AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రాప్తాడు నిందితుడు హేమంత్‌కు మరో ఆరోగ్య సమస్య.. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం!

రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడి చేసిన నిందితుడు హేమంత్‌ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో వైద్యులు సీటీ స్కాన్‌ చేయగా పల్మనరీ ఎంబాలిజం ఉన్నట్లు నిర్ధారణ అయింది. ప్రస్తుతం అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు..

రాప్తాడు నిందితుడు హేమంత్‌కు మరో ఆరోగ్య సమస్య.. ఊపిరితిత్తుల రక్తనాళాల్లో గడ్డకట్టిన రక్తం!
Rapthadu School Attack Accused Hemant
Srilakshmi C
|

Updated on: Nov 12, 2026 | 7:49 AM

Share

అనంతపురం, నవంబర్ 12: రాప్తాడు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థినులపై ఎలక్ట్రిక్‌ రంపంతో దాడికి పాల్పడిన నిందితుడు హేమంత్‌ మరోసారి తీవ్ర అనారోగ్యానికి గురయ్యాడు. అతడికి పల్మనరీ ఎంబాలిజం (ఊపిరితిత్తుల రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టే పరిస్థితి) ఉన్నట్లు వైద్యులు నిర్ధారించారు. పోలీసుల కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన హేమంత్‌ కుడికాలికి రక్తప్రసరణ నిలిచిపోవడంతో ఆ కాలు కుళ్లిపోయింది. దీంతో వైద్యులు ఇటీవల శస్త్రచికిత్స చేసి కుడికాలును తొలగించారు. అప్పటి నుంచి అనంతపురం సర్వజన ఆసుపత్రిలో ప్రత్యేక వైద్యబృందం పర్యవేక్షణలో అతడికి చికిత్స అందిస్తున్నారు.

రెండు రోజుల క్రితం హేమంత్‌ శ్వాస తీసుకోవడంలో తీవ్ర ఇబ్బందిని ఎదుర్కొన్నాడు. ఈ క్రమంలో మంచంపై నుంచి కిందపడిపోయాడు. వెంటనే అప్రమత్తమైన వైద్యులు సీటీ స్కాన్‌ నిర్వహించగా పల్మనరీ ఎంబాలిజం సమస్య బయటపడింది. ప్రస్తుతం ఈ సమస్యకు సంబంధించి ప్రత్యేక చికిత్స అందిస్తున్నారు. శస్త్రచికిత్సల అనంతరం తలెత్తే తీవ్రమైన సమస్యల్లో పల్మనరీ ఎంబాలిజం ఒకటని వైద్య నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని రక్తనాళాల్లో రక్తం గడ్డకట్టడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది.

ఇవి కూడా చదవండి

అలా ఏర్పడిన రక్తపు గడ్డలు ఊపిరితిత్తులకు రక్తాన్ని సరఫరా చేసే రక్తనాళాల్లో చిక్కుకుపోతే రక్తప్రసరణకు తీవ్ర అంతరాయం కలుగుతుంది. దీంతో గుండెపై ఒత్తిడి పెరిగి ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉంటుందని వైద్యులు వెల్లడించారు. ప్రస్తుతం హేమంత్‌కు అనంతపురం సర్వజన ఆసుపత్రిలో వైద్యుల ప్రత్యేక పర్యవేక్షణలో చికిత్స కొనసాగుతోంది.

Follow Us