AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: యజమాని ప్రేమ కోసం తపించిన పెంపుడు కుక్క.. అందరిని కంటతడి పెట్టిస్తున్న దృశ్యం!

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం నేరుగా మనసును తాకుతాయి. ప్రస్తుతం అలాంటి ఓ భావోద్వేగభరిత వీడియో నెటిజన్లను కదిలిస్తోంది. మూగజీవాలు కూడా మనుషుల్లాగే ప్రేమ, ఆప్యాయత, అసూయ, బాధ వంటి భావోద్వేగాలను అనుభవిస్తాయని ఈ వీడియో మరోసారి నిరూపించింది.

Viral Video: యజమాని ప్రేమ కోసం తపించిన పెంపుడు కుక్క.. అందరిని కంటతడి పెట్టిస్తున్న దృశ్యం!
Dog Emotional Video
Balaraju Goud
|

Updated on: Jun 22, 2026 | 5:10 PM

Share

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఎన్నో వీడియోలు వైరల్ అవుతుంటాయి. అయితే కొన్ని వీడియోలు మాత్రం నేరుగా మనసును తాకుతాయి. ప్రస్తుతం అలాంటి ఓ భావోద్వేగభరిత వీడియో నెటిజన్లను కదిలిస్తోంది. మూగజీవాలు కూడా మనుషుల్లాగే ప్రేమ, ఆప్యాయత, అసూయ, బాధ వంటి భావోద్వేగాలను అనుభవిస్తాయని ఈ వీడియో మరోసారి నిరూపించింది.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో ఓ వ్యక్తి సోఫాలో కూర్చుని తన చిన్నారి బిడ్డను ప్రేమగా ఎత్తుకుని ముద్దాడుతూ కనిపించాడు. అదే సమయంలో అతని పెంపుడు కుక్క పక్కనే కూర్చుని ఆ దృశ్యాన్ని గమనిస్తుంది. ఇంతకాలం తనకే దక్కిన యజమాని ప్రేమ ఇప్పుడు బిడ్డకు దక్కుతుండటంతో ఆ కుక్క తీవ్ర భావోద్వేగానికి లోనైనట్లు కనిపించింది. ప్రత్యేకంగా కుక్క ముఖ కవళికలు నెటిజన్ల హృదయాలను కరిగిస్తున్నాయి. చెమ్మగిల్లిన కళ్లతో యజమాని వైపు చూస్తూ, ఒక్కసారి తనను కూడా గమనించమని వేడుకుంటున్నట్లుగా కనిపించింది. వీడియో చివర్లో కెమెరా కుక్క కళ్లపై జూమ్ చేయగా, దాని బాధ మరింత స్పష్టంగా కనిపించింది. యజమాని ప్రేమ కోసం తపిస్తూ, కన్నీళ్లు పెట్టుకునే స్థితిలో ఉన్నట్లు అనిపించింది.

ఈ హృద్యమైన వీడియోను ఇన్‌స్టాగ్రామ్‌లో @pippi_haru అనే ఖాతా షేర్ చేసింది. వీడియోకు ఇప్పటివరకు 16 మిలియన్లకు పైగా వ్యూస్, 10 లక్షలకు పైగా లైక్స్ వచ్చాయి. వేలాది మంది నెటిజన్లు కామెంట్ల రూపంలో తమ భావోద్వేగాలను వ్యక్తం చేస్తున్నారు. “అన్నా.. వాడిని ఒక్కసారి కౌగిలించుకో, వాడు ఏడ్చేలా ఉన్నాడు”, “ఈ కుక్క బాధను చూడలేకపోతున్నాను”, “వీడియో చూసి నాకు నిజంగానే కన్నీళ్లు వచ్చాయి” అంటూ కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ జంతువుల ప్రేమ, విశ్వాసం ఎంత గొప్పదో మరోసారి గుర్తు చేస్తోంది.

వైరల్ వీడియోను ఇక్కడ చూడండి..

మరిన్ని ట్రెండింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
Nag Ashwin: అంతా తెలిసే చేస్తున్నా.. నాగ్ అశ్విన్ సీరియస్..!
Nag Ashwin: అంతా తెలిసే చేస్తున్నా.. నాగ్ అశ్విన్ సీరియస్..!
'ఓ.! సుకుమారి' మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది: ఐశ్వర్యా రాజేష్
'ఓ.! సుకుమారి' మీ అందరికీ తప్పకుండా నచ్చుతుంది: ఐశ్వర్యా రాజేష్
అలర్ట్!డ్రైవింగ్ లైసెన్స్,ఆర్‌సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
అలర్ట్!డ్రైవింగ్ లైసెన్స్,ఆర్‌సీ కార్డులపై రవాణా శాఖ కీలక ఆదేశాలు
చిప్స్, మొబైల్స్ తయారీకి మోదీ సర్కార్ భారీ నజరానా!
చిప్స్, మొబైల్స్ తయారీకి మోదీ సర్కార్ భారీ నజరానా!
1600, 140 సిరీస్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయా?ఎవరు చేస్తారు?
1600, 140 సిరీస్‌ నంబర్ల నుంచి కాల్స్‌ వస్తున్నాయా?ఎవరు చేస్తారు?
పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్‌ చూసి షాక్‌
పెన్షన్‌ కోసం బ్యాంకుకు వెళ్లిన వృద్ధుడు.. బ్యాలెన్స్‌ చూసి షాక్‌
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
రైలు కిటికీకి వేలాడుతూ 15 కి.మీ. ప్రయాణం..!
500 ప్రభుత్వ డాక్టర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్..
500 ప్రభుత్వ డాక్టర్ పోస్టుల మెరిట్ లిస్ట్ విడుదల.. వెరిఫికేషన్..
కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!
కదులుతున్న రైలులో పూజ‌లు.. రైల్వే అధికారుల రియాక్షన్‌ ఇదే!
పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!
పోలీసువైనంత మాత్రాన చట్టం నీ చుట్టం కాదు బాస్‌!