AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP DSC 2026 స్పెషల్ ఎడ్యుకేషన్‌ నోటిఫికేషన్ విడుదల.. 350 SA, SGT టీచర్ పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. పాఠశాల విద్యాశాఖ APTRT-2026 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్), సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) విభాగాల్లో మొత్తం 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. నవంబర్ 11 నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు ప్రారంభమయ్యాయి. అర్హులైన అభ్యర్థులు నవంబర్ 30, 2026లోగా దరఖాస్తు చేసుకోవాలి. విద్యార్హతలు, వయోపరిమితి, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు వివరాలు తెలుసుకోండి..

AP DSC 2026 స్పెషల్ ఎడ్యుకేషన్‌ నోటిఫికేషన్ విడుదల.. 350 SA, SGT టీచర్ పోస్టులు
AP DSC Special Education Recruitment
Srilakshmi C
|

Updated on: Nov 12, 2026 | 6:30 AM

Share

ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వ ఉపాధ్యాయ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, పాఠశాల విద్యాశాఖ ఉపాధ్యాయ నియామక పరీక్ష (APTRT-2026) నోటిఫికేషన్‌ను విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ ద్వారా ప్రభుత్వ, జిల్లా పరిషత్, మండల పరిషత్, మున్సిపాలిటీ, మున్సిపల్ కార్పొరేషన్ పాఠశాలల్లో స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఖాళీగా ఉన్న 350 పోస్టులను భర్తీ చేయనున్నారు. అర్హత కలిగిన అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. నవంబర్ 11 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభం కాగా, నవంబర్ 30, 2026 చివరి తేదీగా నిర్ణయించారు.

విభాగాల వారీగా ఖాళీలు

APTRT-2026 నోటిఫికేషన్ ద్వారా రెండు రకాల పోస్టులను భర్తీ చేయనున్నారు.

  • స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్): 150 పోస్టులు
  • సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్): 200 పోస్టులు

స్కూల్ అసిస్టెంట్ (స్పెషల్ ఎడ్యుకేషన్) పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు యూజీసీ గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి కనీసం 50 శాతం మార్కులతో గ్రాడ్యుయేషన్ లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు కనీస మార్కుల అర్హత 40 శాతంగా నిర్ణయించారు. వీటితో పాటు రిహాబిలిటేషన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (RCI) గుర్తింపు పొందిన స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసి ఉండాలి. అలాగే ఏపీ టెట్ పేపర్-II Bలో అర్హత సాధించి ఉండాలి. ఇక సెకండరీ గ్రేడ్ టీచర్ (స్పెషల్ ఎడ్యుకేషన్) దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆంధ్రప్రదేశ్ బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ నుంచి కనీసం 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత కలిగి ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, దివ్యాంగ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉంటే సరిపోతుంది.

ఇవి కూడా చదవండి

అలాగే ఆర్‌సీఐ గుర్తింపు పొందిన స్పెషల్ ఎడ్యుకేషన్‌లో బీఈడీ, డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (D.El.Ed) లేదా తత్సమాన డిప్లొమా పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థులు ఆర్‌సీఐ సీఆర్‌ఆర్ నంబర్ కలిగి ఉండటంతో పాటు ఏపీ టెట్ పేపర్-I Bలో ఉత్తీర్ణులై ఉండాలి. 2026 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 44 సంవత్సరాల మధ్య ఉండాలి. రిజర్వేషన్ వర్గాలకు ప్రభుత్వం నిర్ణయించిన నిబంధనల ప్రకారం వయోసడలింపు వర్తిస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 49 సంవత్సరాలు. దివ్యాంగ అభ్యర్థులకు గరిష్ఠ వయస్సు 54 సంవత్సరాలు. మాజీ సైనికోద్యోగులకు సాయుధ బలగాల్లో పనిచేసిన కాలంతో పాటు అదనంగా మూడేళ్ల సడలింపు ఉంటుంది.

దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు ఆన్‌లైన్ విధానంలో నవంబర్ 30, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పోస్టుకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు రూ.1,000 ఫీజు చెల్లించాలి. ఒకటి కంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేయాలనుకునే అభ్యర్థులు ప్రతి అదనపు పోస్టుకు విడిగా ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థుల ఎంపిక కంప్యూటర్ ఆధారిత పరీక్ష (CBT), ఏపీ టెట్ స్కోరు ఆధారంగా జరుగుతుంది. మొత్తం 100 మార్కులకు గాను కంప్యూటర్ ఆధారిత పరీక్షకు 80 శాతం వెయిటేజీ (80 మార్కులు), ఏపీ టెట్ స్కోరుకు 20 శాతం వెయిటేజీ (20 మార్కులు) కేటాయించారు. అలాగే ఐఈఆర్టీఎస్ (IERTS), ఐఈడీఎస్ఎస్ (IEDSS), కేజీబీవీలలో పనిచేస్తున్న అర్హులైన ఉపాధ్యాయులకు ప్రతి పూర్తి సంవత్సరానికి 0.5 మార్కుల చొప్పున గరిష్ఠంగా 5 మార్కుల వరకు సేవా వెయిటేజీ కల్పిస్తారు. పరీక్షలో అర్హత సాధించేందుకు కేటగిరీల వారీగా కనీస మార్కులను నిర్ణయించారు. ఓసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు: 40 శాతం, బీసీ-ఏ, బీ, సీ, డీ, ఈ అభ్యర్థులు: 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగ అభ్యర్థులు: 30 శాతం చొప్పున సాధించవల్సి ఉంటుంది.

ముఖ్యమైన తేదీలు

  • నోటిఫికేషన్ తేదీ: నవంబర్ 11, 2026.
  • ఆన్‌లైన్ దరఖాస్తుల ప్రారంభం: నవంబర్ 11,  2026.
  • ఫీజు చెల్లింపు, దరఖాస్తుకు చివరి తేదీ: నవంబర్ 30, 2026.

స్పెషల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఉపాధ్యాయ ఉద్యోగాలు పొందాలనుకునే అభ్యర్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తు చేసే ముందు విద్యార్హతలు, ఏపీ టెట్ అర్హత, ఆర్‌సీఐ గుర్తింపు, వయోపరిమితి వంటి అంశాలను జాగ్రత్తగా పరిశీలించాలి. పూర్తి వివరాలు, దరఖాస్తు విధానం, ఇతర నిబంధనల కోసం ఏపీ పాఠశాల విద్యాశాఖ అధికారిక నోటిఫికేషన్‌ను పరిశీలించి గడువులోగా దరఖాస్తు చేసుకోవాలి.

Follow Us
AP DSC 2026 స్పెషల్ ఎడ్యుకేషన్‌ నోటిఫికేషన్ విడుదల.. 350 పోస్టులు
AP DSC 2026 స్పెషల్ ఎడ్యుకేషన్‌ నోటిఫికేషన్ విడుదల.. 350 పోస్టులు
వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విధానం! CM గ్రీన్‌సిగ్నల్
వచ్చే విద్యాసంవత్సరం నుంచి 10+2 విధానం! CM గ్రీన్‌సిగ్నల్
సింగపూర్ సహకారంతో ఏపీ విద్యాశాఖలో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు..
సింగపూర్ సహకారంతో ఏపీ విద్యాశాఖలో మరిన్ని శిక్షణ కార్యక్రమాలు..
గురువారం శివకేశవులను ఇలా పూజిస్తున్నారా? సిరిసంపదలు కలుగుతాయట!
గురువారం శివకేశవులను ఇలా పూజిస్తున్నారా? సిరిసంపదలు కలుగుతాయట!
దినఫలాలు: వీరికి ఉద్యోగంలో పురోగతి..ఆర్థిక సమస్యల నుంచి విముక్తి!
దినఫలాలు: వీరికి ఉద్యోగంలో పురోగతి..ఆర్థిక సమస్యల నుంచి విముక్తి!
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
గరుడ పురాణాన్ని ఇంట్లో చదవవచ్చా? మరణం సంభవించినప్పుడే ఎందుకు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
కాశీ, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ యాత్ర.. సికింద్రాబాద్ నుంచి 6 రోజులు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
ఇంటి ప్రధాన ద్వారం ఇలా ఉంటే శుభప్రదమట.. ఈ వాస్తు నియమాలు..
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
'రామాయణ'కు మహేష్ బాబు తనయుడి రివ్యూ.. రేటింగ్ ఎంతిచ్చాడో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?
ముత్యం ధరిస్తే ఈ ప్రయోజనాలు కలుగుతాయట.. ఏ వేలికి ధరించాలో తెలుసా?