ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో అరుదైన వైద్య ఘటన చోటుచేసుకుంది. అమీనా అనే మహిళ ఐదు రోజుల వ్యవధిలో నాలుగు శిశువులకు జన్మనిచ్చింది. మొదట ఒక బిడ్డ పుట్టగా, ఐదు రోజుల తర్వాత మరో ముగ్గురు శిశువులు జన్మించారు. తీవ్రమైన ఆరో్య సమస్యల మధ్య కూడా సాధారణ కాన్పుతో తల్లీబిడ్డలను కాపాడిన వైద్య బృందాన్ని నిపుణులు ప్రశంసిస్తున్నారు.
వైద్య శాస్త్రంలోనే అత్యంత అరుదైన ఘటన ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌లో జరిగింది. ఒకే కాన్పులో నలుగురు శిశువులు జన్మించడం అరుదైతే, ఇక్కడ ఏకంగా ఐదు రోజుల వ్యవధిలో ఒకే తల్లి నలుగురు శిశువులకు జన్మనిచ్చింది. తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో కూడిన ఈ హై-రిస్క్ కేసులో సాధారణ కాన్పు ద్వారానే ప్రసవం చేసి, తల్లీబిడ్డలను కాపాడి వైద్యులు తమ నైపుణ్యాన్ని చాటుకున్నారు. సంభాల్ జిల్లా ఓబ్రి గ్రామానికి చెందిన అమీనా (31) గర్భం దాల్చింది. రెండో నెలలో చేసిన అల్ట్రాసౌండ్ స్కానింగ్‌లో ఆమె గర్భంలో వేర్వేరు సంచులలో నాలుగు పిండాలు పెరుగుతున్నాయని వైద్యులు గుర్తించారు. గర్భధారణ సమయంలో అమీనా కాలేయ సంబంధిత సమస్యలు, అధిక రక్తపోటుతో పలుమార్లు ఆస్పత్రిలో చేరారు. ఆమె పరిస్థితి విషమంగా మారడంతో వైద్యులు నిరంతరం పర్యవేక్షించారు. ఈ క్రమంలో, ఆరు లేదా ఏడో నెలలో ఉన్న అమీనాకు మే 8న నొప్పులు రావడంతో మొరాదాబాద్‌లోని టీఎంయూ ఆస్పత్రిలో చేర్చారు. మే 9న, ఆమె కేవలం 710 గ్రాముల బరువున్న ఓ మగ శిశువుకు సాధారణ ప్రసవం ద్వారా జన్మనిచ్చింది. అయితే, మిగతా ముగ్గురు శిశువుల జననం వెంటనే జరగకపోవడం వైద్యులను ఆశ్చర్యపరిచింది. వెంటనే అప్రమత్తమైన వైద్య బృందం, అమీనా ఆరోగ్య పరిస్థితిని పరిశీలించి.. ప్రసవాన్ని తాత్కాలికంగా నిలిపివేయడంలో సఫలమయ్యారు. ఐదు రోజుల పాటు ఆమెను నిరంతర పర్యవేక్షణలో ఉంచారు. చివరకు మే 14న అమీనాకు మళ్లీ నొప్పులు మొదలయ్యాయి. ఈసారి ఆమె ఒక మగబిడ్డ, ఇద్దరు ఆడ శిశువులకు సాధారణ కాన్పు ద్వారానే జన్మనిచ్చింది. ప్రస్తుతం తల్లీబిడ్డలు క్షేమంగా ఉన్నారు. నలుగురు శిశువులను నియోనాటల్ కేర్ యూనిట్‌లో ఉంచి ప్రత్యేక వైద్యం అందిస్తున్నారు. వీరిలో ఒక శిశువు ఆరోగ్యం స్థిరంగా ఉండగా, మిగతా వారికి ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని వైద్యులు తెలిపారు. ఈ ఘటనపై శిశువుల తండ్రి ఆలిమ్ ఏం చెప్పారో తెలుసా? తన భార్య, పిల్లలు క్షేమంగా ఉండాలని మాత్రమే ప్రార్థించానని.. వైద్యులకు జీవితాంతం రుణపడి ఉంటానని భావోద్వేగంతో తెలిపారు. డాక్టర్ శుభ్రా అగర్వాల్ నేతృత్వంలోని వైద్య బృందం ఈ అసాధారణ ప్రసవాన్ని విజయవంతం చేసింది. నలుగురు కవలల కేసుల్లో సాధారణ కాన్పు జరగడం అత్యంత అరుదని వైద్య నిపుణులు అంటున్నారు.
మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి
Also Watch:
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
ఉద్యోగమే మీ గుర్తింపు కాదు.. మహిళ వీడియో వైరల్
Bermuda Triangle: 3 కోట్ల ఏళ్ల బెర్ముడా దీవి మిస్టరీని.. ఛేదించిన శాస్త్రవేత్తలు
అక్కడ ఎండలు.. ఇక్కడ వర్షాలు.. తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? 3 రోజుల వెదర్ రిపోర్ట్
అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని!
ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..
లెక్కల టీచర్ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు
ఉద్యోగమే మీ గుర్తింపు కాదు.. మహిళ వీడియో వైరల్
అతను హీరో.. నెట్టింట పొగడ్తలు.. ఏం చేశాడంటే..
కోమా నుంచి మేల్కొన్న యువతి.. లేని పిల్లల కోసం ఆరాటం
బేకరీ ప్రమోషన్ కోసం నటి వినూత్న ప్రయోగం

