AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Watch: స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు షాక్‌.. రక్తపు మడుగులో తల్లి! ఏం జరిగిందంటే..?

హైదరాబాద్‌లోని మీర్‌పేట పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో దారుణ హత్య వెలుగుచూసింది. జిల్లెలగూడ దత్తునగర్‌లోని శ్రీలక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లో అనిత (35) అనే మహిళ రక్తపు మడుగులో విగతజీవిగా కనిపించింది. స్కూల్‌ నుంచి ఇంటికి వచ్చిన పిల్లలు తల్లిని ఆ స్థితిలో చూసి షాక్‌కు గురయ్యారు. ఆసుపత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు హత్యకు గల కారణాలు, నిందితుల వివరాలపై దర్యాప్తు చేస్తున్నారు..

Watch: స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు షాక్‌.. రక్తపు మడుగులో తల్లి! ఏం జరిగిందంటే..?
Woman Found Dead In Pool Of Blood
Lakshmi Praneetha Perugu
| Edited By: |

Updated on: Nov 12, 2026 | 10:13 AM

Share

హైదరాబాద్‌, నవంబర్ 12: హైదరాబాద్‌లో మహిళ దారుణ హత్య కలకలం రేపింది. మీర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలోని జిల్లెలగూడ దత్తునగర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. శ్రీలక్ష్మీ రెసిడెన్సీ అపార్ట్‌మెంట్‌లోని మూడో అంతస్తులో అనిత (35) అనే మహిళ రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉంది. తమిళనాడుకు చెందిన అరుణ్ కుమార్ కుటుంబం గత నాలుగేళ్లుగా ఇదే అపార్ట్‌మెంట్‌లో నివాసం ఉంటోంది. కాగా, స్కూల్‌కు వెళ్లిన పిల్లలు తిరిగి ఇంటికి వచ్చేసరికి తల్లి రక్తపు మడుగులో పడి ఉండటాన్ని చూసి షాక్‌కు గురయ్యారు. వెంటనే తండ్రి అరుణ్ కుమార్‌కు ఫోన్ చేసి సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, స్థానికుల సహాయంతో అనితను ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.

సమాచారం అందుకున్న మీర్‌పేట పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనితను ఎవరు హత్య చేశారు? హత్యకు గల కారణాలేంటి? కుటుంబ కలహాలా.. మరేదైనా కారణమా? అనే కోణాల్లో పోలీసులు విచారణ జరుపుతున్నారు. క్లూస్ టీమ్ ఆధారాలు సేకరిస్తుండగా, పోస్టుమార్టం నివేదికతో పాటు పోలీసుల దర్యాప్తులో మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది.

ఇవి కూడా చదవండి
Follow Us
స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు షాక్‌.. రక్తపు మడుగులో తల్లి!
స్కూల్‌ నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు షాక్‌.. రక్తపు మడుగులో తల్లి!
పుష్ప సినిమాను మరిపించేలా గుడుంబా దందా.! వాగు నీళ్లలోపల గుడుంబా డ
పుష్ప సినిమాను మరిపించేలా గుడుంబా దందా.! వాగు నీళ్లలోపల గుడుంబా డ
టాస్ ఓడిన భారత్.. అందరి చూపు సెంచరీ వీరుడిపైనే..!
టాస్ ఓడిన భారత్.. అందరి చూపు సెంచరీ వీరుడిపైనే..!
పాలు కొనలేకపోతున్నారా? పాలు తాగకుండానే కాల్షియం పొందాలంటే..
పాలు కొనలేకపోతున్నారా? పాలు తాగకుండానే కాల్షియం పొందాలంటే..
టీమిండియాకు నో రెస్ట్.. వరుసగా 4 సిరీస్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
టీమిండియాకు నో రెస్ట్.. వరుసగా 4 సిరీస్‌లు.. ఎప్పుడు, ఎక్కడంటే?
విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్స్ చేస్తే ఇక అంతే..
విద్యాసంస్థల్లో సినిమా ప్రమోషన్స్ చేస్తే ఇక అంతే..
క్రెడిట్ కార్డు అప్పులు, EMIలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?
క్రెడిట్ కార్డు అప్పులు, EMIలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారా?
తుపాను దెబ్బకు కాలువల్లో చేపల సందడి.. ఏకంగా 23 కేజీల చేప పట్టిన డ
తుపాను దెబ్బకు కాలువల్లో చేపల సందడి.. ఏకంగా 23 కేజీల చేప పట్టిన డ
40 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. చిరంజీవికి భార్యగా, చెల్లిగా..
40 ఏళ్ల వయసులోనూ తగ్గని క్రేజ్.. చిరంజీవికి భార్యగా, చెల్లిగా..
గుండె ఆగిన యువకుడికి ప్రాణం పోసిన కానిస్టేబుళ్లు!
గుండె ఆగిన యువకుడికి ప్రాణం పోసిన కానిస్టేబుళ్లు!