AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బాలికను వేధిస్తున్నాడనీ దాడి.. 16 ఏళ్ల బాలుడు మృతి!

తూర్పుగోదావరి జిల్లా కడియం పోలీస్ సర్కిల్ పరిధిలో విషాద ఘటన చోటుచేసుకుంది. బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణతో 16 ఏళ్ల బాలుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. తీవ్రంగా గాయపడిన బాలుడిని ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఘటనపై దర్యాప్తు చేస్తున్నారు..

బాలికను వేధిస్తున్నాడనీ దాడి.. 16 ఏళ్ల బాలుడు మృతి!
16 Year Old Boy Dies In East Godavari
Srilakshmi C
|

Updated on: Nov 12, 2026 | 7:22 AM

Share

తూర్పుగోదావరి, నవంబర్ 12: ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లాలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. బాలికను వేధిస్తున్నాడనే ఆరోపణతో 16 ఏళ్ల బాలుడిపై ముగ్గురు వ్యక్తులు దాడి చేయగా, తీవ్రంగా గాయపడిన అతడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన కడియం పోలీస్ సర్కిల్ పరిధిలో కలకలం రేపింది. వివరాల్లోకి వెళ్తే..

జిల్లాలోని వేమగిరి తోట గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలుడు స్థానిక వాటర్ ట్యాంక్ వద్ద నీటి సరఫరా విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో విధి నిర్వహణ కోసం వాటర్ ట్యాంక్ వద్దకు వెళ్లిన బాలుడిపై అదే గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు దాడి చేసినట్లు సమాచారం. తమ కుమార్తెను గత కొన్ని రోజులుగా బాలుడు వేధిస్తున్నాడనే ఆరోపణతో వారు ఈ దాడికి పాల్పడినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో బాలుడు తీవ్రంగా గాయపడి స్పృహ కోల్పోయాడు. దాడిలో స్పృహ కోల్పోయిన బాలుడిని వెంటనే కడియం ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడి వైద్యులు మెరుగైన చికిత్స కోసం రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించారు. దీంతో బాలుడిని రాజమహేంద్రవరం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు.

ఇవి కూడా చదవండి

బాలుడి మృతితో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు. మృతుడి తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కడియం పోలీసులు కేసు నమోదు చేశారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలను సేకరిస్తూ దర్యాప్తు చేపట్టారు. బాలుడిపై దాడికి గల కారణాలు, ఘటనలో పాల్గొన్న వ్యక్తుల పాత్రపై పోలీసులు విచారణ జరుపుతున్నారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది.

Follow Us