AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Greenfield National Highway: కేవలం 6 గంటల్లోనే విజయవాడ టూ బెంగళూరు.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రెడీ.. ప్రారంభం ఎప్పుడంటే..?

త్వరలో ఏపీలో మరో నేషనల్ హైవే అందుబాటులోకి రానుంది. ఇది పూర్తయితే విజయవాడ నుంచి బెంగళూరుకు కేవలం 6 గంటల్లోనే చేరుకోవచ్చు. మొత్తం 8 జిల్లాల గుండా ఇది వెళుతుంది. విజయవాడ-బెంగళూరు ఎకనామిక్ కారిడార్‌లో దీనిని నిర్మిస్తున్నారు. వచ్చే ఏడాదిలో నిర్మాణం పూర్తి కానుంది.

Greenfield National Highway: కేవలం 6 గంటల్లోనే విజయవాడ టూ బెంగళూరు.. గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ హైవే రెడీ.. ప్రారంభం ఎప్పుడంటే..?
National Highway
Venkatrao Lella
|

Updated on: May 19, 2026 | 6:41 PM

Share

ఏపీ ప్రజలకు భారీ శుభవార్త. రాష్ట్రంలో కొత్త నేషనల్ హైవేల పనులు ఊపందుకున్నాయి. ఇప్పటికే అనేక జాతీయ రహదారులు రాష్ట్రం గుండా వెళుతుండగా.. ఇప్పుడు మరికొన్ని రహదారుల పనులు షురూ అయ్యాయి. అందులో భాగంగా బెంగళూరు-కడప-విజయవాడ గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనులు శరవేగంగా జరుగుతున్నాయి. వచ్చే ఏడాది ఈ జాతీయ రహదారి అందుబాటులోకి రానుండగా.. దీని రాకతో ఏపీ ప్రజలకు మెరుగైన ప్రయాణ సౌకర్యం అందుబాటులోకి వస్తుంది. కర్ణాటక, ఏపీని ఈ హైవే కలపనుంది. అధునాతన సౌకర్యాలతో నిర్మిస్తు్న్న ఈ గ్రీన్ ఫీల్డ్ హైవే పనులు దాదాపుగా పూర్తి కావొచ్చాయి. వచ్చే ఏడాది నాటికి పెండింగ్ పనులు కూడా పూర్తవుతాయి.

ఆరు లైన్లతో జాతీయ రహదారి

ఆరు లైన్లతో ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవే నిర్మిస్తున్నారు. దీనికి 544జీగా నామకరణంగా చేశారు. కర్ణాటక, ఏపీని ప్రధాన నగరాల గుండా ఇది వెళుతుంది. మధ్యలో జంక్షన్లు, వంతెలనలు, అండర్‌పాస్‌లు నిర్మిస్తున్నారు. మొత్తం ఆరు ప్యాకేజీలుగా దీనిని విభజించి నిర్మిస్తున్నారు. 620 కిలోమీటర్ల మేర ఇది ఉండనుండగా.. దాదాపు రూ.19 వేల కోట్లు ఖర్చు చేస్తున్నారు. ఏపీలోని 8 జిల్లాల గుండా ఈ హైవే వెళుతుండగా.. దాదాపు 450 కిలోమీటర్ల మేర రాష్ట్రంలో విస్తరించి ఉండనుంది. ఏపీ, కర్ణాటకలో మొత్తం 11 జిల్లాలను ఇది కవర్ చేస్తోంది. దాదాపు 120 కిలోమీటర్ల వేగంతో ఈ హైవేలో ప్రయాణించవచ్చు. ఇప్పటికే అన్ని ప్యాకేజీల్లో దాదాపు 60 శాతం పనులు పూర్తయ్యాయి. మిగిలిన 40 శాతం పనులు వేగంగా పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు చేపడుతున్నారు. వచ్చే ఏడాది నాటికి పూర్తి చేసి పూర్తిస్థాయిలో అందుబాటులోకి తీసుకురానున్నారు.

6 గంటల్లోనే బెంగళూరుకు..

ఇక హైవే పూర్తయితే కేవలం 6 గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకు చేసుకోవచ్చు. అత్యంత వేగవంతమైన ప్రయాణం అందుబాటులోకి వస్తుంది. ప్రయాణ సమయం సగానికి సగం తగ్గుతుందని అధికారులు చెబుతున్నారు. బైకులు, ట్రాక్టర్లు, ఆటోలు వంటి వాటికి ఈ గ్రీన్‌ఫీల్డ్ హైవేలో అనుమతి లేదు. ఇక వాహనాలు ఎక్కబపడితే అక్కడ హైవేలోకి రావడానికి కుదరదు. కేవలం ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్ల వద్ద మాత్రమే వెళ్లడానికి వీలుంటుంది. 40 కిలోమీటర్లకు ఒక జంక్షన్ ఉంటుంది. వాహనాలు ప్రయాణించిన దూరాన్ని బట్టి టోల్ ఛార్జీ వసూలు చేస్తారు. ఇక ప్రకాశం జిల్లాలో 110 కిలోమీటర్ల మేర హైవే విస్తరించి ఉండనుంది. మొత్తం 43 గ్రామాల మీదుగా వెథుతుంది. ప్రకాశం జిల్లాలో 10 వంతెనలు, 28 కల్వర్టులు, 48 చిన్న వంతెనలు ఉంటాయి. ఇక 28 అండర్‌పాస్‌లు, ఒక రైల్వే ఓవర్ బ్రిడ్జి ఉంటుంది. ఇక గ్రామాల్లోకి వెళ్లేలా 127 బాక్స్ టైప్ అండర్‌పాస్‌లు ఉంటాయి.

Follow Us
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
6 గంటల్లోనే విజయవాడ టు బెంగళూరు.. కొత్త హైవే త్వరలోనే..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
అలాంటి పరిస్థితి వస్తే జీవితంలో అసలు పెళ్లే చేసుకోను..
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
పెళ్లైన పురుషులు అస్సలు చేయకూడని నంబర్ వన్ తప్పు ఇదీ!
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
ఐపీఎల్ తోపులకు మొండిచేయి.. దేశవాళీ హీరోలకే జై కొట్టని గంభీర్
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
హాస్పిటల్స్ ఖర్చులు లేకుండా ఆరోగ్యాన్ని ఇచ్చే రాగి సమోసాలు
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
జీతం రాగానే అయిపోతోందా? డబ్బు ఆదా చేయడానికి స్మార్ట్ టిప్స్!
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
కాల్షియం, ప్రోటీన్ డ్రింక్.. వేసవి దాహాన్ని ఇట్టే తీరుస్తుంది..
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
మెడపై ఉన్న మొండి నలుపు మాయం అవ్వడం ఖాయం.. ఇలా చేయండి!
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
వారి అకౌంట్లోకి రూ.20 వేలు.. స్టేటస్ చెక్ చేస్కోండిలా..
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!
ఇక దశ తిరిగినట్టే..! దిగ్బల యోగంతో వారికి ఉన్నత జీవితం పక్కా..!