AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Arshdeep Singh: ముంబైలో చేరగానే డబుల్ ప్రమోషన్.. లవర్‌తో అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం..!

Arshdeep Singh Engagement: ఐపీఎల్ చరిత్రలోనే అతిపెద్ద స్వాప్ ట్రేడ్ ద్వారా ముంబై ఇండియన్స్‌లో చేరిన రోజే టీమిండియా పేసర్ అర్ష్‌దీప్ సింగ్ వ్యక్తిగత జీవితంలోనూ శుభవార్త చెప్పాడు. న్యూజిలాండ్ పర్యటనలో ఉండగానే తన చిరకాల ప్రియురాలు సమ్రీన్ కౌర్‌తో నిశ్చితార్థం ప్రకటించాడు. 11.11.2026 తేదీతో వీరు పంచుకున్న ఫోటోలు ఇప్పుడు వైరల్‌గా మారాయి.

Arshdeep Singh: ముంబైలో చేరగానే డబుల్ ప్రమోషన్.. లవర్‌తో అర్ష్‌దీప్ సింగ్ నిశ్చితార్థం..!
Arshdeep Singh Engagement
Venkata Chari
|

Updated on: Nov 12, 2026 | 10:52 AM

Share

Arshdeep Singh Engagement: వృత్తిపరంగా, వ్యక్తిగతంగా ఒకే రోజు రెండు కీలక మలుపులు తిరగడం అరుదు. భారత లెఫ్టార్మ్ పేసర్ అర్ష్‌దీప్ సింగ్ విషయంలో అదే జరిగింది. నవంబర్ 11 ఉదయం పంజాబ్ కింగ్స్ నుంచి ముంబై ఇండియన్స్‌కు అతని ట్రేడ్ ఖరారైనట్లు అన్ని వర్గాలు ప్రకటించాయి. హార్దిక్ పాండ్యాకు బదులుగా అర్ష్‌దీప్ ముంబై గూటికి చేరడం ఐపీఎల్ ట్రేడ్ చరిత్రలో సంచలనంగా మారింది. ట్రేడ్ వార్త వెలువడిన వెంటనే అర్ష్‌దీప్ ఎంఐ అభిమానులకు ప్రత్యేక సందేశం పంపాడు.

అదే రోజు సాయంత్రానికి మరో తీపి కబురు. న్యూజిలాండ్‌లో వన్డే సిరీస్ కోసం ఉన్న అర్ష్‌దీప్.. తన ప్రియురాలు సమ్రీన్ కౌర్‌కు ఉంగరం తొడిగి జీవితాంతం తోడుంటానని మాట ఇచ్చాడు.

ఇవి కూడా చదవండి

న్యూజిలాండ్ గడ్డపై ప్రపోజ్.. “11.11.2026”..

అర్ష్‌దీప్, సమ్రీన్ ఇన్‌స్టాగ్రామ్‌లో కొలాబరేటివ్ పోస్ట్ ద్వారా నిశ్చితార్థాన్ని ప్రకటించారు. మోకాలిపై కూర్చుని అర్ష్‌దీప్ ప్రపోజ్ చేస్తున్న ఫోటోలు అభిమానుల హృదయాలను గెలుచుకున్నాయి.

ఎక్కువమంది చదివినది: గ్రీస్‌లో ఘనంగా అనిరుధ్, కావ్య మారన్ పెళ్లి.. ఫోటోస్ వైరల్.. చెన్నైలో గ్రాండ్ రిసెప్షన్ ఎప్పుడంటే?

“and of all the things life could have given us, I’m the happiest it gave us each other. To a lifetime together. 11.11.2026” అంటూ సమ్రీన్ భావోద్వేగంగా రాసింది. జీవితం ఇచ్చే అన్నింటిలో ఒకరికొకరు దొరకడమే అత్యంత సంతోషమని, జీవితాంతం కలిసి నడవబోతున్నామని ఆమె ప్రకటించడం అభిమానుల నుంచి శుభాకాంక్షల వెల్లువకు కారణమైంది.

