AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tharun Bhascker: ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా ఉండడం వేస్ట్

Tharun Bhascker: ఇష్టం లేకుండా భార్యాభర్తలుగా ఉండడం వేస్ట్

Phani CH
|

Updated on: Nov 11, 2026 | 2:56 PM

Share

దర్శకుడు తరుణ్ భాస్కర్ పెళ్లి, ప్రేమ, విడాకులు, జెన్ జీ రిలేషన్‌షిప్స్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇష్టం లేకపోయినా పెళ్లి బంధంలో కొనసాగుతూ ఇబ్బందులు పడటం సమయం వృథా చేయడమేనని అభిప్రాయపడ్డారు. ప్రతి ఒక్కరికీ తోడు అవసరమని, ఇష్టపూర్వకంగా కలిసి జీవించాలనుకునే వారిని అలా ఉండనివ్వాలని అన్నారు. ప్రస్తుతం ఆయన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

పెళ్లి చూపులు’, ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్న టాలెంటెడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్. తాజాగా ‘ఈ నగరానికి ఏమైంది 2’తో ప్రేక్షకులను పలకరించడానికి మళ్లీ వస్తున్నారు. ఈ చిత్రం నవంబర్ 19న థియేటర్లలో రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ స్పీడ్‌ పెంచేశారు. తాజాగా తరుణ్ భాస్కర్.. ఓ ఇంటర్వ్యూలో పెళ్లిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడివి వైరల్‌ అవుతున్నాయి. ‘ఈ నగరానికి ఏమైంది 2’ లాగే ‘పెళ్లి చూపులు’ సినిమాకి సీక్వెల్ కూడా ప్లాన్ చేస్తున్నారా? అని ఓ యాంకర్‌ ప్రశ్నించగా.. ‘నాకు ఆ సీక్వెల్ వద్దు. ఈ సినిమాకి వచ్చిన ఒత్తిడికే నేను తట్టుకోలేకపోతున్నా. రిజల్ట్ బాగుండాలని కోరుకుంటున్నా కానీ.. అంచనాలు లేకుండా పని చేయడంలో ఒక హాయి ఉంటుంది. ఇంకా కొన్ని సంవత్సరాలు బతకాలని ఉంది’ అని తరుణ్ భాస్కర్ బదులిచ్చారు. పెళ్లి, పెళ్లి చూపుల గురించి తరుణ్ భాస్కర్ మాట్లాడారు. ‘నా ఉద్దేశ్యంలో ఏ మనిషికైనా సహవాసం ఉండాలి. ఇప్పుడు జెన్ జీ వాళ్లు పెళ్లి మ్యాటర్‌ని.. సిచ్యువేషన్ షిప్ అని ఏదో అంటున్నారు. పెళ్లి అనేది మనం ఇష్టపూర్వకంగా చేసుకునేది. ఎవరైనా కలిసి బతుకుదాం అనుకుంటున్నారంటే వారిని అలాగే ఉండనివ్వండి. వాళ్లు సంతోషంగా ఉంటారు. ఎవడి చావు వాడు చస్తాడు. ఇప్పుడు చాలా కుటుంబాలలో పెళ్లి చేసుకున్న వాళ్లు మాట్లాడుకోకుండా.. ఇష్టం లేకపోయినా కలిసి జీవిస్తూ అవస్థలు పడుతున్నారు. అలాగే జీవితాంతం భరిస్తున్నారు. నేను డివోర్స్ తీసుకోకుండా ఉన్నాను అన్నట్లుగా వ్యవహరిస్తున్నారు. కానీ అదంతా సమయం వృథా అంతే’ అని అన్నారు.

మరిన్ని వీడియోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Also Watch:

అబ్బో.. తేజ్‌ భార్య బ్యాగ్రౌండ్.. చాలా పెద్దదే.. ఆస్తులు కోట్లలోనే..

Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని.. తారక్ కన్నీళ్లు పెట్టుకున్నాడు

‘శ్రీరాముడిగా’ సల్మాన్ ఖాన్.. 20 ఏళ్ల క్రితమే ‘రామాయణ’ సినిమా ప్రకటన.. కానీ…

పవన్ కల్యాణ్ వ్యక్తిగత వ్యవహారంపై.. వైసీపీ కీలక ప్రకటనలు..

సినిమా మార్కెటింగ్ పై.. హీరోల, ప్రొడ్యూసర్ల తీరుపై.. RGV మార్క్‌ విశ్లేషణ!

Follow Us