ఎల్పీజీ సబ్సిడీకి కొత్త నిబంధనలు.

Venkatrao Lella

Images: Pinterest

18  JUNE 2026

ఎల్పీజీ గ్యాస్ సిలిండర్‌పై కేంద్ర ప్రభుత్వం సబ్సిడీ కల్పిస్తోన్న విషయం తెలిసిందే. ప్రతీ సిలిండర్‌పై సబ్సిడీ అందిస్తోంది. ఏడాదికి ఎన్ని సిలిండర్లు బుక్ చేసుకున్నా ఈ రాయితీ సౌకర్యం కల్పిస్తోంది

అయితే ఈ పథకం అమలుకు కేంద్ర ప్రభుత్వం కొత్త నిబంధనలను అమలు చేయాలని భావిస్తోంది. వార్షిక ఆదాయం రూ.10 లక్షలకు పైబడిన కుటుంబాలకు ఇచ్చే రాయితీని నిలిపివేయవచ్చు.

చాలా మంది వినియోగదారులకు చమురు కంపెనీల నుండి 7 రోజుల్లోగా స్పందించమని ఎస్ఎంఎస్‌లు అందుతున్నాయి. 7 రోజుల్లోగా స్పందన రాకపోతే, సబ్సిడీని నిలిపివేయవచ్చు.

ఆదాయపు పన్ను శాఖ నుండి అందిన సమాచారం ఆధారంగా ఈ విచారణ జరుగుతోంది. అవసరమైన వారికి మాత్రమే రాయితీని అందించాలని ప్రభుత్వం భావిస్తోంది.

ప్రస్తుత నిబంధనల ప్రకారం కూడా రూ.10 లక్షలకు పైబడిన ఆదాయంపై సబ్సిడీ అందుబాటులో లేదు. 2016 నుంచి ఈ నిబంధనలను అమలు చేస్తోంది కేంద్ర ప్రభుత్వం

వినియోగదారుడు తన సమాచారం తప్పు అని భావిస్తే.. ఫిర్యాదు చేయడానికి అతనికి అవకాశం ఇస్తున్నారు. గ్యాస్ ఏజెన్సీ ద్వారా ఫిర్యాదు చేయవచ్చు

సబ్సిడీని నిలిపివేసిన తర్వాత కూడా ఎల్పీజీ సిలిండర్లు అందుబాటులో ఉంటాయి కానీ అవి పూర్తి మార్కెట్ ధరకే లభిస్తాయని అధికారులు చెబుతున్నారు.

ఆదాయం తక్కువ ఉన్న కుటుంబాలకు మాత్రమే సబ్సిడీ జమ చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. దీని వల్ల పేద, మధ్యతరగతి ప్రజలకు ప్రయోజనం కలుగుతుంది. ధనవంతులకు సబ్సిడీ ఇవ్వడం వల్ల లాభం ఉండదు.