విశాఖపట్నం సెంట్రల్ ఆర్టీసీ కాంప్లెక్స్‌లో రద్దీగా ఉన్న బస్సు ఎక్కుతున్న ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 11 తులాల బంగారు నగలను మహిళా దొంగల ముఠా చాకచక్యంగా చోరీ చేసింది. బాధితురాలు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేయగా, సీసీటీవీ ఫుటేజీలో దొంగతనం దృశ్యాలు స్పష్టంగా రికార్డయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు.