AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అంతరిక్ష సంస్థలో పనిచేయాలనుకుంటున్నారా?.. ISRO నుంచి ఇంటర్న్‌షిప్ అవకాశం మీ కోసమే!

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ (ISRO)లో ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే యువతకు అరుదైన అవకాశం వచ్చింది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అర్హులైన అభ్యర్థుల నుంచి ఇస్రో దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. కనీసం 60 శాతం మార్కులు లేదా 6.32 CGPA ఉన్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇస్రోలో ఇంటర్న్‌షిప్ పూర్తి చేసిన వారికి సర్టిఫికెట్ అందజేయడంతో పాటు అంతరిక్ష పరిశోధన రంగంలో విలువైన అనుభవం లభించనుంది. అయితే ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎలాంటి స్టైపెండ్ ఉండదు. పూర్తి వివరాల కోసం అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి..

అంతరిక్ష సంస్థలో పనిచేయాలనుకుంటున్నారా?.. ISRO నుంచి ఇంటర్న్‌షిప్ అవకాశం మీ కోసమే!
ISRO Internship Opportunity
Srilakshmi C
|

Updated on: Jul 26, 2026 | 5:14 PM

Share

భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ ఇస్రో (ISRO – Indian Space Research Organisation) యువతకు అద్భుతమైన అవకాశాన్ని అందిస్తోంది. దేశంలోని ప్రముఖ అంతరిక్ష పరిశోధనా సంస్థలో ఇంటర్న్‌షిప్ చేయాలనుకునే సైన్స్ అండ్ టెక్నాలజీ విద్యార్థులు, గ్రాడ్యుయేట్లు, పీజీ పూర్తి చేసిన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అంతరిక్ష రంగంలో ఎన్నో విజయాలు సాధించిన ఇస్రోలో పనిచేయడం ఎంతోమంది యువత కల. అలాంటి వారికి పరిశోధన, సాంకేతిక రంగాల్లో అనుభవం పొందేందుకు ఈ ఇంటర్న్‌షిప్ మంచి అవకాశంగా నిలవనుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగాల్లో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఇంటర్న్‌షిప్‌కు అర్హులు. దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు కనీసం 60 శాతం మార్కులు సాధించి ఉండాలి. లేదా 10కి 6.32 సీజీపీఏ కలిగి ఉండాలి. కేవలం భారతీయ పౌరులు మాత్రమే దరఖాస్తు చేసుకోవల్సి ఉంటుంది.

ఇస్రోకు చెందిన పలు యూనిట్లు, వివిధ విభాగాల్లో ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం ఉంటుంది. అంతరిక్ష పరిశోధన, శాస్త్ర సాంకేతిక రంగాలకు సంబంధించిన ప్రాజెక్టుల్లో పనిచేసే అవకాశం అభ్యర్థులకు లభిస్తుంది. ఇంటర్న్‌షిప్ విజయవంతంగా పూర్తి చేసిన వారికి ఇస్రో తరఫున సర్టిఫికెట్ అందజేస్తారు. ఈ సర్టిఫికెట్ భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాలు, ఉన్నత విద్యకు దోహదపడుతుంది. అయితే ఇంటర్న్‌షిప్‌ సమయంలో ఇస్రో ఎలాంటి స్టైపెండ్ లేదా పారితోషికం ఇవ్వదు. అలాగే వసతి, భోజనం వంటి ఖర్చులను అభ్యర్థులే భరించుకోవాల్సి ఉంటుంది.

ఇస్రో ఇంటర్న్‌షిప్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

ఇటీవలి కాలంలో ఇస్రోలో పలువురు శాస్త్రవేత్తలు రాజీనామా చేయడం చర్చనీయాంశంగా మారింది. ఇందులో సీనియర్ స్థాయి శాస్త్రవేత్తలు కూడా ఉన్నట్లు సమాచారం. స్తుతం ఇస్రోలో సిబ్బంది కొరత ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం 20,269 పోస్టులకు గాను 5,632 పోస్టులు ఖాళీగా ఉన్నట్లు సమాచారం. దాదాపు మూడు ఉద్యోగాల్లో ఒకటి ఖాళీగా ఉండటం గమనార్హం. 2001-02 తర్వాత ఇస్రోలో ఇంత స్థాయిలో ఖాళీలు ఉండటం ఇదే తొలిసారి అని తెలుస్తోంది. అప్పట్లో ఇస్రోలో 14,847 మంది ఉద్యోగులు పనిచేశారు. ఇస్రో ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, అందుబాటులో ఉన్న విభాగాల సమాచారం కోసం అభ్యర్థులు ఇస్రో అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి. అంతరిక్ష పరిశోధన రంగంలో కెరీర్ నిర్మించుకోవాలనుకునే యువతకు ఈ ఇంటర్న్‌షిప్ మంచి అవకాశంగా మారనుంది.

ఇస్రో ఇంటర్న్‌షిప్‌కు ఆన్‌లైన్‌ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి.

Follow Us