AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పాపం.. గోదావరిలో మాటువేసిన మృత్యువును గ్రహించలేకపోయిన గోమాత.. చివరికి ఇలా!

గోదావరి నదిలో మొసలి సంచారం పశువుల కాపరులను, గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దాహం తీర్చుకునేందుకు నదిలోకి వెళ్లిన ఓ ఆవుపై నీటిలో మాటువేసి ఉన్న మొసలి ఒక్కసారిగా దాడి చేసింది. ఆవు ప్రాణభయంతో పెనుగులాడుతూ మొసలి బారి నుంచి తప్పించుకున్నప్పటికీ.. తీవ్ర గాయాలతో చివరకు మృత్యువాత పడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

పాపం.. గోదావరిలో మాటువేసిన మృత్యువును గ్రహించలేకపోయిన గోమాత.. చివరికి ఇలా!
Cow In Godavari River
Naresh Gollana
| Edited By: |

Updated on: Nov 12, 2026 | 10:51 AM

Share

గోదావరి నదిలో మొసలి సంచారం పశువుల కాపరులను, గ్రామస్థులను ఆందోళనకు గురిచేస్తోంది. దాహం తీర్చుకునేందుకు నదిలోకి వెళ్లిన ఓ ఆవుపై నీటిలో మాటువేసి ఉన్న మొసలి ఒక్కసారిగా దాడి చేసింది. ఆవు ప్రాణభయంతో పెనుగులాడుతూ మొసలి బారి నుంచి తప్పించుకున్నప్పటికీ.. తీవ్ర గాయాలతో చివరకు మృత్యువాత పడింది. ఈ ఘటన నిర్మల్ జిల్లా కడెం మండలం సారంగాపూర్ గ్రామ శివారులో చోటుచేసుకుంది.

సారంగాపూర్ గ్రామానికి చెందిన సార్ల రాజేందర్ తన ఆవుల మందను బుధవారం (నవంబర్ 11) గ్రామ శివారులోని గోదావరి పరివాహక ప్రాంతంలో మేతకు తీసుకెళ్లాడు. రోజువారీగా మేత మేస్తున్న ఆవుల మందలోని ఓ ఆవుకు దాహం వేయడంతో సమీపంలోనే ఉన్న గోదావరి నది వద్దకు వెళ్లింది. నీళ్లు తాగేందుకు నదిలోకి దిగిన ఆవుకు ఊహించని ప్రమాదం ఎదురైంది. అప్పటికే నీటిలో మాటువేసి ఉన్న మొసలి ఒక్కసారిగా ఆవుపై దాడి చేసింది. ఆవు మూతిని నోటితో గట్టిగా పట్టుకుని నీటిలోకి లాగేందుకు ప్రయత్నించింది.

అనుకోని ఈ దాడితో ఆవు ప్రాణభయంతో గట్టిగా పెనుగులాడింది. మొసలి పట్టు నుంచి బయటపడేందుకు తీవ్రంగా ప్రయత్నించింది. చివరకు ఎలాగోలా మొసలి బారి నుంచి తప్పించుకుని ఒడ్డుకు చేరుకుంది. అయితే అప్పటికే మొసలి దాడిలో ఆవు మూతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయాన్ని వెంటనే గుర్తించని పశువుల కాపరి.. కొద్దిసేపటి తర్వాత ఆవు పరిస్థితిని గమనించి యజమాని రాజేందర్‌కు సమాచారం అందించాడు. సాయంత్రం ఇంటికి చేరుకున్న ఆవుకు యజమాని చికిత్స చేయించినప్పటికీ అప్పటికే పరిస్థితి విషమించింది. మొసలి దాడిలో తీవ్రంగా గాయపడిన ఆవు అపస్మారక స్థితిలోకి వెళ్లి చివరకు మరణించింది. దీంతో యజమాని తీవ్ర ఆవేదనకు గురయ్యాడు.

గోదావరి పరివాహక ప్రాంతాల్లో మొసళ్ల సంచారం ఉందన్న విషయం మరోసారి ఈ ఘటనతో చర్చనీయాంశంగా మారింది. నిత్యం పశువులను మేతకు తీసుకెళ్లే కాపరులు, నది పరిసర ప్రాంతాల్లో నివసించే గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా పశువులను నీటి కోసం నదిలోకి వదిలే సమయంలో జాగ్రత్తలు తీసుకోవాలని స్థానికులు సూచిస్తున్నారు. సంబంధిత అధికారులు స్పందించి మొసళ్ల సంచారంపై ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు పశువుల రక్షణకు చర్యలు తీసుకోవాలని గ్రామస్థులు కోరుతున్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Follow Us