ఇంజినీరింగ్ విద్యార్థులకు Amazon స్కాలర్‌షిప్ 2026.. రూ.2 లక్షల ఆర్థిక సాయం, ఉచిత ల్యాప్‌టాప్!
ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు అమెజాన్ ఇండియా, ఫౌండేషన్ ఫర్ ఎక్సెలెన్స్ (FFE) సంయుక్తంగా శుభవార్త అందించాయి. అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ 2026 ద్వారా అర్హులైన విద్యార్థులకు ఏడాదికి రూ.50,000 చొప్పున నాలుగేళ్లకు మొత్తం రూ.2 లక్షల ఆర్థిక సాయం అందించనున్నారు. అంతేకాకుండా మొదటి సంవత్సరం విద్యార్థులకు ఉచిత ల్యాప్‌టాప్, ప్రత్యేక మెంటార్‌షిప్, టెక్నికల్ శిక్షణతో పాటు అమెజాన్‌లో 8 వారాల పెయిడ్ ఇంటర్న్‌షిప్ అవకాశం కూడా కల్పించనున్నారు. అర్హులైన విద్యార్థులు నవంబర్ 30, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి..

హైదరాబాద్, నవంబర్ 12: ఇంజినీరింగ్ చదువుతున్న విద్యార్థులకు ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ అమెజాన్ ఇండియా శుభవార్త అందించింది. ప్రతిభావంతులైన, ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు ఫౌండేషన్ ఫర్ ఎక్సెలెన్స్ (FFE) సంస్థతో కలిసి ‘అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ 2026’ పథకాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ స్కాలర్‌షిప్ ద్వారా అర్హులైన విద్యార్థులకు నాలుగేళ్ల పాటు ఆర్థిక సహాయంతో పాటు ఉచిత ల్యాప్‌టాప్, ప్రత్యేక శిక్షణ, మెంటార్‌షిప్, ఇంటర్న్‌షిప్ అవకాశాలను కల్పించనున్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నవంబర్ 30, 2026లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
ఏడాదికి రూ.50 వేలు.. మొత్తం రూ.2 లక్షల స్కాలర్‌షిప్
అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు ప్రతి సంవత్సరం రూ.50,000 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తారు. నాలుగేళ్ల ఇంజినీరింగ్ కోర్సు పూర్తయ్యే వరకు మొత్తం రూ.2 లక్షల వరకు స్కాలర్‌షిప్ ప్రయోజనం పొందవచ్చు. దీంతో విద్యార్థులు తమ చదువులకు సంబంధించిన ఖర్చులను కొంతవరకు తగ్గించుకోవచ్చు.
మొదటి ఏడాదే ఉచిత ల్యాప్‌టాప్
ఈ స్కాలర్‌షిప్‌లో భాగంగా ఎంపికైన మొదటి సంవత్సరం ఇంజినీరింగ్ విద్యార్థులకు ఉచితంగా ల్యాప్‌టాప్ అందించనున్నారు. టెక్నాలజీ రంగంలో తమ నైపుణ్యాలను పెంపొందించుకోవడానికి అవసరమైన సాంకేతిక సహకారాన్ని కూడా అందిస్తారు. కేవలం ఆర్థిక సాయానికే పరిమితం కాకుండా విద్యార్థుల కెరీర్ అభివృద్ధికి కూడా అమెజాన్ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోంది. ఇందులో భాగంగా అమెజాన్ ఇంజినీర్ల ఆధ్వర్యంలో మెంటార్‌షిప్ కార్యక్రమాలు నిర్వహిస్తారు. అలాగే టెక్నికల్ బూట్‌క్యాంప్స్, వెబినార్లు, స్కిల్ డెవలప్‌మెంట్ వర్క్‌షాప్‌ల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ అందిస్తారు. కోర్సులో రెండో సంవత్సరం పూర్తయిన తర్వాత అర్హులైన విద్యార్థులకు అమెజాన్ సంస్థలో ఎనిమిది వారాల పాటు వేతనంతో కూడిన (Paid) ఇంటర్న్‌షిప్ చేసే అవకాశం కూడా కల్పిస్తారు.
ఎవరు అర్హులు?
దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన కళాశాలల్లో అండర్ గ్రాడ్యుయేట్ ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవేశం పొందిన విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. ముఖ్యంగా కింది అర్హతలు ఉన్నవారికి ప్రాధాన్యత ఉంటుంది..
- కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లేదా సంబంధిత ఇంజినీరింగ్ కోర్సులు చదువుతున్నవారు.
- కుటుంబ వార్షిక ఆదాయం రూ.3 లక్షల లోపు ఉన్నవారు.
- మెరిట్ ఎంట్రన్స్ పరీక్షలు లేదా కౌన్సెలింగ్ ద్వారా ఇంజినీరింగ్‌లో ప్రవేశం పొందినవారు.
- మొదటి సంవత్సరం చదువుతున్న మహిళా ఇంజినీరింగ్ విద్యార్థులు.
- మంచి విద్యా ప్రతిభ కలిగి ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులు.
ఈ ఎంపికలో ముఖ్యంగా మొదటి సంవత్సరం చదువుతున్న మహిళా విద్యార్థులకు, ఆర్థికంగా వెనుకబడిన ప్రతిభావంతులకు ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వనున్నారు. అర్హత కలిగిన విద్యార్థులు ఫౌండేషన్ ఫర్ ఎక్సెలెన్స్ (FFE) అధికారిక వెబ్‌సైట్ ద్వారా అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ 2026 కోసం అర్హులైన విద్యార్థులు నవంబర్ 30, 2026లోపు ఆన్‌లైన్ దరఖాస్తులు సమర్పించాలి. చివరి తేదీ వరకు వేచి ఉండకుండా ముందుగానే దరఖాస్తు చేసుకోవడం మంచిది.
అమెజాన్ ఫ్యూచర్ ఇంజినీర్ స్కాలర్‌షిప్ 2026 ఆన్‌లైన్ దరఖాస్తు కోసం ఇక్కడ క్లిక్ చేయండి.




