AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్.. బీఎస్ఎన్ఎల్ దెబ్బకు వాటి పని అయిపోయినట్లే..

ప్రస్తుతం రీఛార్జ్ బాదుడు మామూలుగా లేదు. టెలికామ్ కంపెనీలు అంతకంతకూ రేట్లు పెంచుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఈ క్రమంలో యూజర్లను ఆకట్టుకునేందుకు బీఎస్ఎనల్ అద్భుత ప్లాన్లను అందుబాటులోకి తీసుకొచ్చింది. అతి తక్కువ ధరకే అదిరే వ్యాలిడిటీతో ఈ ప్లాన్స్ ఉండడం గమనార్హం.

బంపర్ ఆఫర్ అంటే ఇదీ.. 51కే రోజుకు 2GB డేటా.. అన్‌లిమిటెడ్ కాల్స్.. బీఎస్ఎన్ఎల్ దెబ్బకు వాటి పని అయిపోయినట్లే..
1499 ప్లాన్ వివరాలు: ఈ BSNL రీఛార్జ్ ప్లాన్ 300 రోజుల వ్యాలిడిటీ, అపరిమిత వాయిస్ కాలింగ్, రోజుకు 100 SMS మెసేజ్‌లు, అపరిమిత డేటాను అందిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్‌సైట్ ప్రకారం, ఈ ప్లాన్ 32GB FUP పరిమితితో వస్తుంది. అంటే 32GB డేటాను ఉపయోగించిన తర్వాత వేగ పరిమితి 40kbpsకి తగ్గుతుంది. ఈ ప్లాన్ వోచర్ కేవలం ప్రీపెయిడ్ వినియోగదారులకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.
Krishna S
|

Updated on: Jun 22, 2026 | 5:10 PM

Share

భారతీయ టెలికాం రంగంలో ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్ సరికొత్త ఆఫర్లతో యూజర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీల రీఛార్జ్ ధరల పెంపుతో విసిగిపోయిన కస్టమర్లను ఆకట్టుకోవడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ రెండు అద్భుతమైన కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. తక్కువ బడ్జెట్‌తో అన్‌లిమిటెడ్ ఆఫర్స్ కావాలనుకునేవారికి ఈ ప్లాన్ అద్భుతంగా ఉంటుంది. అవును..తక్కువ ఖర్చుతో ఎక్కువ వాలిడిటీ, అదిరిపోయే డేటా కావాలనుకునే వినియోగదారులకు ఈ రూ.225 ప్లాన్ ఒక వరం లాంటిదని చెప్పొచ్చు. ప్రైవేట్ టెలికామ్ కంపెనీలు 28 రోజుల వాలిడిటీకే భారీగా వసూలు చేస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ ఏకంగా 30 రోజుల వాలిడిటీని ఇస్తోంది.

ఈ ప్లాన్ వివరాలు

దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా ఎలాంటి అదనపు ఛార్జీలు లేకుండా అపరిమితంగా మాట్లాడుకోవచ్చు. ఈ ప్లాన్‌లో యూజర్లకు రోజుకు 2.5 GB హై స్పీడ్ డేటా లభిస్తుంది. అంటే నెల మొత్తంలో దాదాపు 75 GB డేటా మీ సొంతమవుతుంది. రీల్స్ చూసేవారికి, వర్క్ ఫ్రమ్ హోమ్ చేసేవారికి ఇది బెస్ట్ ఆప్షన్. ప్రతిరోజూ 100 ఉచిత ఎస్ఎమ్ఎస్‌ల సౌకర్యం కూడా ఉంది. దేశంలో మీరు ఎక్కడికి ప్రయాణించినా ఉచిత నేషనల్ రోమింగ్ ప్రయోజనం వర్తిస్తుంది.

కొత్త కస్టమర్ల కోసం రూ.51 ధమాకా ఆఫర్..

కొత్త యూజర్లను తమ వైపు తిప్పుకునేందుకు బీఎస్ఎన్ఎల్ ఊహించని ఆఫర్ తీసుకొచ్చింది. కేవలం రూ.51 రూపాయలకే ఒక ప్రత్యేక ప్లాన్‌ను లాంచ్ చేసింది. అయితే ఈ ఆఫర్ కేవలం జూన్ 30 వరకు మాత్రమే అందుబాటులో ఉంటుందని కంపెనీ స్పష్టం చేసింది.

రూ.51 ప్లాన్ ప్రత్యేకతలు..

వాలిడిటీ: ఈ ప్లాన్ ద్వారా కొత్త కస్టమర్లకు 28 రోజుల వాలిడిటీ లభిస్తుంది.

డేటా – కాలింగ్: రోజుకు 2 GB హై స్పీడ్ డేటా, అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్, రోజుకు 100 ఫ్రీ SMSలు లభిస్తాయి.

ఫ్రీ సిమ్ కార్డ్: ఈ ఆఫర్ కింద కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి మారే కస్టమర్లకు సిమ్ కార్డ్ పూర్తిగా ఉచితంగా అందజేస్తున్నారు.

మార్కెట్లో పట్టు కోసం వ్యూహం

ప్రస్తుతం దేశంలోని ప్రైవేట్ కంపెనీలకు గట్టి పోటీ ఇవ్వడానికి బీఎస్ఎన్ఎల్ సరికొత్త వ్యూహాలు రచిస్తోంది. దేశవ్యాప్తంగా తన నెట్‌వర్క్‌ను వేగంగా అప్‌గ్రేడ్ చేస్తూ, సిగ్నల్ వ్యవస్థను మెరుగుపరుస్తోంది. సామాన్య, మధ్యతరగతి ప్రజలకు భారం కాకుండా చాలా తక్కువ ధరలకే మంచి కనెక్టివిటీని అందించడమే లక్ష్యంగా బీఎస్ఎన్ఎల్ దూసుకుపోతుంది.

చాలా మందికి వచ్చే డౌట్లు

ప్రశ్న: ఈ రూ.51 ఆఫర్ పాత కస్టమర్లకు కూడా వర్తిస్తుందా?

జవాబు: లేదు. ఈ రూ.51 ప్లాన్ కేవలం కొత్తగా BSNL నెట్‌వర్క్‌లోకి వచ్చే వారికి మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేయబడింది.

ప్రశ్న: ఈ ప్రత్యేక ఆఫర్ కింద ఉచిత సిమ్ కార్డ్ ఎలా పొందాలి?

జవాబు: మీరు జూన్ 30 లోపు మీ సమీపంలోని BSNL కస్టమర్ కేర్ సెంటర్ సందర్శించి న్యూ కనెక్షన్ లేదా పోర్టింగ్ చేసి ఈ రూ.51 ప్లాన్ ఎంచుకుంటే మీకు సిమ్ కార్డ్ ఉచితంగా లభిస్తుంది.

ప్రశ్న: ఈ ఆఫర్లు ఎప్పటివరకు అందుబాటులో ఉంటాయి?

జవాబు: బీఎస్ఎనల్ఎల్ రూ.225 ప్లాన్ రెగ్యులర్ బడ్జెట్ ప్లాన్‌గా కొనసాగుతుంది. అయితే కొత్త కస్టమర్ల కోసం తీసుకొచ్చిన రూ.51 ఆఫర్ జూన్ 30 వరకే ఉంటుంది.

Follow Us