AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు ఆచరించవచ్చా?

Varalakshmi Vratam Telugu: వరలక్ష్మీ వ్రతం విషయంలో చాలామందికి ఎన్నో సందేహాలు ఉంటాయి. పెళ్లికాని మహిళలు, భర్తను కోల్పోయిన వారు ఈ వ్రతం చేయవచ్చా? కలశం తప్పనిసరిగా పెట్టాలా? శ్రావణంలో వ్రతం చేయలేకపోతే ఏం చేయాలి? ఆధ్యాత్మిక సూచనల ప్రకారం పూర్తి వివరాలు తెలుసుకోండి.

Varalaxmi Vratam: వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు ఆచరించవచ్చా?
Varalakshmi Vratam Telugu
Rajashekher G
|

Updated on: Aug 19, 2026 | 3:20 PM

Share

Varalaxmi Vratam Telugu: శ్రావణమాసం అంటేనే పూజలు, వ్రతాలకు ప్రత్యేకమైన సమయం. ముఖ్యంగా మహిళలు కుటుంబంలో సుఖసంతోషాలు, ఐశ్వర్యం, ఆయురారోగ్యాలు కలగాలని కోరుకుంటూ ఈ మాసంలో ప్రత్యేక పూజలు చేస్తుంటారు. అందులో ముఖ్యమైనదే వరలక్ష్మీ వ్రతం. ఈ రోజున లక్ష్మీదేవిని ప్రత్యేకంగా అలంకరించి, నైవేద్యాలు సమర్పించి భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. అయితే వరలక్ష్మీ వ్రతం విషయంలో చాలామందికి కొన్ని సందేహాలు ఉంటాయి. పెళ్లికాని మహిళలు చేయవచ్చా? భర్తను కోల్పోయిన వారు ఆచరించవచ్చా? కుటుంబంలో ఇంతకుముందు ఎవరూ చేయకపోతే కొత్తగా ప్రారంభించవచ్చా? కలశం తప్పనిసరిగా పెట్టాలా? శ్రావణంలో వ్రతం చేయడం కుదరకపోతే ఏం చేయాలి? అనే ప్రశ్నలు తలెత్తుతుంటాయి.

ఎవరైనా వరలక్ష్మీ వ్రతం చేయవచ్చా?

ఆధ్యాత్మిక ప్రవచనకర్త కాకునూరి సూర్యనారాయణమూర్తి సూచనల ప్రకారం, భక్తి, విశ్వాసం ఉన్న ఎవరైనా వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరించవచ్చు. పెళ్లికాని మహిళలు, భర్తను కోల్పోయిన మహిళలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చని చెబుతున్నారు. అవసరమైతే పురోహితుడి సమక్షంలో వ్రతాన్ని పూర్తి చేయించుకోవచ్చు. పూజను పురోహితుడి ద్వారా చేయించినా, వ్రత ఫలితం సంకల్పం చేసుకున్న వారికే దక్కుతుందని ఆధ్యాత్మిక విశ్వాసం.

కుటుంబంలో ఇంతకుముందు చేయకపోతే?

మీ కుటుంబంలో పూర్వీకుల నుంచి వరలక్ష్మీ వ్రతం చేసే సంప్రదాయం లేకపోయినా, ఆసక్తి ఉంటే కొత్తగా ప్రారంభించవచ్చని చెబుతున్నారు. అయితే వ్రత విధానం తెలిసిన కుటుంబం లేదా దంపతుల వద్దకు వెళ్లి పూజా విధానాన్ని తెలుసుకుని ప్రారంభించడం మంచిది. ఒకసారి వ్రతాన్ని ప్రారంభించిన తర్వాత వీలైనంతవరకు సంప్రదాయాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించాలి.

ఇవి కూడా చదవండి

వరలక్ష్మీ వ్రతంలో కలశం ముఖ్యమే!

వరలక్ష్మీ వ్రతంలో కలశానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంటుంది. ఇంట్లో శుభ్రమైన ప్రదేశంలో మంటపం ఏర్పాటు చేసి, బియ్యంపై కలశాన్ని ఉంచాలి. కలశంలో నీటిని నింపి మామిడాకులు, కొబ్బరికాయను ఏర్పాటు చేసి, అందులో వరలక్ష్మీదేవిని ఆవాహన చేసి పూజిస్తారు. కొందరు బంగారం, వెండి, రాగి, ఇత్తడి వంటి లోహాలతో చేసిన అమ్మవారి ప్రతిమను కూడా ఏర్పాటు చేస్తారు. అయితే అలంకరణలు, ఇతర ఏర్పాట్లు తమ శక్తి, సౌకర్యానికి అనుగుణంగా చేసుకోవచ్చని చెబుతున్నారు.

