ప్రపంచంలోనే అత్యంత అరుదైన, వింతైన పక్షులు ఇవే!

samatha

11 November 2026

Pic credit - Pinterest

ప్రపంచంలోనే అత్యంత అరుదైన, వింతైన కొన్ని రకాల పక్షులు ఉన్నాయంట. కాగా, అందులో మనం ఎనిమిది రకాల పక్షుల గురించి వివరంగా తెలుసుకుందాం.

పక్షులు

 కాకాపో పక్షి. దీనిని గుడ్లగూబ చిలుక అని కూడా అంటారు. దీని ముఖం గుడ్లగూబను పోలి ఉంటుంది, కానీ రంగు చిలుకలా ఉండడం వల్ల ఈ పేరు వచ్చింది.

కాకాపో పక్షి

సూపర్బ్ బర్డ్ ఆఫ్ పారడైస్. ఇది నలుపు రంగుతో పాటు మెడ కింద ఆకర్షణీయమైన రంగులు కలిగి, ఆడ పక్షులను ఆకర్షించడానికి అద్భుతంగా నృత్యం చేస్తుంది.

సూపర్బ్ బర్డ్ ఆఫ్ పారడైస్

గ్రేటర్ సేజ్ గ్రౌస్ . ఉత్తర అమెరికాలో కనిపించే అతి పెద్ద అలాగే భిన్నమైన ఆకారాలు కలిగిన అరుదైన పక్షి జాతి.

గ్రేటర్ సేజ్ గ్రౌస్ 

సూపర్బ్ లయర్ బర్డ్ . ఆస్ట్రేలియాకు చెందిన ఈ పక్షి పొడవైన తోకను కలిగి ఉండటమే కాకుండా అద్భుతంగా పాటలు పాడుతుంది.

సూపర్బ్ లయర్ బర్డ్

జూనిన్ గ్రిబ్ . పెరూ దేశంలోని జూనిన్ సరస్సులో మాత్రమే కనిపించే పక్షి. ఇది నలుపు, తెలుపు రంగులతో పాటు విచిత్రమైన ఎరుపు కళ్లున్న పక్షి.

జూనిన్ గ్రిబ్

విక్టోరియా క్రౌండ్ పీజియన్. తలపై క్వీన్ విక్టోరియా కిరీటం లాంటి అమరికతో, లేత నీలం, గోధుమ రంగులలో పావురాల రాజులా ఉంటుంది.

విక్టోరియా క్రౌండ్ పీజియన్

ఆరెంజ్ బెల్లీడ్ ప్యారెట్ . పొట్ట భాగంలో నారింజ రంగును కలిగి  చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది టస్మానియా, ఆస్ట్రేలియా ప్రాంతాలలో అంతరించిపోతున్న పక్షిలో ఒకటి

ఆరెంజ్ బెల్లీడ్ ప్యారెట్