AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

చనిపోతూ కూడా ప్రాణాలు నిలిపిన సైనికుడు.. జమ్మూకశ్మీర్‌లో అరుదైన ఘటన!

జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ కమాండ్ హాస్పిటల్‌లో రాష్ట్రంలోనే తొలి మల్టీ-ఆర్గాన్ రిట్రీవల్ విజయవంతంగా పూర్తయింది. తీవ్ర అనారోగ్యంతో నవంబర్ 15న ఆసుపత్రిలో చేరిన సైనిక జవాన్‌ను నవంబర్ 18న వైద్యులు బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. తీవ్ర విషాదంలోనూ జవాన్ కుటుంబ సభ్యులు ఉదారంగా ముందుకు వచ్చి కాలేయం, కిడ్నీలను దానం చేయడానికి అంగీకరించారు. కమాండ్ హాస్పిటల్, ఆర్మీ హాస్పిటల్ బృందాలు అవయవాలను సేకరించగా, నార్తర్న్ కమాండ్, స్థానిక యంత్రాంగం, SOTTO, భారత వైమానిక దళ సహకారంతో గ్రీన్ కారిడార్ ద్వారా వాటిని అవసరమైన రోగులకు తరలించారు. ఈ ఘటన మానవత్వానికి, సైనిక సేవా నిబద్ధతకు ప్రతీకగా నిలిచింది.

చనిపోతూ కూడా ప్రాణాలు నిలిపిన సైనికుడు.. జమ్మూకశ్మీర్‌లో అరుదైన ఘటన!
Udhampur Command Hospital
Jyothi Gadda
|

Updated on: Nov 21, 2026 | 9:04 AM

Share

జమ్మూకశ్మీర్ వైద్య చరిత్రలో ఒక ముఖ్యమైన ఘట్టం ఆవిష్కృతమైంది. ఉధంపూర్‌లోని కమాండ్ హాస్పిటల్‌లో రాష్ట్రంలోనే మొట్టమొదటి మల్టీ-ఆర్గాన్ రిట్రీవల్ ప్రక్రియ విజయవంతంగా జరిగింది. విధుల్లో ఉన్న ఒక భారతీయ సైనిక జవాన్ బ్రెయిన్ డెడ్‌గా నిర్ధారణ అయిన తర్వాత, ఆయన కుటుంబ సభ్యులు తీసుకున్న నిర్ణయం పలువురు రోగులకు కొత్త జీవితాన్ని అందించింది. ఘటన పూర్తి వివరాల్లోకి వెళితే..

అనారోగ్య సమస్యతో బాధపడుతున్న సైనిక జవాన్‌ను నవంబర్ 15న అపస్మారక స్థితిలో ఉధంపూర్ కమాండ్ హాస్పిటల్‌కు తరలించారు. వైద్యులు ఎంతగా ప్రయత్నించినా ఆరోగ్య పరిస్థితి మెరుగుపడకపోవడంతో నవంబర్ 18న ఆయన్ను బ్రెయిన్ డెడ్‌గా ప్రకటించారు. అయితే ఆ సమయంలో ఆయన అవయవాలు సక్రమంగా పనిచేస్తున్నాయి. కమాండ్ హాస్పిటల్ కమాండర్ మేజర్ జనరల్ సంజయ్ శర్మ దీనిని రాష్ట్ర వైద్య రంగంలో చారిత్రక ఘట్టంగా అభివర్ణించారు.

ఇవి కూడా చదవండి

విషాదంలోనూ విశాల హృదయం

తమ కుమారుడిని కోల్పోయిన తీవ్ర దుఃఖంలోనూ వైద్యులు అవయవ దానం గురించి సున్నితంగా వివరించినప్పుడు కుటుంబ సభ్యులు వెంటనే అంగీకరించారు. తమ వారి అవయవాల ద్వారా ఇతరులకు ప్రాణదానం చేయాలనే వారి నిర్ణయం మానవత్వానికి నిదర్శనంగా నిలిచింది. జవాన్ కాలేయం, కిడ్నీలను దానం చేసేందుకు కుటుంబం ముందుకు వచ్చింది.

గ్రీన్ కారిడార్, వేగవంతమైన తరలింపు:

కమాండ్ హాస్పిటల్, ఆర్మీ హాస్పిటల్ నిపుణుల బృందాలు అవయవాలను సురక్షితంగా సేకరించాయి. అవయవాలు త్వరితగతిన, ఎలాంటి జాప్యం లేకుండా అవసరమైన రోగులకు చేరడానికి నార్తర్న్ కమాండ్, స్థానిక యంత్రాంగం, స్టేట్ ఆర్గాన్ అండ్ టిష్యూ ట్రాన్స్‌ప్లాంట్ ఆర్గనైజేషన్ సమన్వయంతో గ్రీన్ కారిడార్ ఏర్పాటు చేశారు. భారత వైమానిక దళ ప్రత్యేక విమానం ద్వారా వీటిని వేగంగా, సురక్షితంగా తరలించారు.

సేవకు మరో అర్థం

ఈ ఘటన వైద్య వ్యవస్థ సమన్వయాన్ని చూపడమే కాకుండా, సైనికుడి సేవా భావాన్ని మరోసారి చాటిచెప్పింది. ప్రాణాలు నిలిపే ఈ మహత్తర చర్యలో పాలుపంచుకున్న కుటుంబ సభ్యుల ధైర్యాన్ని, వైద్య బృందాల కృషిని పలువురు ప్రశంసించారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..

Follow Us