AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కూల్ డ్రింక్‌లో పురుగుమందు కలుపుకొని తాగాడు.. అది పనిచేయలేదని..

బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సతమతమైన ఓ వ్యక్తి తన ఇద్దరు కుమారులకు కూల్‌డ్రింక్‌లో పురుగుమందు కలిపి ఇచ్చాడు. అనంతరం తాను కూడా ఆ ద్రావణం తాగాడు. ఈ ఘటనలో తండ్రి, పెద్ద కుమారుడు మృతి చెందగా, చిన్న కుమారుడు గుంటూరు జీజీహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

కూల్ డ్రింక్‌లో పురుగుమందు కలుపుకొని తాగాడు.. అది పనిచేయలేదని..
Family Tragedy
T Nagaraju
| Edited By: |

Updated on: Nov 12, 2026 | 11:19 AM

Share

అనారోగ్య సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, ఒత్తిడి తట్టులేకపోవడంతో తను చనిపోవడంతో పాటు ఇద్దరూ పిల్లలకు కూల్ డ్రింక్ లో పురుగుమందు కలిపి ఇచ్చి…తనతో పాటు పెద్ద కొడుకును తీసుకెళ్లిపోయాడు. చిన్న కొడుకు మాత్రం జిజిహెచ్‌లో చికిత్స పొందుతున్నాడు. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గంలోని కొల్లూరు ఇందిరా కాలనీలో నివాసం ఉండే రామక్రిష్ణ పంచాయితీలో స్వీపర్‌గా పనిచేస్తున్నాడు. రామక్రిష్ణకి పదిహేనేళ్ల క్రితం వివాహం అయింది. వీరికి ఇద్దరూ పిల్లలున్నారు. భార్య తిరుపతమ్మ కూలీ పనులకు వెలుతుంది. కొద్దీ కాలంగా రామక్రిష్ణను అనారోగ్య సమస్యలు వెంటాడుతున్నాయి. దీంతో పనికి వెళ్లలేకపోతున్నాడు. ఇదే సమయంలో ఆర్ధిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి. దీంతో చనిపోవాలని నిర్ణయించుకున్నాడు.

ఈ నెల ఆరో తేదిన తిరుపతమ్మ బయటకు వెళ్లిన తర్వాత ఇద్దరూ పిల్లలతో కలిసి ఉన్న రామక్రిష్ణ.. బయటకు వెళ్లి కూల్ డ్రింక్ కొని తీసుకొచ్చాడు. అందులో పురుగుమందు కలిపి తాను తాగి పిల్లలిద్దరికి తాగించాడు. పనికి వెళ్లి తిరిగి వచ్చిన తిరుపతమ్మకు పిల్లలు వినయ్ కుమార్, జ్నానేంద్ర వాంతులు చేసుకుంటూ కనిపించారు. అనుమానం వచ్చిన తిరుపతమ్మ ఏం జరిగిందని అడిగింది. నాన్న కూల్ డ్రింక్ లో ఏదో కలిపి ఇచ్చినట్లు పిల్లలు తిరుపతమ్మకు చెప్పారు. వెంటనే ఆమె పిల్లను తీసుకొని ఆసుపత్రికి వచ్చింది. తెనాలి ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం పిల్లలిద్దరిని గుంటూరు జిజిహెచ్ కు తరలించారు. పిల్లలు, భార్య వెళ్లిపోయిన తర్వాత తనకు ఏమీ కాకపోవడంతో రామక్రిష్ణ ఇంట్లోనే ఉరివేసుకుని చనిపోయాడు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వినయ్ కుమార్ ఈ నెల 9న కన్నుమూశాడు. చిన్న కొడుకు జ్నానేంద్ర చావుబ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నాడు.

తండ్రి అనాలోచిత నిర్ణయంతో తను చనిపోవడమే కాకుండా కొడుకుల పాలిట కూడా యముడుగా మారడంతో తిరుపతమ్మ కన్నీరుమున్నీరుగా విలపిస్తుంది. ఈ ఘటన కాలనీలోని వాసులందరినీ కంటతడి పెట్టించింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

అనారోగ్యం, ఆర్థిక ఇబ్బందులు ఎదురైనప్పుడు ఆత్మహత్య పరిష్కారం కాదు.. ఇలాంటి ఆలోచనలు వస్తే మానసిక వైద్యులను కలిసి.. చికిత్స పొందాలి. అంతేకాకుండా..  టెలీ-మానస్ మానసిక ఆరోగ్య హెల్ప్‌లైన్: 14416,  1800-89-14416 కు కాల్ చేయండి..

Follow Us