AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అరెరె ఇన్నాళ్లు ఇంత పొరపాటు చేశామా.. వానాకాలంలో కొబ్బరి నీళ్లు వీరికి విషంతో సమానం..

ప్రకృతి ప్రసాదించిన అమృతంలాంటి కొబ్బరి నీళ్లు తక్షణ శక్తికి, శరీరానికి కావలసిన పోషకాలకు నిలయం. ఈ సీజన్‌లో వాతావరణంలో తేమ ఎక్కువగా ఉండి, పగటి ఉష్ణోగ్రతలు బాగా తగ్గుతాయి. వేసవికి ఎంతో మేలు చేసే కొబ్బరినీళ్లు, చల్లటి వర్షాకాలంలో కొందరికి తీవ్ర అనారోగ్య సమస్యలను తెచ్చిపెడతాయి. ముఖ్యంగా కొన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నవారు వర్షాల సీజన్‌లో కొబ్బరినీళ్లకు దూరంగా ఉండాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు.

Krishna S
|

Updated on: Aug 07, 2026 | 8:18 AM

Share
ఆయుర్వేదం ప్రకారం.. కొబ్బరినీళ్లకు శీతల గుణం చాలా ఎక్కువ. వర్షాకాలంలో ఇప్పటికే చల్లటి గాలి, తేమ వల్ల శరీరం త్వరగా చల్లబడుతుంది. ఈ సమయంలో తరచూ జలుబు, దగ్గు, సైన్స్ లేదా ఆస్తమా సమస్యలతో బాధపడేవారు కొబ్బరినీళ్లు తాగితే ఛాతీలో కఫం పెరిగిపోయి శ్వాస తీసుకోవడం మరింత కష్టమవుతుంది. వర్షాకాలంలో వచ్చే జ్వరం, గొంతు నొప్పి ఉన్నప్పుడు వీటిని అస్సలు తాగకూడదు.

1 / 5
జీర్ణక్రియ, కడుపు ఉబ్బరం: వర్షాకాలంలో దాహం తక్కువగా వేయడం, వాతావరణం చల్లగా ఉండటం వల్ల జీర్ణ వ్యవస్థ మందగిస్తుంది. ఇప్పటికే గ్యాస్, అసిడిటీ, ఇరిటబుల్ బవల్ సిండ్రోమ్ లేదా కడుపు ఉబ్బరం సమస్యలు ఉన్నవారు ఈ సీజన్‌లో కొబ్బరినీళ్లు తాగితే జీర్ణం కావడం కష్టమవుతుంది. వీటిలోని ఫైబర్, ఖనిజాలు చల్లటి వాతావరణంలో కడుపులో తిప్పడం, వికారం లేదా మోషన్లకు దారితీసే అవకాశం ఉంది.

2 / 5
కిడ్నీ సమస్యలు ఉన్నవారు: కొబ్బరినీళ్లలో పొటాషియం చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణ రోజుల్లో పొటాషియం శరీరానికి ఉపయోగపడినా, వర్షాకాలంలో శరీరంలో ద్రవాల సమతుల్యత వేగంగా మారుతుంది. కిడ్నీలు సరిగ్గా పనిచేయనివారు పొటాషియాన్ని బయటకు పంపలేక రక్తంలో హైపర్‌కలేమియా సమస్యకు గురవుతారు. వర్షాకాలంలో ఇది కండరాల నొప్పులకు, గుండె స్పందనల్లో తీవ్రమైన తేడాలకు కారణమవుతుంది.

3 / 5
డయాబెటిస్: వర్షాకాలంలో బయట తిరగడం తగ్గడం వల్ల శారీరక శ్రమ తగ్గుతుంది. కొబ్బరినీళ్లలో సహజమైన చక్కెరలు ఎక్కువగా ఉంటాయి. వ్యాయామం, శారీరక శ్రమ తక్కువగా ఉండే ఈ వర్షాల సీజన్‌లో డయాబెటిస్ ఉన్నవారు కొబ్బరినీళ్లు ఎక్కువగా తాగితే రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు ఒక్కసారిగా పెరిగి అదుపు తప్పే ప్రమాదం ఉంది. అంతేకాకుండా కొబ్బరినీళ్లలోని అధిక పొటాషియం బీపీని తగ్గించే గుణాన్ని కలిగి ఉంటుంది. ఈ సీజన్‌లో కొబ్బరినీళ్లు తాగితే రక్తపోటు అత్యంత ప్రమాదకర స్థాయికి పడిపోయి తలతిరగడం, స్పృహ తప్పడం వంటివి జరుగుతాయి.

4 / 5
సర్జరీ ప్లాన్ : వర్షాకాలంలో ఇన్ఫెక్షన్ల భయం ఎక్కువగా ఉంటుంది కాబట్టి శస్త్రచికిత్సలకు ప్రత్యేక శ్రద్ధ అవసరం. రాబోయే రోజుల్లో సర్జరీ జరగబోయే రోగులు కనీసం రెండు వారాల ముందు నుంచే కొబ్బరినీళ్లు తాగడం ఆపేయాలి. వర్షాకాలంలో ఇవి శరీరంలోని ఎలక్ట్రోలైట్లు, రక్తపోటు స్థాయిలను వేగంగా మారుస్తాయి. దీనివల్ల సర్జరీ సమయంలో అనస్థీషియా ఇవ్వడం, రక్తపోటును నియంత్రించడం వైద్యులకు కష్టమవుతుంది. కొందరికి కొబ్బరినీళ్లలోని ప్రోటీన్ల వల్ల తీవ్రమైన అలర్జీ వచ్చే అవకాశం ఉంటుంది. వర్షాకాలంలో చర్మంపై తేమ వల్ల ఇన్‌ఫెక్షన్లు రావడం సహజం. ఇలాంటి సమయంలో అలర్జీ ఉన్నవారు కొబ్బరినీళ్లు తాగితే చర్మంపై దద్దుర్లు, దురద, పెదవుల వాపు లేదా శ్వాస ఆడకపోవడం వంటి సమస్యలు ఎదురవుతాయి.

5 / 5
Follow Us