క్రెడిట్ కార్డుతో అద్దె చెల్లిస్తున్నారా..? డేంజర్ బాసూ..
Venkatrao Lella
Images: Pinterest
14 AUG 2026
క్రెడిట్ కార్డులు కలిగి ఉండటం అనేది ఇప్పటిరోజుల్లో సర్వసాధారణంగా మారిపోయింది. ప్రతీఒక్కరి చేతుల్లో కార్డులు దర్శనమిస్తున్నాయి
అయితే క్రెడిట్ కార్డుల ద్వారా అద్దె చెల్లించేవారు ఎక్కువమంది ఉంటున్నారు. రివార్డ్ పాయింట్స్, క్యాష్ బ్యాక్ కోసం కొంతమంది అవసరం లేకపోయినా చెల్లిస్తున్నారు.
కానీ ఇలా చేయడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. దీంతో కొన్ని విషయాలను మీరు దృష్టిలో పెట్టుకోవాలి.
చాలా యాప్స్ అద్దె చెల్లింపులపై 1 నుంచి 2 శాతం వరకు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తున్నాయి. అంటే మీరు నెలకు రూ.30 వేలు చెల్లిస్తుంటే అదనంగా రూ.600 రుసుం చెల్లించాలి. దీంతో మీ డబ్బులు వృథా అవుతాయి.
ఏడాది పొడవునా ఇలాగే క్రెడిట్ కార్డ్ ద్వారా చెల్లిస్తుంటే అప్పుల ఊబిలోకి చిక్కుకునే అవకాశం ఉంటుంది. బిల్లు గడువు తేదీలోగా కట్టకపోతే భారీగా జరిమానాలు కట్టాల్సి ఉంటుంది.
అలాగే మీ క్రెడిట్ వినియోగ నిష్పత్తి కూడా తగ్గుతుంది. రూ.లక్ష లిమిట్ ఉన్న కార్డులో రూ.40 వేలు అద్దె చెల్లిస్తుంటే.. క్రెడిట్ 40 శాతం తగ్గుతుంది. సిబిల్ స్కోర్ తగ్గే అవకాశముంటుంది
క్రెడిట్ కార్డు వడ్డీ రేట్లు ఎక్కువగా ఉంటాయి. ఏడాదికి 36 నుంచి 45 శాతం వరకు ఉంటాయి. మీరు గడువులోగా చెల్లించకపోయినా లేదా మినిమం బ్యాలెన్స్ పే చేసినా భారీగా ఫైన్లు పడతాయి.
కొన్ని బ్యాంకులు అద్దె చెల్లింపులను క్యాష్ పేమెంట్లుగా భావిస్తున్నాయి. సాధారణంగా విత్ డ్రా చేశాక 40 నుంచి 50 రోజుల వరకు సమయం ఉంటుంది. అదే క్యాష్ పేమెంట్స్‌గా భావించడం వల్ల విత్ డ్రా చేసిన రోజు నుంచే వడ్డీ పడుతుంది.
కొన్నిసార్లు వ్యక్తుల మధ్య సాధారణంగా జరిగే లావాదేవీలను అద్దె చెల్లింపులుగా చూపిస్తున్నారు. దీంతో త్వరలో కొత్త నిబంధనలు రాబోతున్నాయి. ఆర్బీఐ నిబంధనలను సవరించబోతుంది.