November 10, 2026
Subhash
ఆగస్టులో నిలిపివేసిన ఈ ప్లాన్‌ను ఎయిర్‌టెల్ తిరిగి ప్రారంభించింది. పాత ధరతోనే రూ.299కు రీఛార్జ్ చేసుకునే అవకాశం కల్పించింది.
ఈ ప్లాన్‌లో 28 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. తక్కువ ధరలో నెల రోజుల పాటు మొబైల్ సేవలు పొందాలనుకునే వారికి ఇది ఉపయోగకరంగా ఉంటుంది.
రూ.299 రీఛార్జ్‌తో ప్రతిరోజూ 1GB హైస్పీడ్ డేటా లభిస్తుంది. రోజువారీ ఇంటర్నెట్ అవసరాలకు ఈ డేటాను ఉపయోగించుకోవచ్చు.
ఈ ప్లాన్‌లో అన్ని నెట్‌వర్క్‌లకు అన్‌లిమిటెడ్ వాయిస్ కాలింగ్ సదుపాయం ఉంది. అలాగే ప్రతిరోజూ 100 SMSలు పంపుకోవచ్చు.
రూ.299 ప్లాన్‌తో పాటు 12 నెలల Adobe Express Premium సబ్‌స్క్రిప్షన్ ప్రయోజనం కూడా అందిస్తోంది. దీని విలువ సుమారు రూ.4,000గా పేర్కొంది.
ఈ రీఛార్జ్‌లో Airtel Safe సేవ ద్వారా స్పామ్ కాల్స్‌పై రియల్‌టైమ్ అలర్ట్స్ పొందవచ్చు. అదనంగా ఉచిత Hello Tunes సదుపాయం కూడా ఉంది.
ఎయిర్‌టెల్ రూ.299 ప్లాన్‌ను కంపెనీ యాప్, వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచింది. రీఛార్జ్ చేసే ముందు మీ నంబర్‌కు ఈ ప్లాన్ వర్తిస్తుందో లేదో ఒకసారి పరిశీలించండి.
ఈ పాపులర్ ప్లాన్‌ను నిలిపివేయడంతోచాలా మంది ఇతర నెట్‌వర్క్‌కు మారిపోయారు. దీనిని దృష్టిలో ఉంచుకుని ఈ ప్లాన్‌ను తిరిగి తీసుకువచ్చింది.