AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Andhra: ఆయనో తహసీల్దార్.. అన్ని తెలిసినోడే వాడి బుట్టలో పడ్డాడు.. కట్ చేస్తే, ఏపీలోనే సెన్సెషనల్..

ఆయనో తాహసీల్దార్.. అతనికి అన్నీ తెలుసు.. కానీ, అతన్నే.. ఏసీబీ అధికారి అంటూ ఓ వ్యక్తి బెదిరించి ఏకంగా.. లక్షలు లక్షలు వసూలు చేశాడు ఓ కేటుగాడు.. తాను ఏసీబీ అధికారినని.. తన అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉందంటూ.. తహసీల్దార్ ను పరిచయం  చేసుకున్నాడు..

Andhra: ఆయనో తహసీల్దార్.. అన్ని తెలిసినోడే వాడి బుట్టలో పడ్డాడు.. కట్ చేస్తే, ఏపీలోనే సెన్సెషనల్..
Ap Crime News
Nalluri Naresh
| Edited By: |

Updated on: Apr 06, 2026 | 10:18 AM

Share

ఆయనో తాహసీల్దార్.. అతనికి అన్నీ తెలుసు.. కానీ, అతన్నే.. ఏసీబీ అధికారి అంటూ ఓ వ్యక్తి బెదిరించి ఏకంగా.. లక్షలు లక్షలు వసూలు చేశాడు ఓ కేటుగాడు.. తాను ఏసీబీ అధికారినని.. తన అవినీతి చిట్టా అంతా నా దగ్గర ఉందంటూ.. తహసీల్దార్ ను పరిచయం  చేసుకున్నాడు.. అంతటితో ఆగకుండా ఏసీబీ అధికారులతో వచ్చి దాడులు చేస్తామని బెదిరించి తాహసీల్దార్ దగ్గర నుంచి దఫా దఫాలుగా 50 లక్షల రూపాయలు వసూలు చేశాడు.. తర్వాత.. కొన్ని రోజులకు అతను ఏసీబీ అధికారి కాదని పక్కా 420 అని తెలిసింది. ఈ ఘటన ఆంధ్రప్రదేశ్ లో కలకలం రేపింది.. వివరాల్లోకి వెళితే.. శ్రీ సత్య సాయి జిల్లా ముదిగుబ్బ తహసిల్దార్ అన్వర్ హుస్సేన్ కు 2021 సంవత్సరంలో ఫోన్ కాల్ వచ్చింది. ఫోన్లో అవతలి వ్యక్తి తనను తాను ఏసీబీ సీఐ హరినాథ్ అని పరిచయం చేసుకున్నాడు. మీ పై అనేక అవినీతి ఆరోపణలు వచ్చాయి.. త్వరలోనే తాహసీల్దార్ కార్యాలయం, ఇంట్లో సోధాలు చేస్తామని తహసిల్దార్ అన్వర్ హుస్సేన్ ను ఏసీబీ సీఐ హరినాథ్ బెదిరించాడు.

ఏసీబీ అధికారి హరినాథ్ బెదిరింపులతో భయపడ్డ తహసిల్దార్ అన్వర్ హుస్సేన్… అనేక సార్లు దఫ దఫాలుగా 50 లక్షల రూపాయలు ఏసీబీ సీఐ హరినాథ్ కు ఇచ్చాడు. కట్‌చేస్తే ఓ రోజు ముదిగుబ్బ తాహసీల్దార్ కార్యాలయం పై ఏసీబీ అధికారులు నిజంగానే దాడి చేసి సోదాలు చేయడంతో.. ఎమ్మార్వో అన్వర్ హుస్సేన్ షాక్ అయ్యాడు. ఇన్ని రోజులు తాను మాట్లాడింది.. ఏసీబీ సోదాలు జరక్కుండా డబ్బులు ఇచ్చింది ఓ నకిలీ ఏసీబీ అధికారికి అన్న సంగతి తెలుసుకొని, మోసపోయానని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ ఘటనపై అప్పట్లోనే కేసు నమోదు అయింది. తాజాగా కేసు విచారణను వేగవంతం చేసి నిందితుడిని పట్టుకోవాలని సత్యసాయి జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ ఆదేశించడంతో.. కేసు రీ ఓపెన్ చేసి నిందితుడిని గుర్తించారు. కూడేరు మండలం కలగల్లు గ్రామానికి చెందిన హనుమంతు నకిలీ ఏసీబీ అధికారి అవతారమెత్తి.. ముదిగుబ్బ తహసిల్దార్ అన్వర్ హుస్సేన్ ను బెదిరించి డబ్బులు వసూళ్లకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. నకిలీ ఏసీబీ అధికారి హనుమంతును ట్రాక్ చేసి ఎట్టకేలకు పోలీసులు అరెస్ట్ చేశారు. అవినీతి అధికారుల భయమే.. నకిలీ ఏసీబీ అధికారుల పాలిట వరమై.. కాసులు కురిపించిందని పలువురు పేర్కొంటున్నారు. ఇలాంటి ఫోన్లు వస్తే పోలీసులను సంప్రదించాలని సూచిస్తున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us