అమ్మవారి చిత్రం ఎలా ఉండాలి?

వరలక్ష్మీ వ్రత కథలో చారుమతీ దేవికి అమ్మవారు నిల్చుని దర్శనం ఇచ్చినట్లు చెబుతారు. అందువల్ల నిల్చుని ఉన్న వరలక్ష్మీదేవి చిత్రాన్ని పూజలో ఏర్పాటు చేసుకోవడం మంచిదని కొందరు ఆధ్యాత్మిక పెద్దలు సూచిస్తున్నారు. అయితే కూర్చుని ఉన్న లక్ష్మీదేవి చిత్రాన్ని కూడా భక్తితో పూజించవచ్చని చెబుతున్నారు.

శ్రావణంలో వ్రతం చేయలేకపోతే?

సాధారణంగా శ్రావణమాసంలో పౌర్ణమికి ముందు వచ్చే శుక్రవారం వరలక్ష్మీ వ్రతాన్ని ఆచరిస్తారు. అయితే ఆ రోజున కుదరకపోతే శ్రావణ శుక్లపక్షంలోని మరో శుక్రవారం కూడా వ్రతాన్ని ఆచరించే అవకాశం ఉందని ఆధ్యాత్మిక ప్రవచనకర్తలు చెబుతున్నారు. ఏ శుక్రవారమూ వీలు కాకపోతే, ప్రత్యామ్నాయంగా దసరా నవరాత్రుల్లో అమ్మవారికి లక్ష్మీ అలంకారం చేసే రోజున వ్రతాన్ని పూర్తి చేయవచ్చని సూచిస్తున్నారు.

ఇక వ్రతానికి ఏర్పాట్లు పూర్తయ్యాక అనుకోని ఇబ్బంది ఎదురైతే ఇంట్లోని మరో మహిళ వ్రతాన్ని పూర్తి చేయవచ్చు. అది కూడా సాధ్యం కాకపోతే పురోహితుడి ద్వారా వ్రతాన్ని చేయించుకోవచ్చు. ముఖ్యంగా భక్తి, నియమం, విశ్వాసంతో వ్రతాన్ని ఆచరించడమే ప్రధాన ఉద్దేశం అని గుర్తుంచుకోవాలి.

(Disclamer: వ్రత విధానాలు కుటుంబ సంప్రదాయం, ప్రాంతీయ ఆచారాల ప్రకారం మారవచ్చు. కాబట్టి మీ కుటుంబ పురోహితులు లేదా ఆధ్యాత్మిక పెద్దల సూచనలను పాటించడం మంచిది.)

Follow Us
వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..
వరలక్ష్మీ వ్రతం ఎవరు చేయొచ్చు? పెళ్లికానివాళ్లు, వితంతువులు..
ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా
ఇన్నాళ్లు పట్టించుకోలేమా.. చిన్న అల్లం ముక్కతో ఇన్ని రోగాలు ఖతమా
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..
వంటగదిలో 3 బర్నర్‌ల గ్యాస్ స్టవ్ ఉందా? వాస్తు శాస్త్రం చెప్పేది..
ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..
ఈ రైతు సూత్రాన్ని ఫాలో అయితే.. ఇక నష్టమనేదే ఉండదు..
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..
8 ఎపిసోడ్స్.. ఆద్యంతం వణుకుపుట్టించే సినిమా.. ఓటీటీలో రచ్చ..
షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..
షిర్డీ.. త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగ యాత్ర! కాచిగూడ నుంచి..
గాలేలో గత్తరలేపిన జూనియర్ అనిల్ కుంబ్లే.. ఏకంగా 10 వికెట్లతో..
గాలేలో గత్తరలేపిన జూనియర్ అనిల్ కుంబ్లే.. ఏకంగా 10 వికెట్లతో..
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
ఇంటి ప్రధాన ద్వారం వద్ద మనీ ప్లాంట్ పెడుతున్నారా?ఈ వాస్తు తప్పులు
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..
మన మెదడులో అంతుచిక్కని రహస్యాలు.. చీకట్లో జరిగే అసలు వింతలు..