AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తెలంగాణ పోలీస్ శాఖలో టెక్నాలజీ విప్లవం.. దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట..!

తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

తెలంగాణ పోలీస్ శాఖలో టెక్నాలజీ విప్లవం..  దేశంలోనే తొలి ఏఐ పోలీస్ స్టేషన్‌గా పంజాగుట్ట..!
Panjagutta Police Station
Balaraju Goud
|

Updated on: Nov 12, 2026 | 8:01 AM

Share

హైదరాబాద్: తెలంగాణ పోలీస్ శాఖ సరికొత్త సాంకేతిక విప్లవానికి శ్రీకారం చుట్టబోతోంది. దేశంలోనే తొలిసారిగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) ఆధారిత పోలీస్ స్టేషన్‌ను హైదరాబాద్‌లోని పంజాగుట్టలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తోంది. డీజీపీ సీవీ ఆనంద్ ఆదేశాల మేరకు ఈ ప్రాజెక్టును రూపొందిస్తున్నారు. డిసెంబర్ మొదటి వారంలో ప్రయోగాత్మకంగా (పైలట్ ప్రాజెక్ట్) ప్రారంభించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.

పంజాగుట్ట పీఎస్‌లో సీపీ సజ్జనర్ తనిఖీలు

ఈ ప్రాజెక్టు ఏర్పాట్లను పరిశీలించేందుకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనర్ పంజాగుట్ట పోలీస్ స్టేషన్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఏఐ సాంకేతికతతో అందుబాటులోకి రానున్న సేవలను పరిశీలించడంతో పాటు, ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు.

ఫిర్యాదు నుంచి ఛార్జ్‌షీట్ వరకు ఏఐ సేవలు

ఈ కొత్త విధానంలో పోలీస్ స్టేషన్‌లోని దాదాపు అన్ని సేవలకు ఏఐ సాంకేతికతను అనుసంధానించనున్నారు. ఫిర్యాదుల స్వీకరణ నుంచి ఎఫ్‌ఐఆర్ నమోదు, కేసు డైరీ, దర్యాప్తు నివేదికలు, ఛార్జ్‌షీట్ తయారీ వరకు ఏఐ సేవలను వినియోగించనున్నారు. దాదాపు 10 భాషల్లో ఫిర్యాదులు స్వీకరించేలా ప్రత్యేకంగా సేతు యాప్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. ఫిర్యాదులను ఏఐ ద్వారా స్థానిక భాషలోకి అనువదించి, క్షణాల్లో సంబంధిత అధికారులకు పంపించే సదుపాయం కల్పించనున్నారు.

పోలీసులకు ప్రత్యేక శిక్షణ

కొత్త సాంకేతిక విధానాలపై పోలీస్ సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నారు. పంజాగుట్టలో ప్రారంభించే పైలట్ ప్రాజెక్టు పనితీరు, ఫలితాలను అంచనా వేసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఇతర పోలీస్ స్టేషన్లలోనూ ఈ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. ఈ ప్రయోగం విజయవంతమైతే పోలీస్ సేవల్లో వేగం, పారదర్శకత, ప్రజలకు అందుబాటు మరింత పెరిగే అవకాశం ఉంది.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us