అరటిపండ్లు ఎక్కువ రోజులు తాజాగా ఉండాలంటే..

06 April 2026

Jyothi Gadda

అరటిపండ్లు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. కానీ వీటిని నిల్వ చేయడం ఒక పెద్ద సవాలు. కొన్న రెండు రోజులకే ఇవి మెత్తబడిపోవడం లేదా నల్లగా మారిపోవడం చూస్తుంటాం. అందుకే ఈ సింపుల్ టిప్స్ మీ కోసమే

అరటిపండ్లను ప్లేటులో లేదా నేలపై పెట్టడం వల్ల వాటిపై ఒత్తిడి పడి ఆ భాగం త్వరగా పాడవుతుంది. దీనికి బదులుగా అరటి గెలను ఒక హుక్కుకు వేలాడదీయండి. దీనివల్ల పండ్ల చుట్టూ గాలి ప్రసరణ బాగుంటుంది.

అరటిపండ్లు పక్వానికి రావడానికి కారణమయ్యే ఇథిలీన్ గ్యాస్ ప్రధానంగా వాటి తొడిమ నుండి విడుదలవుతుంది. ప్లాస్టిక్ ర్యాప్ లేదా అల్యూమినియం ఫాయిల్ తీసుకుని తొడిమ భాగాన్ని గాలి చొరబడకుండా చుట్టండి.

ఆపిల్, ఆవకాడో, టమోటాల వంటి పండ్లు కూడా ఇథిలీన్ గ్యాస్‌ను విడుదల చేస్తాయి. కాబట్టి అరటిపండ్లను వీటితో కలిపి ఉంచకుండా వేటికి అవి విడి విడిగా ఉంచడం మంచిది.

అరటిపండ్లు తెచ్చిన వెంటనే కొద్దిగా వినెగర్ కలిపిన నీటిలో ముంచి ఆ తర్వాత ఆరబెట్టి నిల్వ చేస్తే, వాటిపై బ్యాక్టీరియా చేరకుండా ఉంటుంది. దీంతో ఎక్కువ రోజులు తాజాగా ఉంటాయి.

ఎండలో అరటి పండ్లు పెడితే త్వరగా పాడైపోతాయి. చల్లటి ప్రదేశంలోనే ఉంచండి. సూర్యరశ్మి నేరుగా పడే చోట పెట్టడం మంచిది కాదు. బాగా గాలి తగిలే ప్రదేశంలోనే ఉంచండి. లేదంటే త్వరగా పాడైపోతాయి.

అరటి పండ్లను పేపర్‌తో లేదా న్యూస్‌పేపర్‌లో చుట్టి పెడితే త్వరగా పాడైపోవు. ఎక్కువ రోజులు నిల్వ ఉంటాయి. పండ్లపై బరువు పెట్టడం లేదా బలంగా నొక్కడం వల్ల త్వరగా పాడైపోతాయి. జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి.

ఈ చిన్న జాగ్రత్తలు పాటించడం వల్ల ఆహారం వృథా కాకుండా చూసుకోవచ్చు. ఒకవేళ పండ్లు మరీ ఎక్కువగా పండిపోతే, వాటిని పారేయకుండా మిల్క్ షేక్స్ లేదా బనానా బ్రెడ్ తయారీలో వాడుకోవచ్చు.

అరటిపండ్లు పూర్తిగా పండిన తర్వాత మాత్రమే ఫ్రిజ్‌లో పెట్టాలి. పచ్చిగా ఉన్నప్పుడు పెడితే అవి సరిగ్గా పండవు. ఫ్రిజ్‌లో పెట్టినప్పుడు తొక్క నల్లగా మారినా, లోపల పండు మాత్రం తాజాగా ఉంటుంది.