బెడ్ రూమ్‌లో పొరపాటున కూడా ఈ పనులు చేయకండి!

06-08-2026

Pic credit - Instagram

Phani Ch

బెడ్ రూమ్‌లో పవిత్రమైన రాధా-కృష్ణుల ఫోటో తప్ప ఇతర దేవతల ఫోటోలు లేదా విగ్రహాలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇతర దేవుళ్ల పటాలు ఉంటే వాస్తు దోషాలు కలగడమే కాకుండా ప్రతికూల శక్తులు పెరుగుతాయి.

బెడ్ రూమ్‌లో చిన్న పిల్లలు ఉన్న సమయంలో దంపతులు శృంగారంలో పాల్గొనకూడదని వాస్తు నిపుణులు చెబుతున్నారు. ఇది ఆ గదిలోని పాజిటివ్ ఎనర్జీని దెబ్బతీస్తుంది.

చాలామందికి బెడ్‌పై కూర్చుని భోజనం చేయడం లేదా తిండి పదార్థాలు తినే అలవాటు ఉంటుంది. కానీ బెడ్ పై కూర్చుని భోజనం చేయడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం తగ్గి, ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.

సూర్యోదయం తర్వాత, అంటే ఉదయం సమయంలో శృంగారంలో పాల్గొనకూడదు. ఉదయ కాలం దేవతల సమయంగా భావిస్తారు, కాబట్టి ఆ సమయంలో దైవ చింతన, ప్రార్థనలకు ప్రాధాన్యత ఇవ్వడం మంచిది.

బెడ్ రూమ్‌లో అద్దం ఉంచకూడదు. ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఉంచాల్సి వస్తే, రాత్రి పడుకునే సమయంలో మంచం ప్రతిబింబం అద్దంలో కనిపించకుండా దానిపై ఒక గుడ్డను ఖచ్చితంగా కప్పాలి.

మరణించిన పూర్వీకుల ఫోటోలను ఎప్పుడూ బెడ్ రూమ్‌లో పెట్టకూడదు. పితృదేవతల చిత్రాలను పూజా గదిలో లేదా ఇంట్లోని ఇతర నిర్దేశిత స్థలాల్లో మాత్రమే పూజించడం శ్రేయస్కరం.

రాత్రి పడుకునే సమయంలో భార్య ఎప్పుడు భర్తకు ఎడమ వైపు మాత్రమే నిద్రించాలి. ఇది దంపతుల మధ్య అనురాగాన్ని పెంచి, దాంపత్య బంధాన్ని మరింత బలపరుస్తుందని నమ్ముతారు.