AFG U19 vs IND U19: టాస్ ఓడిన భారత్.. అందరి చూపు సెంచరీ వీరుడిపైనే..!
Afghanistan U19 vs India U19, Semi Final 2: పురుషుల అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్స్‌లో భారత్ నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఒమన్‌లోని అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మొదలైంది. టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ టీం ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది.

Afghanistan U19 vs India U19, Semi Final 2: పురుషుల అండర్-19 ఆసియా కప్ సెమీఫైనల్స్‌లో భారత్ నేడు ఆఫ్ఘనిస్తాన్‌తో తలపడనుంది. ఈ మ్యాచ్ ఒమన్‌లోని అల్ ఎమిరేట్స్ క్రికెట్ గ్రౌండ్‌లో మొదలైంది. టాస్ గెలిచిన ఆఫ్గానిస్తాన్ టీం ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. కాగా, భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కుమారుడైన ఆర్యవీర్‌పై మరోసారి అందరి దృష్టి ఉండనుంది. అతను గత మ్యాచ్‌లో యూఏఈపై 160 పరుగులు చేశాడు. అలాగే టోర్నమెంట్‌లో అత్యధిక వికెట్లు తీసిన ఆఫ్ఘన్ బౌలర్ నూర్ అలీ నియాజీని ఎదుర్కోనున్నాడు.
ఆఫ్ఘనిస్తాన్‌పై భారత్‌దే పైచేయి..
ఈ రెండు జట్లు ఇప్పటివరకు 13 మ్యాచ్‌లు ఆడాయి. వాటిలో భారత్ 11 గెలవగా, ఆఫ్ఘనిస్తాన్ 2 గెలిచింది. ఈసారి కూడా భారత జట్టుదే పైచేయిగా కనిపిస్తోంది.
టోర్నమెంట్‌లో అత్యధిక పరుగులు సాధించిన ఆర్యవీర్..
ఈ టోర్నమెంట్‌లో ఆర్యవీర్ అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. అతను 3 మ్యాచ్‌లలో 252 పరుగులు చేశాడు, అతని సగటు ఒక్కో మ్యాచ్‌కు 126 పరుగులు. ఇషాన్ సూద్ బౌలింగ్‌తో ఆకట్టుకున్నాడు, 3 మ్యాచ్‌లలో 8 వికెట్లు తీసి అద్భుతమైన ఎకానమీ రేటును కొనసాగించాడు.
వర్షం పడే అవకాశం చాలా తక్కువ..
నవంబర్ 12న అల్ ఎమిరేట్స్‌లో వాతావరణం పాక్షికంగా మేఘావృతమై ఉంటుందని అంచనా. ఉష్ణోగ్రతలు 25 నుంచి 32 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటాయని భావిస్తున్నారు. వర్షం పడే అవకాశం చాలా తక్కువ.
