AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Idupu Kayitham: శ్రీలత, శ్రీనివాసుడి పెళ్లి చూపులు.. మరింత అందంగా ఇడుపు కాయితం టీజర్..

తెలుగు చిత్ర పరిశ్రమలో మోస్ట్ అవైటెడ్ మూవీ ఇడుపు కాయితం. వైవిధ్యమైన కథలతో ప్రేక్షకులను అలరిస్తున్న టాలెంటెడ్ హీరో ప్రియదర్శి, ఫోక్ డ్యాన్సర్ నాగదుర్గ జంటగా నటిస్తున్న ఈ సినిమా కోసం అడియన్స్ ఎంతో ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఇప్పటికే రిలీజ్ అయిన పాటలు యూట్యూబ్, సోషల్ మీడియాలో దూసుకుపోతున్నాయి. తాజాగా ఈ మూవీ టీజర్ రిలీజ్ చేసింది చిత్రయూనిట్.

Idupu Kayitham: శ్రీలత, శ్రీనివాసుడి పెళ్లి చూపులు.. మరింత అందంగా ఇడుపు కాయితం టీజర్..
Idupu Kayitham
Rajitha Chanti
|

Updated on: Nov 12, 2026 | 11:21 AM

Share

టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో ప్రియదర్శి ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా చిత్రం ‘ఇడుపు కాయితం’. సుకుమార్ రైటింగ్స్‌తో కలిసి నిర్మాత బన్నీ వాస్ వర్క్స్ పతాకంపై ఈ సినిమా అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సహాయ నటుడిగా కెరీర్ ప్రారంభించిన ప్రియదర్శి ఇప్పుడు హీరోగా అలరిస్తున్నారు. బలగం సినిమాతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన ఆయన ఇప్పుడు కంటెంట్ ప్రాధాన్యత ఉన్న చిత్రాలను ఎంచుకుంటున్నారు. ఇండస్ట్రీలో విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను అలరిస్తూ వస్తున్న ప్రియదర్శి నుంచి వస్తున్న ఈ చిత్రంపై టాలీవుడ్ వర్గాల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. వంశీరెడ్డి దొండపాటి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన అధికారిక టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. టీజర్ చూస్తుంటే సినిమా పూర్తిస్థాయి వినోదాత్మక, కుటుంబ కథాంశంతో రూపొందినట్లు స్పష్టమవుతోంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ కథలో ప్రియదర్శి నటన ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందని తెలుస్తోంది. టీజర్‌లోని సంభాషణలు, సన్నివేశాలు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంటున్నాయి.

ఎక్కువ మంది చదివినవి : Cinema OTT: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎన్‌కౌంటర్.. ఓటీటీలోకి వస్తున్న రియల్ స్టోరీ..

ఈ చిత్రంలో తెలంగాణ జానపద పాటల ద్వారా ఎంతో పేరు సంపాదించిన నాగదుర్గ ప్రధాన నాయికగా నటిస్తూ టాలీవుడ్‌ ఇండస్ట్రీలోకి అడుగుపెడుతున్నారు. ఆమె ఈ సినిమా ద్వారా నటిగా తన ప్రయాణాన్ని ప్రారంభిస్తుండటం విశేషం. ఇప్పటికే చిత్ర యూనిట్ విడుదల చేసిన ప్రచార చిత్రాలు, పాటలు సినిమాపై పాజిటివ్ బజ్‌ను క్రియేట్ చేశాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా మేకర్స్ విడుదల చేసిన పాటలు సోషల్ మీడియాలో ట్రెండ్ అయ్యాయి. దీపావళి పండుగ సందర్భంగా విడుదలైన ‘బారాత్ బీట్’ పాటలో నాగదుర్గ మాస్ స్టెప్పులతో అదరగొట్టింది. అలాగే సురేష్ బొబ్బిలి ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నారు.

ఎక్కువ మంది చదివినవి : Tollywood : తెలుగులో చేసిందే ఒక్క సినిమా.. 2 సార్లు విడాకులు.. ఇద్దరు పిల్లలున్న వ్యాపారవేత్తతో పెళ్లి..

అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకున్న ఈ సినిమాను డిసెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల చేయనున్నట్లు మేకర్స్ అధికారికంగా ప్రకటించారు. వైవిధ్యమైన సినిమాలను ఆదరించే ప్రేక్షకులు ‘ఇడుపు కాయితం’ సినిమాను కూడా పెద్దఎత్తున విజయవంతం చేస్తారనే నమ్మకంతో చిత్ర బృందం ఉంది. ఇక ఇప్పుడు టీజర్ ద్వారా సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయ్యింది.

ఎక్కువ మంది చదివినవి : Srikanth : ఇప్పుడు ఉన్న హీరోలలో ఆ ఇద్దరితో కలిసి నటించే ఛాన్స్ మాత్రం రాలేదు.. శ్రీకాంత్ కామెంట్స్..

ఇడుపు కాయితం సినిమా టీజర్..

ఎక్కువ మంది చదివినవి : Rajeev Kanakala: ఆ సినిమా హిట్ కాదేమో అని తారక్ చాలా ఎమోషనల్ అయ్యాడు.. కట్ చేస్తే.. బ్లాక్ బస్టర్ హిటైన మూవీ..

Follow Us