శోభన్ బాబు, కృష్ణంరాజు, కృష్ణ వంటి వారందరూ అంతే అంకితభావంతో పనిచేసేవారని తెలిపారు. ముఖ్యంగా సూపర్ స్టార్ కృష్ణ గారు చాలా వేగంగా పనిచేసేవారని, ఒక సంవత్సరంలోనే 23 సినిమాలు విడుదలయ్యేవని, తెలుగు భాషపై ఆయనకు పట్టు ఉందని దాసరి గారు చెప్పేవారని గుర్తుచేసుకున్నారు.తన గురువు దాసరి నారాయణరావు గారికి తాను అత్యంత ఆప్తుడనని, దాసరి గారు కూడా అనేక సందర్భాల్లో ఈ విషయాన్ని చెప్పారని కోడి రామకృష్ణ తెలిపారు. ఒకసారి నెల్లూరులో రామారావు గారి సినిమా షూటింగ్ సమయంలో వర్షం కారణంగా షూటింగ్ ఆగిపోగా, తెల్లవారుజామున 2:30 గంటలకు ఎన్టీఆర్ ఫోన్ చేసి తాను మేకప్ తో సిద్ధంగా ఉన్నానని, వర్షం ఆగిందని చెప్పగా, దాసరి గారు బాత్రూంలోకి వెళ్లి 24 పేజీల సీన్ ను తానూ రాయించుకోగా, కొన్ని నిమిషాల్లోనే సిద్ధం చేసి షూటింగ్ కు వెళ్ళిన అద్భుత సంఘటనను కోడి రామకృష్ణ వివరించారు. ఈ సంఘటన రామారావు, దాసరి ఇద్దరి అంకితభావాన్ని చాటుతుందని పేర్కొన్నారు. అలాగే, ఒక గొప్ప సినిమా అకారణంగా ఆగిపోయిన వైనాన్ని కోడి రామకృష్ణ పంచుకున్నారు. భానుమతి గారు, తర్వాత కె.ఆర్. విజయ గారు నటించిన ఆ చిత్రంలో బాలకృష్ణ రెస్పాన్సిబుల్ హీరోగా నటించారని, గోపాల్ రెడ్డి గారు గొప్ప నిర్మాత అని తెలిపారు. నెల రోజుల పాటు షూటింగ్ చేసి, పెద్ద సెట్ వేసినా, ఎందుకు ఆగిందో ఇప్పటికీ అర్థం కాలేదని, మలేషియా ఫ్లైట్ అదృశ్యం వలె ఉందని ఆయన ఆశ్చర్యం వ్యక్తం చేశారు. దాసరి, ఎన్టీఆర్, ఏఎన్ఆర్, విశ్వనాథ్, రాఘవేంద్రరావు వంటి దిగ్గజాలతో కలిసి పనిచేయడం, వారి మధ్య తిరగడం తనకు ఒక ట్రెజర్ లాంటిదని కోడి రామకృష్ణ అన్నారు.

ఎక్కువ మంది చదివినవి : Idupu Kayitham: ఇడుపు కాయితం నుంచి గడప సాంగ్ రిలీజ్.. ప్రతి అమ్మాయి హృదయాలను హత్తుకునే పాట..

Follow Us
ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో..
ఒక్క ఏడాదిలోనే 23 సినిమాలు చేసిన ఏకైక హీరో..
ప్రతిరోజూ తాజా కొత్తిమీర కావాలా? ఇంట్లో ఈజీగా పండించేయొచ్చు..
ప్రతిరోజూ తాజా కొత్తిమీర కావాలా? ఇంట్లో ఈజీగా పండించేయొచ్చు..
అల్లం, తులసి కలిపి టీ చేస్తే దగ్గు తగ్గుతుందా? అసలు నిజం ఇదే!
అల్లం, తులసి కలిపి టీ చేస్తే దగ్గు తగ్గుతుందా? అసలు నిజం ఇదే!
ఎర్ర ఇటుకలకు ఆ రంగు ఎలా వస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..!
ఎర్ర ఇటుకలకు ఆ రంగు ఎలా వస్తుంది? అసలు సీక్రెట్ ఇదే..!
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవ్
విద్యార్థులకు ఎగిరి గంతేసే వార్త.. రేపు స్కూళ్లు, కాలేజీలకు సెలవ్
Video: హర్మన్‌ప్రీత్ శతకంపై స్మృతి మంధాన రియాక్షన్..
Video: హర్మన్‌ప్రీత్ శతకంపై స్మృతి మంధాన రియాక్షన్..
ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను వణికిస్తున్న హరర్ థ్రిల్లర్..
ఓటీటీలో తెలుగు ప్రేక్షకులను వణికిస్తున్న హరర్ థ్రిల్లర్..
అర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అలర్ట్.. కీలక ఆదేశాలు..!
అర్నబ్ తుఫానుపై సీఎం చంద్రబాబు అలర్ట్.. కీలక ఆదేశాలు..!
శత్రువైనా తోక ముడవాల్సిందే.. ఈ రాశులకు శుక్రుడి బ్లెస్సింగ్స్
శత్రువైనా తోక ముడవాల్సిందే.. ఈ రాశులకు శుక్రుడి బ్లెస్సింగ్స్
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.
ఈకలనే వాటర్ బాటిల్‌గా మార్చి.. పిల్లల దాహం తీర్చేందుకు 70కి.మీ.