వీరిద్దరి బంధం క్రికెట్ వర్గాలకు కొత్తేమీ కాదు. చాలా కాలంగా వీరు బహిరంగంగానే కలిసి కనిపిస్తున్నారు. ఐపీఎల్ 2026 సీజన్ మొత్తం, భారత జట్టు మ్యాచ్‌ల సందర్భంగా స్టేడియాల్లో సమ్రీన్ కనిపించింది. ప్రస్తుత న్యూజిలాండ్ పర్యటనకు కూడా సమ్రీన్ అతనితో కలిసి వెళ్లింది. టెస్టు జట్టుతో కూడా అర్ష్‌దీప్ అక్కడే ఉండనున్న నేపథ్యంలో ఈ నిశ్చితార్థ వేడుకకు కివీస్ గడ్డ వేదికైంది.

సిరీస్‌లో భారత్ పైచేయి.. ఫామ్‌లో అర్ష్‌దీప్..

View this post on Instagram

A post shared by Samreen (@samreenkaur__)

నిశ్చితార్థ ప్రకటనకు ఒక రోజు ముందే మూడో వన్డే వర్షం కారణంగా రద్దయింది. దీంతో 2-0 ఆధిక్యంలో ఉన్న భారత్ సిరీస్‌ను కోల్పోయే ప్రమాదం తప్పింది. కివీస్‌కు సిరీస్ గెలిచే అవకాశం లేకుండా పోయింది.

ఎక్కువమంది చదివినది: Video: 49 ఫోర్లు, 21 సిక్సర్లు.. ఇది విధ్వంసం కాదయ్యా.. 487 పరుగులతో బీభత్సం..

వ్యక్తిగతంగా అర్ష్‌దీప్ మంచి ఫామ్‌లోనే ఉన్నాడు. వన్డేల్లో రెండు ఇన్నింగ్స్‌ల్లో 4 వికెట్లు తీశాడు. అవన్నీ తొలి మ్యాచ్‌లోనే 4/70 గణాంకాలతో రావడం విశేషం. భారత్ తరఫున అత్యధిక టీ20ఐ వికెట్లు తీసిన బౌలర్‌గా రికార్డు సృష్టించిన అర్ష్‌దీప్.. ఈ పర్యటనలో టీ20ఐ సిరీస్‌లో 6 వికెట్లతో భారత్ తరఫున అత్యుత్తమ బౌలర్‌గా నిలిచాడు. వన్డే సెటప్ చుట్టూ ఉన్న పేర్లలో అతను ముందు వరుసలో ఉన్నాడు.

వరల్డ్‌కప్ రేసు.. చివరి రెండు మ్యాచ్‌లు కీలకం..

వన్డే ప్రపంచకప్ జట్టులో కేవలం రెండు స్థానాల కోసం పోటీ నుంచుంది. జస్ప్రీత్ బుమ్రా, అంశుల్ కాంబోజ్ గైర్హాజరీ నేపథ్యంలో అర్ష్‌దీప్‌కు ఇది నిరూపించుకునే అవకాశం. మౌంట్ మాంగనూయిలో జరగనున్న చివరి రెండు మ్యాచ్‌ల్లో (నవంబర్ 10, 13) బలంగా రాణిస్తే వరల్డ్‌కప్ బెర్త్ దాదాపు ఖాయమైనట్లే.

వృత్తిలో ముంబై ఇండియన్స్‌తో కొత్త ప్రయాణం, వ్యక్తిగత జీవితంలో పెళ్లి దిశగా అడుగు.. ఇలా రెండు ఫ్రంట్‌లలో శుభవార్తలతో అర్ష్‌దీప్ కెరీర్‌లోని అత్యంత కీలక దశలోకి అడుగుపెడుతున్నాడు. పేసర్‌గా బాధ్యత, జీవిత భాగస్వామిగా బంధం.. రెండింటినీ సమతుల్యం చేసుకుంటూ అతను ఎలా రాణిస్తాడో చూడాలి.

మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us