ఆ హీరో నా ఫేవరేట్.. ఆయన కోసమే ఇండస్ట్రీలోకి వచ్చా.. ఫరియా అబ్దుల్లా..

Rajitha Chanti

Pic credit - Instagram

27 April 2026

‘జాతిరత్నాలు’ సినిమాతో చిట్టిగా తెలుగు ప్రేక్షకుల మనసు గెలుచుకున్న ఫరియా అబ్దుల్లా, తన చలాకీతనంతో ఎప్పుడూ వార్తల్లో ఉంటుంది.

ప్రస్తుతం ఆమె తరుణ్ భాస్కర్ హీరోగా నటిస్తున్న ‘గాయపడ్డ సింహం’ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ లాంచ్ వేడుకలో మెరిసింది.

ఈ సందర్భంగా ఫరియా దుల్కర్‌పై తనకున్న ‘క్రష్’ను ఏమాత్రం దాచుకోకుండా బయటపెట్టింది. దుల్కర్ సల్మాన్ అంటే నాకు చాలా ఇష్టమని చెప్పుకొచ్చింది. 

 నిజం చెప్పాలంటే ఆయన వల్లే నేను ఇండస్ట్రీలోకి వచ్చాను. ఆయనను చూడాలనే కోరికతోనే సినిమాల్లోకి రావాలని నిర్ణయించుకున్నాను అంటూ చెప్పుకొచ్చింది.

కేవలం ఆయనను కలవడం కోసమే తాను ఈ రంగంలోకి అడుగుపెట్టానని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచింది. వేదికపై ఉన్న దుల్కర్ సల్మాన్ చిరునవ్వులు చిందించారు.

దుల్కర్ సల్మాన్ కేవలం మలయాళంలోనే కాకుండా తెలుగులో కూడా ‘మహానటి’, ‘సీతారామం’ సినిమాలతో భారీ ఫ్యాన్ బేస్‌ను సంపాదించుకున్నారు.

ఇదిలా ఉంటే.. 997 జూన్ 21న హైదరాబాద్‌లో జన్మించిన ఫరియా సినిమాల్లోకి రాకముందు థియేటర్ ఆర్టిస్ట్, మోడల్, యూట్యూబర్‌గా పనిచేశారు.

ఆమె నటించిన ఇతర చిత్రాలలో లైక్ షేర్ అండ్ సబ్‌స్క్రైబ్, రావణాసుర, మత్తు వదలరా 2 ఆకట్టుకున్నాయి. ఇప్పుడు గాయపడ్డ సింహంలో నటిస్తుంది.