తెలంగాణలో తొలి రోప్‌వే.. వెయ్యేళ్ల చరిత్రకు ఆధునిక హంగులు.. ఎక్కడంటే?
తెలంగాణ పర్యాటక రంగంలో మరో కీలక మైలురాయికి తెరలేవబోతోంది. రాష్ట్రం లోనే తొలిసారిగా రోప్‌వే టూరిజం అందుబాటులోకి రానుంది. చరిత్ర, సాహసం, ప్రకృతి అందాలకు నిలయమైన భువనగిరి కోటపై రోప్‌వే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. చారిత్రాత్మక భువనగిరి కోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది. పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేలా భువనగిరి కోటపై రోప్‌వే టూరిజంను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పర్యాటకశాఖ కసరత్తు చేస్తోంది.

తెలంగాణ పర్యాటక రంగంలో మరో కీలక మైలురాయికి తెరలేవబోతోంది. రాష్ట్రం లోనే తొలిసారిగా రోప్‌వే టూరిజం అందుబాటులోకి రానుంది. చరిత్ర, సాహసం, ప్రకృతి అందాలకు నిలయమైన భువనగిరి కోటపై రోప్‌వే ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. చారిత్రాత్మక భువనగిరి కోటను అంతర్జాతీయ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అడుగులు వేస్తోంది. పర్యాటకులకు కొత్త అనుభూతిని పంచేలా భువనగిరి కోటపై రోప్‌వే టూరిజంను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు పర్యాటకశాఖ కసరత్తు చేస్తోంది.
రాష్ట్రాన్ని దేశ, విదేశీ పర్యాటకుల డెస్టినేషన్ సెంటర్ గా తీర్చిదిద్దాలనే లక్ష్యంతో రేవంత్ సర్కార్ ప్రణాళికలను రూపొందిస్తోంది. ఇప్పటికే ఉన్న పర్యాటక ప్రాంతాలను ప్రపంచ స్థాయి సౌకర్యాలతో అభివృద్ధి చేయడంతో పాటు కొత్త ఆకర్షణలను అందుబాటులోకి తీసుకురావడంపై ఫోకస్ పెట్టింది. దాదాపు వెయ్యేళ్ల చరిత్ర కలిగిన భువనగిరి కోట తెలంగాణ వారసత్వ సంపదలో ఒకటి. భువనగిరి ఖిల్లా సుమారు 50 ఎకరాల విస్తీర్ణంలో సముద్ర మట్టానికి 610 మీటర్ల (సుమారు 3000 అడుగులం) ఎత్తులో ఉన్న ఏకశిలా పర్వతం. 10 నుంచి 11శతాబ్దంలో పశ్చిమ చాళుక్య రాజు త్రిభువనమల్ల విక్రమాదిర్చుడు ఈ ఖిల్లాపైన దుర్బేధ్యమైన కోట గోడను నిర్మించాలని ప్రసిద్ధి. పై భాగం నుంచి అండాకారంలో కనిపించడం ఖిల్లా ప్రత్యేకత.
స్వదేశ్ దర్శన్ కింద రూ.56.81 కోట్లతో భారీ ప్రాజెక్టు
కేంద్రం ప్రభుత్వం దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మక పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు ప్రవేశపెట్టిన ‘స్వదేశీ దర్శన్ స్కీమ్ 2.0’ కింద తెలంగాణలోని భువనగిరి కోటను ఎంపిక చేసింది. ఈ పథకం ద్వారా “భువనగిరి ఫోర్ట్ ఎక్స్‌పీరియన్షియల్ జోన్” ప్రాజెక్టుకు కేంద్ర ప్రభుత్వం రూ.56.81 కోట్ల భారీ నిధులను మంజూరు చేసింది. భువనగిరి ఖిల్లా పక్కనే ఉన్న హైదరాబాద్-వరంగల్ 165వ నేషనల్ హైవే నుంచి కోట వద్దకు దాదాపు కిలో మీటరు దూరం వరకు రోప్‌వే ఏర్పాటు చేయనున్నారు. ఇది అందుబాటులోకి వస్తే.. రాష్ట్రంలో తొలి రోప్‌వేగా ఇది గుర్తింపు సాధించనుంది.
