నిరంతర అన్వేషణ.. హిట్టు కోసం వేట..!
ఒకప్పుడు రొటీన్ కథలతో సరిపెట్టుకున్న టాలీవుడ్ హీరోలు ఇప్పుడు రూట్ మార్చి సస్పెన్స్, అడ్వెంచర్‌తో కూడిన మిస్టికల్ థ్రిల్లర్ బాట పట్టారు. పురాతన రహస్యాలను ఛేదించడానికి, కొత్త ప్రపంచాలను ఆవిష్కరించడానికి మెగాస్టార్ చిరంజీవి, నాగచైతన్య, సాయి ధరమ్ తేజ్ వంటి స్టార్స్ సరికొత్త చిత్రాలతో సిద్ధమవుతున్నారు. ఈ ట్రెండ్‌లో వస్తున్న సినిమాల వివరాలివి.
టాలీవుడ్‌లో ప్రస్తుతం మిస్టికల్ మిస్టరీస్ ట్రెండ్ నడుస్తోంది. రొటీన్ ఫైట్లు, డ్యూయెట్లతో సరిపెట్టుకున్న మన హీరోలు ఇప్పుడు రూట్ మార్చి సస్పెన్స్, అడ్వెంచర్‌తో కూడిన మిస్టికల్ ప్రపంచంలోకి అడుగుపెడుతున్నారు. పురాతన రహస్యాలను ఛేదించడానికి, కొత్త ప్రపంచాలను ఆవిష్కరించడానికి స్టార్స్ అంతా సరికొత్త థ్రిల్లర్ బాట పట్టారు. మెగాస్టార్ చిరంజీవి నుండి సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ వరకు అందరిదీ ఇదే దారి. విరూపాక్షతో సంచలనం సృష్టించిన కార్తీక్ దండు, నాగచైతన్యతో చేస్తున్న వృషకర్మ పూర్తిగా మిస్టికల్ థ్రిల్లర్‌గా రూపొందుతోంది. ఈ సినిమాలో చైతు అన్వేషకుడిగా కనిపించనున్నారు. సాయి ధరమ్ తేజ్ కూడా సుజిత్ సందీప్‌ల దర్శకత్వంలో మైండ్ బ్లాక్ చేసే మిస్టికల్ థ్రిల్లర్‌లో నటిస్తున్నారు, ఇందులో తేజ్ డీప్ మిస్టరీని ఛేదించే ఇంటెన్స్ ఫ్యాంటసీ రోల్‌లో సర్ప్రైజ్ చేయబోతున్నారు. చిరంజీవి నటిస్తున్న విశ్వంభర సైతం సోషియో-ఫ్యాంటసీకి మైథాలజీ టచ్ యాడ్ చేసిన భారీ మిస్టికల్ అడ్వెంచర్‌గా తెరకెక్కుతోంది.
మరిన్ని వీడియోల కోసం :
నో మోర్ డౌట్స్..కన్ఫార్మ్ చేసిన చెర్రీ
రామాయణ టీజర్ అంచనాలను అందుకుందా?
హద్దులు చెరిపేస్తున్న యంగ్ హీరోలు
గాజాలో కంటతడి పెట్టిస్తున్న చిన్నారుల ఆట దృశ్యం
జీతం పెరిగినా బ్యాంక్ బ్యాలెన్స్ పెరగటం లేదా..?
వరలక్ష్మీ వ్రతం చేశారు...అమ్మవారికి పెట్టిన నగలు కాలువలో పడేశారు!
కళ్ల ముందే కాలిబూడిదైన బైక్..!
నువ్వెవడ్రా.. పెద్ద డాక్టర్‌వా! డాక్టర్‌పై రోగి కుమారుడు దాడి
రెస్టారెంట్లో శాండ్విచ్ తింటున్న కస్టమర్..సగం తిన్నాక అందులో
అమెరికాలో ఏడాదికి రూ. కోటి సంపాదన.. కానీ మిగిలేదెంత?
ఒక్క మెసేజ్‌తో ప్రియుడ్ని.. కటకటాల్లోకి పంపించిన ప్రియురాలు!

