వెనక్కి తగ్గిన కేంద్రం.. విమానాల్లో ఉచిత సీట్ల ఎంపికపై బ్రేక్
విమానాల్లో 60 శాతం సీట్లను ఎలాంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలన్న తమ ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం తాత్కాలికంగా నిలిపివేసింది. ఏప్రిల్ 20 నుంచి అమల్లోకి రావాల్సిన ఈ నిబంధనపై విమానయాన సంస్థల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవడంతో ఈ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
విమానాల్లో సీట్ల ఎంపిక కోసం ప్రయాణికుల నుంచి భారీగా ఛార్జీలు వసూలు చేస్తున్నారన్న ఫిర్యాదుల నేపథ్యంలో, మార్చి 18న కేంద్రం కొత్త మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం.. ఏప్రిల్ 20 నుంచి విమానాల్లోని మొత్తం సీట్లలో 60 శాతాన్ని ఎటువంటి అదనపు రుసుము లేకుండా ప్రయాణికులకు కేటాయించాలని ఆదేశించింది. ఈ నిబంధనపై ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌లైన్స్, ఆకాశ ఎయిర్ వంటి సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నిర్ణయం వల్ల.. వాణిజ్యపరమైన చిక్కులు వస్తాయని, విమాన ఛార్జీల విధానం దెబ్బతింటుందని అబ్యంతరం చెప్పాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న ‘డీరెగ్యులేటెడ్ టారిఫ్’ విధానానికి ఇది విరుద్ధమని వాదించాయి. నిర్వహణ వ్యయం పెరిగి సంస్థలు ఆర్థికంగా నష్టపోయే ప్రమాదం ఉందని వివరించాయి.
మరిన్ని వీడియోల కోసం :
నో మోర్ డౌట్స్..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
రామాయణ టీజర్ అంచనాలను అందుకుందా?
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం
భయపడిన యూట్యూబర్ మధుమిత.. ఫ్యామిలీతో పరార్!
బాబోయ్.. వింతపాము...రెండు తలలు, నాలుగు కాళ్లతో
చీమల కోసం తవ్వితే.. పాము దొరికింది!నల్లమలలో బయటపడ్డ షాకింగ్ నిజం
ఆలయంలో అర్చకుల వింత జపం.. ఎందుకో మీరే చూడండి!
అద్భుతం.. ఒత్తి లేకుండానే దీపం వెలుగుతోంది!
షేర్ మార్కెట్ ఇన్వెస్టర్‌గా 28 రోజుల పసికందు!
హాయిగా నిద్రపోండి..12 లక్షలు గెలుచుకోండి..!

