AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ

పిస్టళ్లతో వచ్చిన దొంగలకు లేడీ షాక్.. చుక్కలు చూపించిన మహిళ

Phani CH
|

Updated on: May 19, 2026 | 6:02 PM

Share

మహారాష్ట్రలోని నాసిక్‌లో నగల దుకాణంలోకి చొరబడ్డ ఆరుగురు దుండగులను షాపు యజమాని నయన పగారియా ధైర్యంగా ఎదుర్కొన్నారు. పిస్టళ్లతో బెదిరించినా వెనక్కి తగ్గకుండా దొంగలపై వస్తువులు విసిరి, అరుస్తూ వారిని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ ఘటనలో ఉద్యోగి అమిత్ శ్రీమాలి కాల్పులకు గురై తీవ్రంగా గాయపడ్డారు. సీసీటీవీ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

మహారాష్ట్రలోని నాసిక్ పంచవటి పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం రాత్రి దోపిడీ దొంగలు నగల షాపులోకి చొరబడ్డారు. రద్దీగా ఉండే హిరావాడి ప్రాంతంలోని న్యూ సమృద్ధి జ్యువెలర్స్ లక్ష్యంగా ఆరుగురు దొంగలు చోరికి యత్నించారు. రాత్రి 9 గంటల సమయంలో దుకాణం మూసేందుకు యజమాని నయన పగారియా, సిబ్బంది అమిత్ శ్రీమాలి, మరో మహిళా ఉద్యోగి సిద్ధమవుతున్నారు. సరిగ్గా అదే సమయంలో మూడు బైకులపై ముసుగులు ధరించిన ఆరుగురు దుండగులు మెరుపు వేగంతో లోపలికి దూసుకొచ్చారు. రాగానే పిస్టళ్లు తీసి అందరినీ చంపేస్తామంటూ బెదిరించారు. దొంగలు బెదిరిస్తున్నా షాపు యజమాని నయన పగారియా అస్సలు భయపడలేదు. దొంగలు నగలు ఎత్తుకెళ్తుంటే వారిని అడ్డుకునేందుకు ప్రాణాలకు తెగించింది. కౌంటర్ పై ఉన్న వస్తువులను వారిపైకి విసిరింది. బిగ్గరగా కేకలు వేస్తూ చుట్టుపక్కల వారిని అలర్ట్‌ చేసింది. ఒకానొక దశలో కౌంటర్ మీదకు ఎక్కి మరీ దొంగలను కిందకు తోస్తూ, వారిని పట్టుకోవడానికి ప్రయత్నించింది. ఆమె చూపిన ధైర్యానికి పిస్టళ్లు పట్టుకున్న దొంగలు సైతం ఒక్కక్షణం బిత్తరపోయారు. నిందితులు గాలిలోకి కాల్పులు జరిపారు. ఇదే సమయంలో షాపులో పనిచేసే అమిత్ శ్రీమాలి దొంగలను పట్టుకోవడానికి ప్రయత్నించగా, దుండగులు అతడిపై కాల్పులకు తెగబడ్డారు. తీవ్ర రక్తస్రావం కావడంతో అమిత్ అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. ప్రస్తుతం అతను ఐసీయూలో మృత్యువుతో పోరాడుతున్నారు. అయినా సరే.. నయన పగారియా తన ప్రతిఘటన ఆపలేదు. తన అరుపులతో చుట్టుపక్కల వారిని అప్రమత్తం చేయడంతో దొంగలు కంగారు పడి కొన్ని నగలను అక్కడే వదిలేసి పారిపోయారు. రంగంలోకి దిగిన పోలీసులు రాత్రికి రాత్రే ఇద్దరు అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మిగిలిన నలుగురు నిందితుల కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తున్నాయి. ఈ దోపిడీ యత్నానికి సంబంధించిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి. ప్రాణాలకు తెగించి పోరాడిన నయన పగారియా వీడియో ఇప్పుడు ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆమె ధైర్యసాహసాలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

రైలు దూసుకొచ్చినా విడిచిపెట్టలేదు.. పిల్లల కోసం ప్రాణాలకే తెగించిన తల్లి

ముందే రుతుపవనాలు.. కానీ ‘ఎల్ నినో’ గండం!

10 లక్షలు పెట్టి లీక్ పేపర్ కొన్నా.. నీట్‌లో 720కి 107 మార్కులే !! బయటపడిన భారీ స్కామ్

అమెరికాలో 5కే ఆఫీస్ ఖాళీ.. ఇండియాలో 10వరకు పని! వైరల్ అయిన ఉద్యోగిని వీడియో

ఐదు రోజుల్లో.. నలుగురు శిశువులకు జననం..

Follow Us