నెల్లూరు శివార్లలోని అల్లిపురం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా వస్తున్న కారు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న కాలువలోకి దూసుకెళ్లింది. స్థానికులు వెంటనే స్పందించి కారులో ఉన్న డ్రైవర్ను సురక్షితంగా బయటకు తీశారు. స్వల్ప గాయాలైన డ్రైవర్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటన స్థానికంగా ఆందోళన కలిగించింది.