AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: అయ్యో పాపం ఆవుకు ఎంత కష్టం వచ్చింది.. ఎరక్కపోయి ఇలా ఇరుక్కుపోయింది..! ఆ తర్వాత జరిగింది చూస్తే..

ఒక ఆవుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇది చూసి ప్రజలు భావోద్వేగానికి గురవుతున్నారు. నోరులేని మూగజీవి కష్టాన్ని చూసి చలించి పోయారు. ఆవుకు సాయం చేసిన వారిని ఎంతగానో ప్రశంసిస్తున్నారు. వైరల్‌ వీడియోలో ఒక నీలి రంగు ప్లాస్టిక్ డ్రమ్‌లో ఆవు మెడ ఇరుక్కుపోయి ఉంది. ఆవు ఆ పరిస్థితి నుండి బయటపడలేక రోడ్డుపై అటూ ఇటూ తిరుగుతుంది. కానీ, ఆ డ్రమ్‌లోంచి తన మెడ బయటకు రాక ఇబ్బంది పడుతోంది. చివరకు ఏం జరిగిందో వీడియోలో చూద్దాం..

Watch: అయ్యో పాపం ఆవుకు ఎంత కష్టం వచ్చింది.. ఎరక్కపోయి ఇలా ఇరుక్కుపోయింది..! ఆ తర్వాత జరిగింది చూస్తే..
Cow Trapped In Plastic Drum
Jyothi Gadda
|

Updated on: Jun 22, 2026 | 4:13 PM

Share

మన చుట్టూ ఉండే మూగజీవాలు ఒక్కోసారి తెలియక చేసే పనుల వల్ల పెద్ద ప్రమాదాల్లో చిక్కుకుంటూ ఉంటాయి. అలాంటి సమయాల్లో మనుషులు చూస్తూ ఊరుకోకుండా మానవత్వంతో స్పందిస్తే ఒక ప్రాణాన్ని కాపాడవచ్చని నిరూపించింది గుజరాత్‌లో జరిగిన ఒక సంఘటన. ఉత్తర గుజరాత్‌లోని ఒక రద్దీగా ఉండే రోడ్డుపై ఒక ఆవు తల ప్లాస్టిక్ డ్రమ్ములో ఇరుక్కుపోయిన హృదయవిదారక దృశ్యానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. వివరాల్లోకి వెళితే..

ఆహారం కోసమో లేదా మరేదైనా కారణం చేతనో ఒక ఆవు నీలి రంగు ప్లాస్టిక్ డ్రమ్‌ లోపలికి తన తలను దూర్చింది. అయితే, దురదృష్టవశాత్తూ ఆ డ్రమ్ ఆవు మెడకు గట్టిగా ఇరుక్కుపోయింది. దాంతో ఆవుకు బయట ప్రపంచం ఏమీ కనిపించలేదు, పైగా శ్వాస తీసుకోవడం కూడా చాలా కష్టంగా మారింది. తీవ్రమైన భయాందోళన, ఊపిరాడని స్థితిలో ఆ ఆవు వాహనాలు రద్దీగా ఉండే రోడ్డుపై పిచ్చిగా ఇటుఅటు పరుగెత్తడం ప్రారంభించింది. దీనివల్ల ఆవు ప్రాణాలకే కాకుండా, రోడ్డుపై వెళ్లే వాహనదారులకు కూడా పెద్ద ప్రమాదం పొంచి ఉంది.

ఇవి కూడా చదవండి

ఈ దారుణమైన పరిస్థితిని గమనించిన కొందరు స్థానిక యువకులు, బాటసారులు వెంటనే స్పందించారు. భయంతో రంకెలు వేస్తూ పరుగెడుతున్న ఆవును పట్టుకోవడం చాలా ప్రమాదకరమైనప్పటికీ, వారు వెనకడుగు వేయలేదు. ఎంతో ఓపికగా, చాకచక్యంగా ఆవును చుట్టుముట్టి మొదట దాన్ని శాంతింపజేశారు. ఆ తర్వాత ఎంతో జాగ్రత్తగా ఆ ప్లాస్టిక్ డ్రమ్మును ఆవు తల నుండి విడదీసి దానికి విముక్తి ప్రసాదించారు. డ్రమ్ విడిపోగానే ఆ ఆవు స్వేచ్ఛగా శ్వాస పీల్చుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది.

వీడియో ఇక్కడ చూడండి..

ఈ రెస్క్యూ ఆపరేషన్‌ను అక్కడ ఉన్న ఒక వ్యక్తి మొబైల్‌లో రికార్డ్ చేసి సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ వీడియో నెటిజన్ల హృదయాలను కదిలిస్తోంది. సకాలంలో స్పందించి ఆ మూగజీవాన్ని కాపాడిన ఆ యువకులకు సెల్యూట్, ఇలాంటి సంఘటనలు మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపిస్తాయి అంటూ నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. అదే సమయంలో, నగరాల్లో ఇష్టారాజ్యంగా ప్లాస్టిక్ వ్యర్థాలను పారేయడం వల్లే మూగజీవాలకు ఇలాంటి దుస్థితి పడుతోందని, ప్లాస్టిక్ వాడకంపై, వ్యర్థాల నిర్వహణపై ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని పర్యావరణ ప్రేమికులు కోరుతున్నారు.

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…

Follow Us