అడవిలో నీళ్ల అడుగున రహస్య స్థావరం.. పుష్ప సినిమాను మరిపించే స్కెచ్.. డ్రమ్ములు చూసి షాక్!
తెలంగాణలోని ములుగు జిల్లాలో గుడుంబా తయారీదారుల వింత ఎత్తుగడ వెలుగులోకి వచ్చింది. పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు అడవిలోని వాగు నీటి అడుగున గుడుంబా తయారీకి ఉపయోగించే డ్రమ్ములను దాచిపెట్టారు. వెంకటాపురం పోలీసులు ముత్తారం అటవీ ప్రాంతంలో దాడులు చేసి 106 డ్రమ్ములను వెలికితీసి ధ్వంసం చేశారు.

సినిమాల్లోనే ఇలాంటి దృశ్యాలు చూస్తుంటాం.. పుష్ప సీన్ ను మరిపించే రియల్ సీన్ ఇది.. కారడవులో గుడుంబా తయారీదారులు వేసిన ఎత్తుగడలు చూసి పోలీసులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ములుగు జిల్లాలో అబ్కారీశాఖ నిద్రవస్తలో మూలుగుతుంటే పోలీసులు గుడుంబా తయారీ స్థావరాలపై ఉక్కుపాదం మోపుతున్నారు. పోలీసుల కళ్లు గప్పి ఏకంగా అడవిలోని వాగు నీళ్లలోనే గుడుంబా తయారీకి ఉపయోగించే బెల్లం పానకం, డ్రమ్ములను దాచిపెట్టడం సంచలనంగా మారింది.. వాగు నీళ్లలో దాచిన డ్రమ్ములను వెలికితీసిన పోలీసులు వాటిని దగ్దం చేశారు.. గొయ్యి తవ్వి భద్రపరిచిన సారాయిని సీజ్ చేశారు
ఒకప్పటి అన్నల స్థావరాలు ఇప్పుడు అక్రమార్కులకు అడ్డగా మారాయి. ములుగు జిల్లా ఏజెన్సీలో గుట్టుచప్పుడు కాకుండా గుడుంబా దందా జరుగుతుంది. ఏకంగా వాగులకు చెక్ డ్యామ్ ఏర్పాటు చేసుకొని ఆ నీరంతా గుబుంబా తయారీకి ఉపయోగిస్తున్నారు.. వాగులో నీటి అడుగుబాగనా సారా తయారీ ముడిసరుకు డ్రమ్ముల్లో భద్రపరిచారు. ములుగు జిల్లా వెంకటాపురం మండలం ముత్తారం అటవీ ప్రాంతంలో బారీఎత్తున జరుగుతున్న గుడుంబా తయారీ స్థావరాలపై వెంకటాపురం పోలీసుల మెరుపు దాడి చేశారు.. వాగు నీళ్లలో అడుగుభాగం ఈ రహస్యంగా దాచిన డ్రమ్ములను పోలీసులు వెలికితీశారు. సినిమా సీన్ ను మరిపించే ఈ దందాను చూసి పోలీసులు షాక్ అయ్యారు.
వాగులో బండరాళ్ల మధ్యన చెక్ డ్యామ్ ఏర్పాటు చేశారు. నీళ్లను స్టోరేజ్ చేసి ఆ నీళ్ళలో బయటకు కనిపించకుండా అడుగుభాగాన డ్రమ్ములను దాచారు.. ఆ డ్రమ్ములలో సారా తయారికి ఉపయోగించే ముడిసరుకు భద్రపరిచారు. ఈ దాడుల్లో మొత్తం 106 గుడుంబా డ్రమ్ములను వెలికితీశారు. అనంతరం వాటిని దగ్దం చేశారు. గుడుంబా తయారీదారులు ఎన్ని కొత్త పద్ధతులు అనుసరించినా వదిలిపెట్టేది లేదని వెంకటాపురం సిఐ ముత్యం రమేష్, ఎస్సైలు కొప్పుల తిరుపతిరావు, తిరుపతిరెడ్డి హెచ్చరించారు.
గత నాలుగు రోజులుగా వెంకటాపురం పోలీసులు గుడుంబా తయారీ స్థావరాలపై మెరుపు దాడులు చేస్తున్నారు.. ఈ క్రమంలోనే ముత్తారం అడవుల్లో గుడుంబా తయారీని గుర్తించి.. షాకయ్యారు. గుట్టుచప్పుడు కాకుండా తయారీ సాగించడమే కాకుండా, పోలీసుల తనిఖీల నుంచి తప్పించుకునేందుకు వాగు నీళ్లలో డ్రమ్ములను దాచిపెట్టడం చూసి పోలీసులు, స్థానికులు సైతం ఆశ్చర్యపోయారు.
వీడియో చూడండి..
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
