మొబైల్‌ యూజర్లకు మరో సరికొత్త ప్లాన్‌.. జియోలో రూ.10వేల ప్లాన్‌

November 9, 2026

Subhash

రిలయన్స్ జియో వినియోగదారుల కోసం సరికొత్త దీర్ఘకాలిక ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది. 

ప్రీపెయిడ్

రూ.10,000 ధరతో ఏకంగా మూడేళ్ల వ్యాలిడిటీని అందించే ఈ ప్లాన్‌లో అపరిమిత వాయిస్ కాల్స్, రోజుకు 2.5GB హైస్పీడ్ డేటా పొందవచ్చు.

మూడేళ్లు

అలాగే ఈ రీఛార్జ్‌లో అపరిమిత 5G డేటాతో పాటు పలు డిజిటల్ సేవలను పొందవచ్చు. తరచూ రీఛార్జ్ చేసుకునే ఇబ్బంది లేకుండా ఈ ప్లాన్‌ ఉంటుంది.

రీఛార్జ్‌

ఈ ప్లాన్ ఒకేసారి రూ.10,000 చెల్లిస్తే మూడేళ్లపాటు రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం ఉండదు. రోజువారీ ఖర్చును లెక్కిస్తే సుమారు రూ.9.13 మాత్రమే.

ప్లాన్

మొబైల్ కనెక్టివిటీతో పాటు జియో ఈ ప్లాన్‌లో అదనపు డిజిటల్ ప్రయోజనాలను కూడా అందిస్తోంది.

మరిన్ని ప్రయోజనాలు

JioHotstar Mobile + Hollywood: లైవ్ స్పోర్ట్స్, ఒరిజినల్ షోలు, ప్రీమియం కార్యక్రమాలు, హాలీవుడ్ సినిమాలను వీక్షించే అవకాశం ఉంటుంది.

JioHotstar

డిజైన్ల కోసం అవసరమైన టెంప్లేట్లు, క్రియేటివ్ టూల్స్, ఇతర ప్రొడక్టివిటీ ఫీచర్లతో కూడిన Canva Pro Lite సబ్‌స్క్రిప్షన్ 12 నెలలపాటు లభిస్తుంది.

Canva

JioAICloud: ఫొటోలు, వీడియోలు, డాక్యుమెంట్లు, ఇతర డిజిటల్ ఫైళ్లను భద్రపరుచుకోవడానికి 50GB క్లౌడ్ స్టోరేజ్ ఉచితంగా అందిస్తారు.

JioAICloud