1965లో తీవ్ర ఆహార సంక్షోభం, పాకిస్తాన్ యుద్ధం మధ్య, ప్రధాని లాల్ బహదూర్ శాస్త్రి దేశ ప్రజలకు వారానికి ఒక పూట (సోమవారం రెండవ భోజనం) మానేయమని పిలుపునిచ్చారు. ముందుగా తన కుటుంబంతో పాటించి, ప్రజల నుంచి అద్భుత స్పందన పొందారు. శ్వేత, హరిత విప్లవాలకు కారకులైన ఆయన జై జవాన్ జై కిసాన్ నినాదాన్ని ఇచ్చి, దేశ స్వావలంబనకు మార్గం చూపారు.