AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రైలు దూసుకొచ్చినా విడిచిపెట్టలేదు.. పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి

రైలు దూసుకొచ్చినా విడిచిపెట్టలేదు.. పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి

Phani CH
|

Updated on: May 19, 2026 | 6:00 PM

Share

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా షాహ్‌పూర్ పటోరి రైల్వే స్టేషన్ వద్ద ఇద్దరు చిన్నారులను కాపాడేందుకు ఓ తల్లి ప్రాణాలకు తెగించింది. వేగంగా దూసుకొస్తున్న రైలు మధ్య పట్టాలపై చిక్కుకున్న ఆమె పిల్లలను గట్టిగా పట్టుకుని రక్షించింది. మరో మహిళ సహాయంతో ప్రమాదం నుంచి బయటపడిన ఈ ఘటన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మాతృత్వానికి నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు.

బీహార్‌లోని సమస్తిపూర్ జిల్లా షాహ్‌పూర్ పటోరి రైల్వే స్టేషన్ లో ఘోర ప్రమాదం తృటిలో తప్పింది. పట్టాలు దాటుతున్న ఇద్దరు పిల్లలను కాపాడేందుకు ఒక తల్లి తన ప్రాణాలను పణంగా పెట్టింది. ఈ షాకింగ్‌ సంఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ దృశ్యాలు చూసిన వారంతా షాకవుతున్నారు. వైరల్ అవుతున్న వీడియో క్లిప్‌లో… వేగంగా దూసుకొస్తున్న రైలు ముందు ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్న పిల్లలు పట్టాలపై చిక్కుకుపోయి కనిపించారు. రైలు వేగంగా దూసుకువస్తుండటంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో.. తల్లి తన పిల్లలను కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకుంది. రైలు వేగానికి వచ్చే గాలి, ఒత్తిడి వల్ల ఆ మహిళను రైలు ఇంజన్, బోగీలు పదేపదే బలంగా ఢీకొంటూ, రాసుకుంటూ వెళ్లాయి. అయినప్పటికీ ఆమె ఏ మాత్రం భయపడకుండా .. తన పిల్లలను గట్టిగా పట్టుకుని రక్షించడానికి ప్రయత్నించింది. ఒకానొక దశలో రైలు వేగానికి ఆ తల్లి రైలు కింద పడిపోయేంత ప్రమాదకర పరిస్థితి ఏర్పడింది. అయితే, ఆమె పక్కనే ఉన్న మరో మహిళ అత్యంత చాకచక్యంగా వ్యవహరించింది. ఆమె పట్టాలపై పడిపోకుండా గట్టిగా పట్టుకుంది. రైలు వెళ్లిన తర్వాత వారంతా క్షేమంగా లేచి పక్కకు వచ్చేశారు. దీంతో అక్కడున్న వారంతా ఊపిరి పీల్చుకున్నారు. కన్నబిడ్డల కోసం ప్రాణాలకు తెగించిన ఆ తల్లి మాతృత్వానికి నెటిజన్లు సలాం కొడుతుండగా.. రైల్వే ట్రాక్‌లు దాటేటప్పుడు ప్రజలు ఎంత అప్రమత్తంగా ఉండాలో ఈ ఘటన మరోసారి హెచ్చరించింది.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

ముందే రుతుపవనాలు.. కానీ ‘ఎల్ నినో’ గండం!

10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్‌లో 720కి 107 మార్కులే !! బయటపడిన భారీ స్కామ్

అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని! వైరల్ అయిన ఉద్యోగిని వీడియో

ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

లెక్కల టీచర్‌ సొంత ఖర్చుతో.. విమానమెక్కిన విద్యార్థులు

Follow Us