ట్రెక్కింగ్ ప్రాధాన్యమున్న ప్రాంతాల్లో భువనగిరి కోట ఒకటి కాగా.. ప్రస్తుతం కోటపైకి చేరడానికి దాదాపు గంట సమయం పడుతోంది. చాలా మంది టూరిస్టులు ఈ కోటను సందర్శిస్తుంటారు. ఈ నేపథ్యంలో టూరిస్టులకు కొత్త అనుభూతిని ఇచ్చేందుకు రోప్ వే నిర్మాణ పనుల కొనసాగుతున్నాయి. ఇందుకోసం రెండు దఫాలుగా సుమారు ఐదెకరాల ప్రైవేటు భూములను సేకరించి నిర్వాసితులకు సుమారురూ. 4 కోట్ల పరిహారం అందజేశారు. ఈ మేరకు బేస్ క్యాంప్, రోస్వే పిల్లర్ల పనులు ప్రారంభమయ్యాయి. ప్రస్తుత మెట్ల మార్గంలో అవసరమైన చోట నూతన మెట్లను చెక్కుతున్నారు. అన్ని ద్వారాలకు, ఇతర కట్టడాలకు మరమ్మతులు చేయనున్నారు. ఈ ఆధునికీకరణ పనులను డంగు సున్నంతో చేపట్టడం విశేషం. ఖిల్లాపై బేస్ క్యాంపు వద్ద రెస్టారెంట్లు, గ్రీనరీ సౌకర్యాలను కల్పించనున్నారు. నల్లగొండ రోడ్డులో ఉన్న ఖిల్లా ప్రధాన మార్గాన్ని ఆధునికరించనున్నారు. రూ. 30కోట్ల వ్యయంతో ఖిల్లా పై స్విమ్మింగ్ పూల్, వివాహాలకు అనువుగా డెస్టినేషన్ వెడ్డింగ్ కోసం నిర్మాణాలు చేపడుతున్నారు.
గంటకు ఖిల్లాపైకి 300 మంది పర్యాటకులు!
భువనగిరి ఖిల్లా వద్ద జరుగుతున్న రోప్ వే పనుల పురోగతిని పర్యవేక్షించేందుకు రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోటపై నిర్మిస్తున్న రోప్‌వే, హోటల్, పార్కింగ్ వసతులు, విశ్రాంతి గదులు, పిల్లల ఆట స్థలం, కోట పునరుద్ధరణ పనులు, కేఫెటేరియా, ఇంటర్‌ప్రిటేషన్ సెంటర్, పర్యాటకులకు అవసరమైన ఇతర వసతుల పురోగతిని అధికారులతో కలిసి సోమవారం సమీక్షించారు. ఖిల్లా వద్ద సాగుతున్న పనులన్నింటినీ రానున్న అక్టోబర్ 2వ తేదీ, గాంధీ జయంతి నాటికి పూర్తి చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులను నిరంతరం పర్యవేక్షించడంతో పాటు, అవసరమైతే రాత్రింబగళ్లు షిఫ్టుల వారీగా పనులు జరిగేలా చూడాలని స్పష్టం చేశారు. భువనగిరి కోట చారిత్రక వైభవాన్ని ఏమాత్రం దెబ్బతీయకుండా, దానికి ఆధునికంగా నిర్మాణాలు ఉండాలని అన్నారు. ఈ రోప్ వే పూర్తి అయితే ఖిల్లా పైకి గంటకు 300 మంది పర్యాటకులు వెళ్లే అవకాశం ఉంటుంది. ఈ రోప్ వే సెకండ్ కు 6 మీటర్ల గరిష్ట వేగంతో సాగుతుంది.
టూరిజం సర్క్యూట్..
యాదగిరిగుట్ట, భువనగిరి కోట, కొలనుపాకలను కలుపుతూ ఒక సమగ్ర ఆధ్యాత్మిక, వారసత్వ టూరిజం సర్క్యూట్‌ను అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికలను రూపొందిస్తోంది. ఈ టూరిజం సర్క్యూట్ ను రూపొందించేందుకు ప్రభుత్వం కసరత్ చేస్తోంది. ఇది అమలైతే దేశీయ, విదేశీ పర్యాటకులు ఒకే ప్రాంతంలో ఆధ్యాత్మిక, చారిత్రక, సాంస్కృతిక అనుభూతులను పొందే అవకాశం ఉంటుంది. యాదాద్రి లక్ష్మి నరసింహ స్వామి క్షేత్రం, నాగార్జునసాగర్ బుద్ధవనం, అనంతగిరి కొండలను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రాలుగా అభివృద్ధికి అవసరమైన మౌలిక వసతలు కల్పనకు చేపట్టే చర్యలకు సంబంధించిన డిటైల్ ప్రాజెక్టు రిపోర్టును అధికారులు సిద్ధం చేస్తున్నారు. ఈ నివేదికను కేంద్ర ప్రభుత్వం పరిశీలించి నిధులను మంజూరు చేయనుంది.
మరిన్ని లైఫ్ స్టైల్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి…
