కాబోయే భర్త ఎలా ఉండాలంటే.. ఆసక్తికర కామెంట్స్ చేసిన సాయి పల్లవి..

Rajitha Chanti

Pic credit - Instagram

29 October 2026

టాలీవుడ్ లో తన సహజమైన నటన, అద్భుతమైన డాన్స్ ప్రతిభతో లక్షలాది మంది హృదయాలను గెలుచుకున్న హీరోయిన్ సాయిపల్లవి.

తెరపై తన అభినయంతో ఆకట్టుకునే ఈ భామ, పలు ఇంటర్వ్యులలో వ్యక్తిగత జీవితానికి సంబంధించి చాలా అరుదుగా మాత్రమే మాట్లాడుతుంటారు. 

అయితే తాజాగా ఆమె తన కాబోయే భర్తకు ఉండాల్సిన అర్హతలు, లక్షణాల గురించి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

తాజాగా దీపావళి స్పెషల్ ఎపిసోడ్‌లో భాగంగా ప్రముఖ రియాలిటీ గేమింగ్ షో ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’లో ‘రామాయణ’ చిత్ర బృందంతో కలిసి పాల్గొంది

హోస్ట్ అమితాబ్ బచ్చన్ అడిగిన ప్రశ్నకు బదులిస్తూ తన మనసులోని మాటలను పంచుకున్నారు. జీవిత భాగస్వామి ఎలా ఉండాలనే దానిపై స్పందించారు.

బాహ్య సౌందర్యం కంటే మంచి మనస్తత్వం, పరిణతి ముఖ్యం అని ఆమె స్పష్టం చేశారు. మొదటగా అతను ఒక మంచి మానవతావాది అయి ఉండాలి అన్నారు.

ఎప్పుడూ తన గురించి మాత్రమే ఆలోచించే అహంభావి కాకూడదు. జీవితంలో జరిగిన పొరపాట్లను విశ్లేషించుకునే గుణం, తన తప్పును తాను తెలుసుకుని దానిని సరిదిద్దుకునే పరిణతి ఉండాలి.

ప్రతిదానికీ ఇతరులపై నెపం నెట్టేసే వ్యక్తి కాకూడదు అని తెలిపారు. అలాగే అడగడానికి పెద్దగా కండిషన్స్ ఏమీ లేవని, వంట చేయడం వస్తే సంతోషమని అన్నారు.