AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

25 కేజీల బియ్యం బస్తాలకు బైబై! 26 కేజీల ప్యాకెట్ల వెనుక దాగి ఉన్న పెద్ద మతలబు ఇదే!

కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో గతంలో ఎక్కువగా కనిపించిన 25 కిలోల బియ్యం బస్తాల స్థానంలో ఇప్పుడు 26 కిలోల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. బస్తా బరువును ఒక కిలో పెంచడం వెనుక వ్యాపారుల వ్యూహం ఉందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం వెనుక పెద్ద మతలబు దాగి ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు.

25 కేజీల బియ్యం బస్తాలకు బైబై! 26 కేజీల ప్యాకెట్ల వెనుక దాగి ఉన్న పెద్ద మతలబు ఇదే!
Rice BagsImage Credit source: AI Image
Balaraju Goud
|

Updated on: Nov 12, 2026 | 10:21 AM

Share

కిరాణా దుకాణాలు, సూపర్ మార్కెట్లలో గతంలో ఎక్కువగా కనిపించిన 25 కిలోల బియ్యం బస్తాల స్థానంలో ఇప్పుడు 26 కిలోల ప్యాకెట్లు దర్శనమిస్తున్నాయి. బస్తా బరువును ఒక కిలో పెంచడం వెనుక వ్యాపారుల వ్యూహం ఉందా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. దీనికి ప్రధాన కారణం వెనుక పెద్ద మతలబు దాగి ఉందంటున్నారు ఆర్థిక నిపుణులు.

జీఎస్టీ నుంచి తప్పించుకునే మార్గం!

2022 జులై నుంచి ముందుగా ప్యాక్ చేసి, లేబుల్ వేసిన బియ్యం, గోధుమలు వంటి ఆహార ధాన్యాలపై కేంద్ర ప్రభుత్వం 5 శాతం జీఎస్టీ విధించింది. అయితే 25 కిలోలు లేదా అంతకంటే తక్కువ బరువున్న ప్యాకేజీలకే ఈ పన్ను వర్తించేలా నిబంధనలు ఉన్నాయి. దీంతో వ్యాపారులు ఈ పరిమితిని దాటితే పన్ను భారం తగ్గుతుందని భావిస్తున్నట్లు సమాచారం.

లీగల్ మెట్రాలజీ నిబంధనలు ఎలా?

2011 లీగల్ మెట్రాలజీ (ప్యాకేజ్డ్ కమోడిటీస్) నిబంధనల్లో 25 కిలోలకు మించిన కొన్ని ప్యాకేజీలకు రిటైల్ ప్యాకేజింగ్ నిబంధనల నుంచి మినహాయింపులు ఉన్నాయి. ఈ వెసులుబాటును ఉపయోగించుకుని కొందరు మిల్లర్లు 25 కిలోల బస్తాల స్థానంలో 26 కిలోల ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ విధానం తమిళనాడులోని తిరుప్పూర్ ప్రాంతం నుంచి మొదలై ఇతర ప్రాంతాలకు విస్తరించింది.

వినియోగదారులకు నష్టమా?

26 కిలోల బస్తా కొనుగోలు చేయడం వల్ల వినియోగదారులకు నేరుగా నష్టం జరుగుతుందా? అనేది ధరపై ఆధారపడి ఉంటుంది. ఉదాహరణకు, 25 కిలోల బియ్యం బస్తా ధర రూ.1,250 అయితే, కిలోకు రూ.50 అవుతుంది. అదే ధర ప్రకారం 26 కిలోల బస్తా రూ.1,300కు విక్రయిస్తే కిలో ధరలో మార్పు ఉండదు. అయితే బస్తా మొత్తం ధరతోపాటు కిలో ధరను పోల్చి చూసిన తర్వాతే కొనుగోలు చేయడం మంచిది. మొత్తంగా, 26 కిలోల ప్యాకింగ్ వెనుక జీఎస్టీ, ప్యాకేజింగ్ నిబంధనల ప్రభావం కనిపిస్తోంది. అయితే 25 కిలోలు దాటిన ప్రతి ప్యాకేజీకి ఆటోమేటిక్‌గా పన్ను మినహాయింపు వస్తుందని భావించకూడదు. ప్యాకేజీ స్వభావం, విక్రయ విధానం, వర్తించే జీఎస్టీ నిబంధనల ఆధారంగా పన్ను బాధ్యత నిర్ణయమవుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us
25 కేజీల బియ్యం బస్తాలు మాయమవుతున్నాయా?
25 కేజీల బియ్యం బస్తాలు మాయమవుతున్నాయా?
స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు షాక్‌.. రక్తపు మడుగులో తల్లి!
స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు షాక్‌.. రక్తపు మడుగులో తల్లి!
పుష్ప సినిమాను మరిపించేలా గుడుంబా దందా.! వాగు నీళ్లలోపల గుడుంబా డ
పుష్ప సినిమాను మరిపించేలా గుడుంబా దందా.! వాగు నీళ్లలోపల గుడుంబా డ
టాస్ ఓడిన భారత్.. అందరి చూపు సెంచరీ వీరుడిపైనే..!
టాస్ ఓడిన భారత్.. అందరి చూపు సెంచరీ వీరుడిపైనే..!
పాలు కొనలేకపోతున్నారా? పాలు తాగకుండానే కాల్షియం పొందాలంటే..
పాలు కొనలేకపోతున్నారా? పాలు తాగకుండానే కాల్షియం పొందాలంటే..
టీమిండియాకు నో రెస్ట్.. వరుసగా 4 సిరీస్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
టీమిండియాకు నో రెస్ట్.. వరుసగా 4 సిరీస్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్స్ చేస్తే ఇక అంతే..
విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్స్ చేస్తే ఇక అంతే..
క్రెడిట్ కార్డు అప్పులు, EMIలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?
క్రెడిట్ కార్డు అప్పులు, EMIలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?
తుపాను దెబ్బకు కాలువల్లో చేపల సందడి.. ఏకంగా 23 కేజీల చేప పట్టిన డ
తుపాను దెబ్బకు కాలువల్లో చేపల సందడి.. ఏకంగా 23 కేజీల చేప పట్టిన డ
40 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. చిరంజీవికి భార్యగా, చెల్లిగా..
40 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. చిరంజీవికి భార్యగా, చెల్లిగా..